Glowing Skin : అందమైన మెరిసే చర్మాన్ని ఒక్కరాత్రిలో సొంతం చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి!

మార్కెట్‌లో లభ్యమయ్యే ఉత్పత్తుల కంటే సహజంగా తయారు చేసుకున్న వాటితో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవటం చాలా సులభం. సింపుల్ రెమెడీలను ప్రయత్నించటం ద్వారా ఒక్క రాత్రిలో ముఖం చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు.

Glowing Skin : అందమైన మెరిసే చర్మాన్ని ఒక్కరాత్రిలో సొంతం చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి!

Glowing Skin : అందమైన మెరిసే చర్మం సొంతం కావాలని అంతా కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలు అందమైన చర్మం కోసం మార్కెట్లో లభించే వివిధ రకాల ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖ చర్మం గ్లోయింగ్‌గా , షైనీగా కనిపించాలని కోరుకుంటారు. మార్కెట్‌లో లభ్యమయ్యే ఉత్పత్తుల కంటే సహజంగా తయారు చేసుకున్న వాటితో చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవటం చాలా సులభం. సింపుల్ రెమెడీలను ప్రయత్నించటం ద్వారా ఒక్క రాత్రిలో ముఖం చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. ఇందుకు కోసం ఏంచేయాలో చూద్దాం..

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ వాటర్ ను పోయాలి. వాటర్ హీట్‌ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి. పేస్ట్ ల వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లబడిన తరువాత ఓ పల్చటి వస్త్రంలో ఈ పేస్టును వేసుకోవాలి.

అలాగే మరోవైపు ఒక ఆరెంజ్‌ను తీసుకొని సగానికి కట్ చేసి జ్యూస్‌ను తీయాలి. ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో తయారుచేసి పెట్టుకున్న అవిసె గింజల పేస్ట్ వేయాలి. అలాగే మూడు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ గ్లిజరిన్ వేసుకుని ఐదు నిమిషాల పాటు స్పూన్ తో బాగా కలుపు కోవాలి. రాత్రి నిద్రకు ముందు ముఖానికి అప్లై చేసి వేళ్లతో కొద్ది సేపు మసాజ్ చేసుకోవాలి. అలాగే వదిలేసి మరుసటి రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రంగా ముఖాన్నికడుక్కోవాలి. ఇలా చేస్తే ఒక్క రాత్రిలోనే మీ ముఖం గ్లోయింగ్‌గా, షైనీగా కనిపిస్తుంది.