Trouble Sleeping : రాత్రి నిద్రపట్టక ఇబ్బందిపడుతున్నారా! ఈ చిట్కాలు పాటిస్తే?

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొనసాగించాలి. రాత్రి సమయంలో స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. రాత్రిపూట తేలికైన ఆహారం తినండి. నిద్రవేళకు కనీసం గంట ముందు రాత్రి భోజనం ముగించండి.

Trouble Sleeping : రాత్రి నిద్రపట్టక ఇబ్బందిపడుతున్నారా! ఈ చిట్కాలు పాటిస్తే?

Trouble Sleeping At Night

Trouble Sleeping : రాత్రి సమయంలో నిద్రలేమి సమస్య చాలా మందిని బాధిస్తుంది. రాత్రి నిద్రపోకపోతే అది ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఛాతీ నొప్పి, హృదయ స్పందన పెరగడం, అధిక రక్తపోటు సమస్యలకు నిద్రలేమి కారణం కావచ్చు. ప్రపంచ జనాభాలో 10-30% మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నిద్రలేమి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. నిద్రలేమి ఏకాగ్రతను దెబ్బ తీస్తోంది. అధిక రక్తపోటు, ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్ ,గుండెపోటు ప్రమాదం పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యంగా ఉండాలంటే 8-9 గంటల నిద్ర అందరికి అవసరం. రాత్రి వేళ ప్రశాంతమైన నిద్ర వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

రాత్రి సమయంలో కాఫీ, స్ట్రాంగ్ టీ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. ఫోన్, కంప్యూటర్ స్క్రీన్ ల వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. వీటి నుండి వెలువడే బ్లూ కిరణాలు నిద్రకు భంగం కలిగిస్తాయి. పడుకునే ముందు ఫోన్, టీవీ, కంప్యూటర్ స్క్రీన్‌కు దూరంగా ఉండటం మంచిది. పుస్తకాలు చదవడం వంటివి చేయటం వల్ల నిద్ర త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకింగ్ ,ఆల్కహాల్ వంటి అలవాట్లను మానుకోవటం మంచిది. వీటిలో ఉండే నికోటిన్,ఆల్కహాల్ నిద్రకు అంతరాయం కలిగిస్తాయి. కాబట్టి వాటిని పూర్తిగా నివారించండి.

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొనసాగించాలి. రాత్రి సమయంలో స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకూడదు. రాత్రిపూట తేలికైన ఆహారం తినండి. నిద్రవేళకు కనీసం గంట ముందు రాత్రి భోజనం ముగించండి. పడుకునే ముందు మెడిటేషన్ సాధన చేయవచ్చు. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. నిద్రపోయే పడకగదిని చక్కగా అలంకరించుకోండి. లేత రంగు గోడలు, లేత రంగు బెడ్ షీట్లు, కర్టెన్లు ఏర్పటు చేసుకోవాలి. పడకగదిలో అక్వేరియం, టీవీ, గడియారం, ఫ్రిజ్ వంటి శబ్దాలు వచ్చేవి ఏవీ ఉంచవద్దు. వీటివల్ల నిద్రకు ఆటంకాలు ఏర్పడతాయి.

పగటి పూట నిద్రపోయే అలవాటును మానేయాలి. ఎందుకంటే మధ్యాహ్నం నిద్ర వల్ల రాత్రి ఆలస్యంగా నిద్ర పడుతుంది. రాత్రి పూట నిద్రకు ముందు చల్లని నీటితో స్నానం చేయాలి. చలికాలంలో అయితే గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయటం వల్ల శారీరక మలినాలు తొలగడంతో పాటు, మనసు తేలికపడుతుంది. త్వరగా నిద్రపడుతుంది. అయితే కొంత మందిలో శరీరపరంగా ఆనారోగ్య కారణాల వల్ల రాత్రి సమయంలో నిద్రపట్టదు. అలాంటి సమయంలో తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. సొంతంగా ఎలాంటి మందులు వాడుకోవటం ఆరోగ్యానికి అంత మంచిదికాదు.