బ్యాంకుల హెచ్చరిక : UPI పేమెంట్ చేస్తున్నారా.. ఈ తప్పు చేయకండి!

  • Published By: sreehari ,Published On : November 6, 2019 / 10:32 AM IST
బ్యాంకుల హెచ్చరిక : UPI పేమెంట్ చేస్తున్నారా.. ఈ తప్పు చేయకండి!

ఏటీఎం మోసాలతో ఆగలేదు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు UPI పేమెంట్స్ మోసాలకు తెగబడ్డారు. యూనిఫయిడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) ప్లాట్ ఫాంపై UPI పేమెంట్స్ చేసే యూజర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. అదే స్థాయిలో UPI పేమెంట్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుల అవసరం లేకుండానే కస్టమర్లు ఈజీగా తమ మొబైల్స్ ద్వారా UPI పేమెంట్స్ చేసుకునే వీలుంది. ఈ సదుపాయంతో యూజర్లకు ఎంత సౌకర్యవంతంగా ఉందో సైబర్ నేరగాళ్ల మోసాలకు కారణం అవుతోంది. 

మొబైల్ ఫోన్ల ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ ఫీచర్ సాయంతో ఒక బ్యాంకు అకౌంట్ నుంచి మరో అకౌంట్ కు సులభంగా లావాదేవీలు చేసుకుంటున్నారు. కానీ, సైబర్ మోసగాళ్లు UPI పేమెంట్స్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. కస్టమర్లను నమ్మించి వారి అకౌంట్లలో నగదును కాచేస్తున్నారు. UPI పేమెంట్స్ విషయంలో చాలామంది కస్టమర్లకు సరైన అవగాహన లేకపోవడాన్ని మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. UPI మోసాలపై బ్యాంకులు కూడా తమ కస్టమర్లను ఎప్పటికప్పుడూ అలర్ట్ చేస్తూనే ఉన్నాయి. 

HDFC బ్యాంకు కూడా తమ కస్టమర్లను UPI పేమెంట్స్ విషయంలో హెచ్చరిస్తోంది. మొబైల్ ఫోన్ల ద్వారా యూజర్ల UPI పేమెంట్స్ యాక్సస్ చేసుకుని అకౌంట్లలో నగదు తస్కరిస్తున్నట్టు అలర్ట్ చేస్తోంది. యూపీఐ మోసాల బారిన పడకుండా యూజర్లు తమ నగదును ఎలా కాపాడుకోవాలో HDFC కొన్ని జాగ్రత్తలు సూచిస్తోంది. ఇలాంటి తప్పులను చేయకుండా ఉంటే మీ నగదును భద్రపరుచుకోవచ్చు. 

AnyDesk – థర్డ్ పార్టీ Apps డౌన్‌లోడ్ చేయొద్దు : 
* సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ యూజర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు.
* బ్యాంకు అధికారులుగా నమ్మబలికి యూజర్లకు ఫోన్ కాల్స్ చేస్తారు.
* మీ కార్డు బ్లాక్ అవుతుందని లేదా అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని భయపెడతారు.
* బ్యాంకు యాప్ లో బగ్ ఉందని, మొబైల్ బ్యాంకింగ్ డిజేబుల్ అవుతుందని నమ్మిస్తారు.
* తమ మాటలు యూజర్ నమ్మగానే ఒక యాప్ డౌన్ లోడ్ చేయమని అడుగుతారు.
* అదే.. AnyDesk.. ఇదో మాల్ వేర్ యాప్.  రిమోట్ డివైజ్ కంట్రోల్ యాప్.
* ఈ యాప్ మీ మొబైల్లో ఇన్ స్టాల్ చేస్తే.. హ్యాకర్ల కంట్రోల్లోకి మీ డివైజ్ వెళ్లిపోతుంది.
* Team Viewer లేదా ఇతర థర్డ్ ఫార్టీ యాప్ UPI పేమెంట్స్ చేయొద్దు.
* UPI ద్వారా సైబర్ నేరగాళ్లు మోసపూరిత లావాదేవీలకు ప్రయత్నిస్తున్నారు.
* Any Desk యాప్ ఇన్ స్టాల్ చేయగానే.. యాప్ పర్మిషన్స్ అడుగుతుంది. 
* మీఫోన్లో జనరేట్ అయిన 9 డిజిట్ యాప్ కోడ్ ఎంటర్ చేయమని అడుగుతారు.
* ఆ 9 డిజిట్ యాప్ కోడ్ తమ చేతికి రాగానే.. మీ ఫోన్ హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్తుంది.

UPIలో ‘Collect Request’ ఫీచర్ :
* చాలామంది యూజర్లకు Collect Request ఫీచర్ పై అవగాహన ఉండదు. 
* UPIలో డబ్బులు పంపాలంటే వారి VPA లేదా ఇతర వివరాలు తెలిసి ఉండాలి.
* ఎవరైనా మీకు UPI ద్వారా Collect Request పెడితే అప్రమత్తం అవ్వండి. 
* వారి VPA తెలియకపోయినా డబ్బులు వారి అకౌంట్లోకి వెళ్లడం జరుగుతుంది.
* మీ బ్యాంకు అకౌంట్ నుంచి నేరుగా నగదు వారికి అకౌంట్లోకి వెళ్లిపోతుంది. 
* మోసగాళ్లు పంపిన Collect Request తెలియక Confirm చేస్తే నగదు పోయినట్టే.
* వెంటనే మీ బ్యాంకు అకౌంట్లో నుంచి నగదు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. 
* మీ VPAకు Collect Request అని ఎవరైనా Send చేస్తే.. స్పందించకండి.
* Collect Request.. ఇదొక రివర్సల్, రిఫండ్ పేమెంట్ ఫీచర్ అని మర్చిపోకండి.
* ఇలా వస్తే.. మీ అకౌంట్లోని నగదు ఇతర అకౌంట్లోకి వెళ్తుంది జాగ్రత్త. 

UPI మోసాలను ఎలా Avoid చేయాలంటే :
* మీకు ఎవరైనా ఫోన్ కాల్ చేసి ఏదైనా App డౌన్ లోడ్ చేయమంటే చేయొద్దు.
* ఏదైనా మీ అకౌంట్లకు సంబంధించి వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే ఇవ్వొద్దు.
* మీ ఫోన్ నెంబర్లకు ఏదైనా అనుమానిత Text మెసేజ్, Link పంపిస్తే క్లిక్ చేయొద్దు.
* ఆ లింకులను డిలీట్ చేయడం లేదా దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేయండి.
* అకౌంట్లు, క్రెడిట్ కార్డు సమస్యలపై బ్యాంకు అధికారులు కాల్స్ చేయరు, SMS పంపరు.
* మీ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో పెట్టే ప్రయత్నం చేయొద్దు.. 
* UPI మోసాలకు దారితీసే అవకాశాలు ఎక్కువ.