Thermometers Sale Alert : రెడ్ అలర్ట్.. ఈ థర్మోమీటర్లు కొంటున్నారా? మీ పిల్లల ఆరోగ్యం జాగ్రత్త!

అసలే కరోనా కాలం.. అందులోనూ వర్షాకాలం.. సీజన్ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.. అందుకే చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. పిల్లల్లో ఉన్నట్టుండి హై ఫీవర్ వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

Thermometers Sale Alert : రెడ్ అలర్ట్.. ఈ థర్మోమీటర్లు కొంటున్నారా? మీ పిల్లల ఆరోగ్యం జాగ్రత్త!

Red Alert Warning Over ‘unreliable’ Thermometers For Sale

Thermometers Sale Alert : అసలే కరోనా కాలం.. అందులోనూ వర్షాకాలం.. సీజన్ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.. అందుకే చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. పిల్లల్లో ఉన్నట్టుండి హై ఫీవర్ వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఇంట్లోనే థర్మామీటర్లు తెచ్చిపెట్టేసుకుంటున్నారు. కొంచెం అనారోగ్యంగా అనిపించినా చెక్ చేసుకోవడం కామన్ అయిపోయింది. అయితే.. హై ఫీవర్ అనేది.. కరోనా సహా అనేక అనారోగ్య సమస్యలకు కారణం కావొచ్చు. మహమ్మారి పరిస్థితుల్లో జ్వరాన్ని చెక్ చేసే థర్మోమీటర్లకు భారీ డిమాండ్ పెరిగిపోయింది. ఎక్కువ సంఖ్యలో థర్మమీటర్లను కొనుగోలు చేసేస్తున్నారు. ఇంతకీ మీరు కొనుగోలు చేసే థర్మోమీటర్లు నమ్మదగినవేనా? నాసిరకమైనవి మార్కెట్లోనే చాలానే ఉన్నాయి.

వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. లేదంటే మీ పిల్లల ఆరోగ్యానికి ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (MHRA) ప్రకారం.. యూకే మార్కెట్లో లభించే థర్మోమీటర్లలో కచ్చితమైనవి కంటే నాసిరకమైనవే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. అల్ట్రా వైలెట్ థర్మోమీటర్లు (gun-shaped devices) గన్ ఆకారంలో డివైజ్‌లు ఉంటాయి. తల మీద పెట్టి శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడూ చెక్ చేసుకోవచ్చు. టెంపరేచర్ స్కానర్లతో శరీర ఉష్ణోగ్రతను కొలవవచ్చు. ఒక్కోసారి వాతావరణం బట్టి కూడా శరీర ఉష్ణోగ్రతలో మార్పు రావొచ్చు. అప్పుడు ఈ థర్మో మీటర్లు కూడా తప్పుగా రీడింగ్ చూపించే అవకాశం ఉంటుంది. కరోనాకు కారణమయ్యే జ్వరాలను గుర్తించేందుకు ఈ థర్మల్ మీటర్లను వినియోగిస్తుంటారు. సాధారణంగా హై టెంపరేచర్ 38డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 41 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది.

Ce

థర్మోమీటర్లు నాసిరకమని గుర్తించడం ఎలా?
యూకే మార్కెట్లో అన్ని థర్మోమీటర్ డివైజ్ లకు ఆమోదం ఉండదు. చాలావరకూ నాసిరకమైనవే ఆన్ లైన్ మార్కెట్లో లభిస్తుంటాయి. హై టెంపరేచర్ గుర్తించడంలో సరిగా పనిచేయవు. ఇంతకీ థర్మోమీటర్లు నమ్మదగినవా? లేదా నాసిరకమైనవో గుర్తించేందుకు ఆయా డివైజ్‌లపై కొన్ని గుర్తులు ఉంటాయి. అందులో ఎక్కువగా కనిపించేది.. CE లేదా UKCA మార్క్.. ఈ మార్క్ ఉంటేనే యూకేలో సేల్ కు అనుమతి ఉంటుంది. యూకేలో చాలామంది అవగాహన లేకపోవడంతో నాసిరకమైన థర్మోమీటర్లను కొనుగోలు చేస్తున్నారని MHRA డివైజెస్ డివిజన్ డైరెక్టర్ Graeme Tunbridge అంటున్నారు. ఆన్ లైన్ లేదా ఏదైనా స్టోర్ లో ఈ థర్మోమీటర్లను కొనుగోలు చేసేముందు చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు. CE లేదా UKCA మార్క్ ఉందో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.

1. తయారీదారు పేరు, చిరునామా చెక్ చేయాలి.
2. యూకే లేదా EUలో తయారీదారు అవునో కాదో చూడాలి. చిరునామా, పేరు కూడా చెక్ చేయాలి.
3. CE మార్క్ సింబల్ తో పాటు 4 డిజిట్ నెంబర్, కరెక్ట్ ఫార్మాట్ లో ఉందో లేదో చూడాలి.
4. మోడల్ నెంబర్ లేదా డివైజ్ పేరు చూడాలి.
5. బ్యాచ్ నెంబర్ కూడా ఒకటికి రెండుసార్లు చెక్ చేయాలి.

ఈ ఐదింటిలో ఏది మిస్ అయినా అది నాసిరకమైనదిగా గుర్తించాలి. అలాంటి డివైజ్ కొనుగోలు చేయరాదని MHRA సూచిస్తోంది.

Tharmo