ఒత్తిడి తగ్గుతుంది: విద్యార్ధులను గొయ్యిలో పడుకోవాలన్న యూనివర్సిటీ

  • Published By: veegamteam ,Published On : November 11, 2019 / 05:27 AM IST
ఒత్తిడి తగ్గుతుంది: విద్యార్ధులను గొయ్యిలో పడుకోవాలన్న యూనివర్సిటీ

సాధారణంగా ఒత్తిడిని పోగొట్టే చికిత్స విషయానికి వస్తే.. ప్రజలు చాలా రాకాల ట్రీట్మెంట్లను ఎంపిక చేసుకుంటారు. వాటిలో కొన్ని మనకు తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియనివి ఉంటాయి. అయితే ఒత్తిడి తగ్గించాడానికి సంభందించిన విషయం ఒకటి మీకు తెలిస్తే షాక్ అవుతారు. ఇది వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుతుంది కానీ చాలా సులభంగా ఒత్తిడిని తగ్గిస్తోందట.  

డచ్ సిటీ నిజ్‌మెగన్‌ లోని రాడ్‌బౌడ్ యూనివర్సిటీ…ఒత్తిడి తగ్గించడానికి ఓ విచిత్రమైన ట్రీట్మెంట్ ను విద్యార్థులకు అందిస్తుంది. అదేంటంటే.. ఎవరికైతే ఒత్తిడిగా అనిపిస్తోందో వాళ్లు ఓ గొయ్యి తీసి అందులో పడుకుంటే వారి ఒత్తిడి చిటికెలో మాయం అవుతోందని తెలిపింది. అయితే ఈ గొయ్యిలో పడుకోడానికి వారికి ఓ చాప, దిండు ఇస్తారట. ఫోన్ తీసుకుపోవటం కుదరదట. 

యూనివర్సిటికి చెందిన ఓ విద్యార్ధి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ విషయం కాస్త.. లేటుగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజంగానే అందులో పడుకుంటే తాము ఒత్తిడి నుంచి బయటపడుతున్నామని యూనివర్సిటీ విద్యార్ధులు చెబుతున్నారు.