Brain Tumors: యూరిన్ శాంపుల్స్‌తో బ్రెయిన్ ట్యూమర్ టెస్ట్

ట్రీట్మెంట్‌పరంగా అత్యంత ఛాలెంజింగ్ టైప్ క్యాన్సర్ లలో బ్రెయిన్ ట్యూమర్స్ ఒకటి. ఏదో ఒక న్యూరాలాజికల్ లక్షణం బయటపడిన తర్వాతే డాక్టర్లు వీటిని తెలుసుకోగలరు.

Brain Tumors: యూరిన్ శాంపుల్స్‌తో బ్రెయిన్ ట్యూమర్ టెస్ట్

Brain Tumors

Brain Tumors: ట్రీట్మెంట్‌పరంగా అత్యంత ఛాలెంజింగ్ టైప్ క్యాన్సర్ లలో బ్రెయిన్ ట్యూమర్స్ ఒకటి. ఏదో ఒక న్యూరాలాజికల్ లక్షణం బయటపడిన తర్వాతే డాక్టర్లు వీటిని తెలుసుకోగలరు. అవయవాలు పాక్షికంగా పనిచేయకుండా పోవడం లేదా మాటలో తడబాటు వంటివి వచ్చాకే కనుగొనగలం. నాగోయా యూనివర్సిటీలోని జపాన్ రీసెర్చర్లు ఈ విషయాన్ని కనుగొన్నారు.

వారి పరిశోధనల ఫలితంగా యూరిన్ శాంపుల్ ఒక్క బిందువుతో microRNA టెస్టు నిర్వహించి ఫలితాన్ని తెలుసుకోవచ్చు.

microRNA అంటే mRNA లేదా మెసేంజర్ RNAలాంటివి కాదు. ఇందులో నాన్ కోడింగ్ RNAలు కీలకంగా వ్యవహరిస్తాయి. చాలా చిన్న సైజులో ఉండే మాలిక్యూల్స్ లేదా న్యూక్లిక్ యాసిడ్ లు శరీరంలో ఉంటూ బయోలాజికల్ ఫ్లూయిడ్స్ అయిన నీరు, యూరిన్ లాంటి వాటిలో ఉండిపోతాయి.

నాగోయా యూనివర్సిటీ రీసెర్చర్లు.. ఈ మైక్రో ఆర్ఎన్ఏలను బ్రెయిన్ ట్యూమర్లను గుర్తించడానికి ఉపయోగించొచ్చని తెలుసుకున్నారు. మనిషిని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండానే యూరిన్ శాంపుల్ తీసుకోవచ్చు. అలా తీసి బ్రెయిన్ ట్యూమర్ పరీక్షలో వాడొచ్చు. అంతకంటే ముందు యూరిన్ శాంపుల్ తో పలు రకాల క్యాన్సర్లను ప్రొస్ట్రేట్, బ్లాడర్, లంగ్ క్యాన్సర్ గుర్తించొచ్చని నిపుణులు అంచనా.

గతంలో బ్రెయిన్ ట్యూమర్ వచ్చినా.. లేదంటే బ్రెయిన్ ట్యూమర్ తో ఇబ్బందిపడుతున్నా.. యూరిన్ శాంపుల్స్ తో సమస్య తీవ్రతన కనుగొనవచ్చు. ఈ డివైజ్ లలో 100మిలియన్ జింగ్ ఆక్సైడ్ నానో వైర్స్ తో ఉంటాయి. వీటి సాయంతో సింగిల్ మిల్లీలీటర్ తోనే ట్యూమర్ రిజల్ట్ తెలిసిపోతుంది.