Delta Variant : వ్యాక్సిన్ తీసుకున్నోళ్ల నుంచి డెల్టా వేరియంట్ సోకుతుందా?

కరోనా వ్యాక్సిన్లు వచ్చేశాయి.. ఇక కరోనావైరస్ అంతమైనట్టే అనుకున్నాం.. కానీ, వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. కరోనావైరస్ నిరోధించే సామర్థ్యం వ్యాక్సిన్లకు ఉందా? అనే అనుమానం కలుగక మానదు. కరోనా టీకా తీసుకున్నవారి ద్వారా కూడా వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది.

Delta Variant : వ్యాక్సిన్ తీసుకున్నోళ్ల నుంచి డెల్టా వేరియంట్ సోకుతుందా?

Vaccinated People Can Spread Delta Covid Variant, Have Similar Viral Load As Unvaccinated

Delta Covid Variant : కరోనా వ్యాక్సిన్లు వచ్చేశాయి.. ఇక కరోనావైరస్ అంతమైనట్టే అనుకున్నాం.. కానీ, వైరస్ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. కరోనావైరస్ నిరోధించే సామర్థ్యం వ్యాక్సిన్లకు ఉందా? అనే అనుమానం కలుగక మానదు. కరోనా టీకా తీసుకున్నవారి ద్వారా కూడా వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉందని పలు అధ్యయనాల్లో తేలింది. ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే.. వ్యాక్సిన్ తీసుకున్నవారి నుంచి డెల్టా వేరియంట్ ఇతరులకు వేగంగా వ్యాపించే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో నిర్వహించిన అధ్యయనాల్లోనూ ఇదే ఫలితాలు వెల్లడయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో డెల్టా వేరియంట్లను తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా అడ్డుకోగలదని, అలాగే వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని అంటున్నారు నిపుణులు.

డెల్టా వేరియంట్ ద్వారా వైరస్ వ్యాప్తి పెరగడానికి గల కారణాలను పరిశోధకులు కనుగొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జూన్ 29 నుంచి జులై 31వరకు పరిశోధక బృందం ఒక కొత్త అధ్యయనాన్ని మొత్తం 719 మందిపై నిర్వహించింది. వారి నుంచి PCR టెస్టులను విశ్లేషించారు. థ్రెషోల్డ్ (Ct) సైకిల్ పై కూడా అధ్యయనం నిర్వహించారు. 719 మందిలో వ్యాక్సిన్ వేయించుకున్న 311మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వారిలో Ct విలువ 25 కంటే తక్కువగా ఉందని గుర్తించారు. Ct విలువ తక్కువగా ఉంటే వైరల్ లోడ్ ఎక్కువ ఉందని అర్థం. వ్యాక్సిన్ తీసుకున్నా లేకున్నా డెల్టా వేరియంట్ వ్యాప్తి ఒకేలా ఉందని నిపుణులు వెల్లడించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారినుంచి ముక్కు ద్వారా స్వాబ్ సేకరించారు. ఆయా నమూనాల్లోనూ వైరల్ లోడ్ ఎక్కువగానే ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

మసాచూసెట్స్ యూనివర్సిటీకి చెందిన నిపుణులు నిర్వహించిన అధ్యయనాల్లోనూ ఇదే ఫలితాలే కనిపించాయి. డెల్టా పాజిటివ్ కేసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనే ఎక్కువగా ఉంటున్నాయని కనుగొన్నారు. బ్రేక్త్రూ ఇన్ఫెక్షన్లకు డెల్టా వేరియంట్ కారణమని నిపుణులు భావిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన బాధితులు ఆస్పత్రిలో చేరడం, మరణాలను తగ్గించడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా ఇండోర్ ప్రాంతాల్లో భౌతిక దూరం, మాస్కులు ధరించడం లాంటి కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.