Toxic chemicals : బయోడిగ్రేడబుల్ పేపర్ బౌల్స్ లో నిల్వఉంచే ఆహార పదార్ధాలలో విషపూరిత రసాయనాలు! అధ్యయనాల్లో వెల్లడి

ఈ సమ్మేళనాలు నెమ్మదిగా క్షీణిస్తాయి. పర్యావరణం మరియు మానవ కణజాలంలో, ముఖ్యంగా కాలేయంపై ప్రభాన్ని చూపిస్తాయి. కెనడా, యుఎస్ మరియు స్విట్జర్లాండ్‌ల పరిశోధకులు 42 రకాల పేపర్ ఫుడ్ ప్యాకేజింగ్‌లను పరిశీలించారు.

Toxic chemicals : బయోడిగ్రేడబుల్ పేపర్ బౌల్స్ లో నిల్వఉంచే ఆహార పదార్ధాలలో విషపూరిత రసాయనాలు! అధ్యయనాల్లో వెల్లడి

Dangerous PFAS chemicals

Toxic chemicals : బర్గర్‌లు, ఫ్రై ఫుడ్స్ ను తీసుకునేందుకు చాలా మంది ఇష్టపడతారు. అయితే వీటిని నిల్వవుంచేందుకు , ఒకచోటి నుండి మరొక చోటికి తీసుకువెళ్ళేందుకు పేపర్ బ్యాగులు మరియు బయోడిగ్రేడబుల్ పేపర్ బౌల్స్‌ ను ఉపయోగిస్తారు. అయితే ఇటీవల అంతర్జాతీయ విద్యావేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనం ఈ విషయంపై షాక్ కు గురిచేసే వివరాలను వెల్లడించింది. పేపర్ బ్యాగులు, బయోడిగ్రేడబుల్ పేపర్ బౌల్స్ లో మానవ ఆరోగ్యం మరియు పర్యావరణం రెండింటికీ హాని కలిగించే టాక్సిన్స్ ఎక్కువగా ఉంటాయని నిర్ధారించారు.

READ ALSO : ప్లాస్టిక్ పర్యావరణానికే కాదు.. శరీరానికి కూడా

సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పేపర్ బ్యాగ్‌లు మరియు బయోడిగ్రేడబుల్ ఫుడ్ కంటైనర్‌లపై నిషేదం ఉన్నప్పటికీ చాలా మంది వాటిని ఉపయోగిస్తున్నారు. పలు రకాల ఆహారపదార్ధాలను వాటిలోనే నిల్వ ఉంచుతున్నారు. పెర్ ఫ్లోరోక్టానోయిక్ సల్ఫేట్ సింధటిక్ సమ్మేళనాలలో ఒకటి. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీలో దీనిని చేరుస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ కంటైనర్ లు, రేపరులలో కాగితపు గ్రీజు నిరోధకత కోసం దీనిని ఉపయోగిస్తున్నారు.

ఈ సమ్మేళనాలు నెమ్మదిగా క్షీణిస్తాయి. పర్యావరణం మరియు మానవ కణజాలంలో, ముఖ్యంగా కాలేయంపై ప్రభాన్ని చూపిస్తాయి. కెనడా, యుఎస్ మరియు స్విట్జర్లాండ్‌ల పరిశోధకులు 42 రకాల పేపర్ ఫుడ్ ప్యాకేజింగ్‌లను పరిశీలించారు. వారు పరిశీలించిన వాటిలో బయోడిగ్రేడబుల్ పేపర్ బౌల్స్, శాండ్‌విచ్ మరియు బర్గర్ రేపర్లు, పాప్‌కార్న్ సర్వింగ్ బ్యాగ్‌లు మరియు డోనట్స్ వంటి స్వీట్‌ల కోసం ఉపయోగించే బ్యాగ్‌లు ఉన్నాయి. .

శాస్త్రవేత్తలు పెర్ ఫ్లోరోక్టానోయిక్ యొక్క కీలకమైన ఫ్లోరిన్ కోసం పేపర్ ఫుడ్ ప్యాకేజింగ్‌ను విశ్లేషించగా, 45 శాతం నమూనాలలో ఫ్లోరిన్ ఉందని కనుగొన్నారు. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లెటర్స్ జర్నల్‌లో నివేదించబడిన పరిశోధనలు, బయోడిగ్రేడబుల్ పేపర్ బౌల్స్ , హాంబర్గర్‌లు, పేస్ట్రీలు , డోనట్స్‌తో సహా జిడ్డుగల ఆహారాలకు ఉపయోగించే పేపర్ బ్యాగ్‌లలో ఫ్లోరిన్ మరియు పిఎఫ్‌ఎఎస్ అత్యధిక సాంద్రతలు ఉన్నాయని వెల్లడించింది.

READ ALSO : Plastic Bottled Water : ప్లాస్టిక్ బాటిల్ వాటర్ ఎంత డేంజరో తెలుసా?

యూనివర్శిటీ ఆఫ్ టొరంటో పర్యావరణ డిపార్ట్‌మెంట్‌లోని ప్రొఫెసర్ మిరియం డైమండ్ ప్రకారం పెర్ ఫ్లోరోక్టానోయిక్ అనేది ప్యాకేజింగ్ గిన్నె , బ్యాగ్ ల నుండి ఆహారంలోకి చేరుతుంది. గతంలో చేసిన అధ్యయనాలు ఆహారం వేడిగా , నూనెగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుందని నిర్ధారణకు వచ్చాయి.

దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగడం, ఇమ్యునోలాజికల్ పనితీరు మరియు సంతానోత్పత్తిని తగ్గటం, జీవక్రియ, ఊబకాయం పెరిగే ప్రమాదం, జంతువులలో అనేక ప్రతికూల ఆరోగ్య పరిణామాలకు కారణమౌతుంది.