కొత్త స్ట్రెయిన్ వైరస్.. పెద్దల కంటే పిల్లల్లోనే ప్రాణాంతకమా? సైంటిస్టులు ఏమంటున్నారు?

కొత్త స్ట్రెయిన్ వైరస్.. పెద్దల కంటే పిల్లల్లోనే ప్రాణాంతకమా? సైంటిస్టులు ఏమంటున్నారు?

UK COVID-19 Strain may Infect Kids : కరోనా కొత్త స్ట్రెయిన్‌తో చిన్నారులకు ముప్పు పొంచి ఉందా? రూపం మార్చుకున్న స్పైక్‌ ప్రొటీన్‌ పసిపిల్లలపై ప్రభావం చూపుతుందా? సైంటిస్టుల ఆందోళనకు కారణమేంటి? అంతుపట్టడం లేదు. యూకేను కలవరపెడుతోన్న కరోనా వైరస్ స్ట్రెయిన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొత్త స్పైక్‌ ప్రొటీన్‌ చాలా డేంజరస్‌ అంటోన్నారు శాస్త్రవేత్తలు. చైనాలో పుట్టిన కరోనా వైరస్‌ ఇంతవరకు పెద్దలపైనే తన ప్రతాపాన్ని చూపింది. పిల్లలపై మహమ్మారి పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ కొత్తరకం స్ట్రెయిన్‌ పిల్లల్లో త్వరగా వ్యాపించే అవకాశముందని సైంటిస్టులు చెబుతున్నారు.

ఈ కొత్త మ్యుటేషన్ ముందు జాతుల వైరస్ ల కంటే ఎక్కువగా పిల్లల్లో వ్యాపించే ప్రమాదం ఉండొచ్చునని అంటున్నారు. ఇప్పటి వరకు, COVID-19 ఎక్కువగా పెద్దలను ప్రభావితం చేసింది, కాని పిల్లలు కొత్త జాతి వైరస్ బారిన పడే అవకాశం ఉందంటున్నారు. 15 ఏళ్లలోపువారిలో వేరియంట్ కేసులు గణాంకపరంగా నాన్-వేరియంట్ వైరస్ కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. మ్యుటేషన్ – VUI 202012/01 లండన్ ప్రాంతంలో కేసులు భారీగా పెరిగాయని తెలిపారు.ఈ స్ట్రెయిన్ మానవ శరీరంలోకి ప్రవేశించగానే వైరస్‌కు సంబంధించిన మార్పులు మొదలవుతాయని, పెద్దలతో పాటు చిన్నారుల్లోనూ రోగనిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉందంటున్నారు.

కొత్త స్ట్రెయిన్ చిన్నారుల శరీర కణాలలోకి ప్రవేశించిన తర్వాత సులభంగా మార్పుచెందుతుందన్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే పిల్లలకు కరోనా కొత్త స్ట్రెయిన్ ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉందంటున్నారు వైద్య నిపుణులు. దక్షిణ బ్రిటన్‌లో ఈ స్ట్రెయిన్ తీవ్ర రూపం దాల్చిందని, శరవేగంగా వ్యాప్తి చెందే చాన్స్‌ ఉందంటున్నారు. చిన్నారుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. పిల్లలను బయటకు తీసుకురావొద్దని. కరోనా సోకిన వ్యక్తులకు వారిని దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు వైద్యులు.