Winter : చలికాలంలో దూరప్రయాణాలు చేస్తున్నారా! కొన్ని జాగ్రత్తలు పాటించటం బెటర్?

చలికి రక్తనాళాల్లో ప్రసరణ తగ్గిపోవడం తో పాటుగా రక్తం గడ్డకట్టడంతో గుండె పోటు ప్రమాదాల ముప్పు ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవాళ్లు తప్పకుండా స్వెట్టర్స్‌ వేసుకుని ఉండాలి. చలికాలంలో జలుబులు, జ్వరాలూ వచ్చేస్తాయి. దూర ప్రయాణాలు వీలైనంతవరకు పొద్దున్నే బయలుదేరడం మేలు.

Winter : చలికాలంలో దూరప్రయాణాలు చేస్తున్నారా! కొన్ని జాగ్రత్తలు పాటించటం బెటర్?

Traveling long distances in winter! Better to take some precautions?

Winter : శీతాకాలం అందమైన శీతాకాల దృశ్యాలను చూసేందుకు ఆహ్వానిస్తుంది. దీంతో చాలా మంది దూర ప్రాంత ప్రయాణాలకు సిద్ధమౌతారు. అయితే బయలుదేరే ముందు, భద్రత వారీగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. శీతాకాలం వ్యాధుల సీజన్ అని పిలుస్తారు, తరచుగా ప్రయాణాలు చేసే వ్యక్తులు వారు తినే ఆహారం, నిద్రవేళలు, సౌకర్యాలపై రాజీధోరణితో వ్యవహారిస్తారు. దీని వల్ల ఆరోగ్యం పై దీర్ఘకాలిక ప్రభావం పడుతుంది.

వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. చలి కారణంగా శరీర ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతాయి. ఆ సమయంలో శరీరంలో ఎక్కు వ భాగం కవర్‌ అయ్యే విధంగా దుస్తులు ధరించాల్సిన అవసరం ఉంది. చలి సమయంలో వీలైనంత వరకు బయట తిరగకుండా పనులు త్వరగా ముగించుకుని ఇంటికి చేరుకోవాలి. చలికాలంలో రాత్రి వేళ గుండెపోటులు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నందున వీలైనంత వరకు చలిగాల్లో బయట ఉండకుండా ఉండటమే మంచిది.

చలికి రక్తనాళాల్లో ప్రసరణ తగ్గిపోవడం తో పాటుగా రక్తం గడ్డకట్టడంతో గుండె పోటు ప్రమాదాల ముప్పు ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవాళ్లు తప్పకుండా స్వెట్టర్స్‌ వేసుకుని ఉండాలి. చలికాలంలో జలుబులు, జ్వరాలూ వచ్చేస్తాయి. దూర ప్రయాణాలు వీలైనంతవరకు పొద్దున్నే బయలుదేరడం మేలు. చలికాలంలో ఉదయాన్నే లేవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. కాని ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది.

ప్రయాణానికి సిద్ధమయ్యే ముందుగానే బయలుదేరేముందే అక్కడి వాతావరణం ఎలా ఉందో ముందుగానే కనుక్కోండి. పొగమంచు ఎలా ఉండబోతుందనేది ముందుగానే వాతావరణ వివరాల్లో తెలుసుకోండి. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చలిగాలుల ప్రభావంతో ఇలాంటి వాళ్లు త్వరగా అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

రాత్రి సమయంలో రోడ్డు ప్రయాణాలు చేస్తే పొగమంచు ఎక్కువగా ఉంటుంది.తెల్లవారుజాము వరకు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వాతావరణ పరిస్థితులను గమనించి ప్రయాణాలు సాగించడం మంచిది. ఇన్‌ఫెక్షన్ల అవకాశమూ ఉంటుంది. కొన్ని మందులు అంటే జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి లాంటి వాటికి సంబంధించిన మందులు తప్పనిసరిగా తీసుకెళ్లండి. స్వెట్టర్లతో పాటుగా బ్లాంకెట్ కూడా అదనంగా తీసుకెళ్లండి.

చలి కాలంలో ముఖ్యంగా స్వీట్లు, ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్‌ను తాగటం ఆపేయాలి. తాగునీరు కూడా చల్లగా కాకుండా గోరువెచ్చగా చేసి తాగితే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.