Tumors : గర్భదారణకు అడ్డంకిగా గర్భసంచిలో గడ్డలు!

ఈ గడ్డల వల్ల సంతానలేమి సమస్య వస్తుంది. గర్భాశయం లోపల, గోడల పొరల్లో, ముఖద్వారం దగ్గర.. ఎక్కడ గడ్డలున్నా, పిండం తయారు కాదు. కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, కొన్నిసార్లు జీర్ణ సమస్యలు ఎదురవుతాయి.

Tumors : గర్భదారణకు అడ్డంకిగా గర్భసంచిలో గడ్డలు!

Tumors In The Uterus

Tumors : గర్భ సంచిలో గడ్డలు రావడానికి అనేక కారణాలు. పునరుత్పత్తి వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషించే గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు అనే గడ్డలు కొందరు మహిళల్లో తయారవుతూ ఉంటాయి. గడ్డలు రావటానికి జన్యు పరంగా వచ్చేకారణం ఒకటి కాగా, ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టరాన్‌ హార్మోన్లు కూడా దీనికి కారణం అవుతాయి. ఫైబ్రాయిడ్స్‌ మీద ఈస్ట్రోజన్‌ రిసెప్టార్లు ఉంటాయి. శరీరంలో ఈస్ట్రోజన్‌ హార్మోన్ల శాతం ఎక్కువైనప్పుడు రిసెప్టార్లు యాక్టివేట్‌ అయిపోయి, ఫైబ్రాయిడ్ల పరిమాణం పెరుగుతుంది. కొన్నిసార్లు ఈస్ట్రోజన్‌ వల్ల ఫైబ్రాయిడ్‌ పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల కంటే చిన్న ఫైబ్రాయిడ్లను వైద్య చికిత్స సహాయంతో తగ్గించుకోవలసి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్‌ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో గడ్డలు కనిపించడం, నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి.ఒకవేళ ఫైబ్రాయిడ్స్‌ చాలా పెద్దవిగా ఉంటే, గర్భసంచి పక్కన ఉండే మూత్రాశయం మీద ఒత్తిడి పడడం మూలంగా మూత్రసంబంధ సమస్యలు వస్తాయి.

ఈ గడ్డల వల్ల సంతానలేమి సమస్య వస్తుంది. గర్భాశయం లోపల, గోడల పొరల్లో, ముఖద్వారం దగ్గర.. ఎక్కడ గడ్డలున్నా, పిండం తయారు కాదు. కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, కొన్నిసార్లు జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటివి ఉన్నప్పుడు ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అలా్ట్రసౌండ్‌ స్కానింగ్‌ చేయుంచుకుంటూ ఫైబ్రాయిడ్ల పరిమాణాన్ని కనిపెడుతూ ఉండాలి. సంతానం కలగకముందే గర్భసంచిలోపల గడ్డలు వస్తే, వాటిని హిస్టెరోస్కోపిక్‌ రిసెక్షన్‌ ద్వారా తొలగిస్తారు. ఆ తర్వాత గర్భంధరించవచ్చు. గోడల్లో రెండు సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న గడ్డలు మాత్రమే మందులతో కరిగిపోతాయి. అదే గోడల్లో 4-5 సెంటీమీటర్ల పరిమాణంలో గడ్డలు ఉంటే వైద్యులు వాటికి ఇంజక్షన్ల ద్వారా చికిత్స అందిస్తారు. ఐదు సెంటీమీటర్ల కంటే పెద్ద గడ్డలపై ఈ ఇంజెక్షన్లు ఏమాత్రం పని చేయవు. శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు.

ఇందుకు గాను ఫైబ్రాయిడ్‌ను మాత్రమే తొలగించే మయోమెక్టమీ, ఫైబ్రాయిడ్‌తో పాటు, గర్భసంచిని కూడా తొలగించే హిస్ట్రక్టమీ సర్జరీలను ఎంచుకోవలసి ఉంటుంది. అయితే ఎవరికి ఏ సర్జరీ అవసరం అనేది వారి వారి వయసు, ఫైబ్రాయిడ్‌ మూలంగా తలెత్తే సమస్యల మీద ఆధారపడి ఉంటుంది. ఫైబ్రాయిడ్‌ సైజును బట్టి, వయసును బట్టి, బాధిస్తున్న సమస్యలను బట్టి సర్జరీ అవసరాన్ని వైద్యులు అంచనా వేసి తగిన చికిత్సను అందిస్తారు.