సుకుమార్ ఇంట మెరిసిన స్టార్స్..

10TV Telugu News

Sukumar Daughter: బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఇంట టాలీవుడ్ స్టార్స్ సందడి చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులు, సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత, యువ సామ్రాట్ నాగ చైతన్య, సమంత తదితరులు సుకుమార్ కూతురికి ఆశీస్సులందజేశారు.

Tollywood Celebrities At Sukumar Daughter Function Photo

బుధవారం సుకుమార్ కూతురు ఓణీల ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. ఓ వైపు దర్శకుడిగా తన మార్క్ సినిమాలు చేస్తూనే, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై మంచి సినిమాలు నిర్మిస్తూ విజయపథంలో దూసుకెళ్తున్నారు సుకుమార్.

Tollywood Celebrities At Sukumar Daughter Function Photo

ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత మందిస్తున్నారు. ఆగస్టు 13న ‘పుష్ప’ రిలీజ్ కానుంది.

Tollywood Celebrities At Sukumar Daughter Function Photo