COVID-19 Survivors Vaccine : కరోనా టీకా.. వేరియంట్ల నుంచి రక్షిస్తుంది.. వైరస్ స్పైక్ ప్రోటీన్ రక్త నాళాలను దెబ్బతీస్తుంది!

ప్రపంచాన్ని పట్డిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే వ్యాక్సిన్ తప్ప మరొక దారి లేదు. వ్యాక్సిన్లతోనే వైరస్ నిర్మూలన సాధ్యమనేది రెండు కొత్త అధ్యయనాల్లో తేలింది. ఎందుకంటే.. వ్యాక్సిన్లు కరోనా వేరియంట్ల నుంచి రక్షించగలదు.

COVID-19 Survivors Vaccine : కరోనా టీకా.. వేరియంట్ల నుంచి రక్షిస్తుంది.. వైరస్ స్పైక్ ప్రోటీన్ రక్త నాళాలను దెబ్బతీస్తుంది!

Vaccine Protects Covid 19 Survivors Against Variants; Virus' Spike Protein Damages Blood Vessels

COVID-19 Survivors Vaccine : ప్రపంచాన్ని పట్డిపీడిస్తున్న కరోనా మహమ్మారిని అంతం చేయాలంటే వ్యాక్సిన్ తప్ప మరొక దారి లేదు. వ్యాక్సిన్లతోనే వైరస్ నిర్మూలన సాధ్యమనేది రెండు కొత్త అధ్యయనాల్లో తేలింది. ఎందుకంటే.. వ్యాక్సిన్లు కరోనా వేరియంట్ల నుంచి రక్షించగలదు. ఫైజర్ / బయోఎంటెక్ (PFE.N), mRNA వ్యాక్సిన్ వైరస్ జాతి నుంచి మాత్రమే కాకుండా ప్రాణాంతక వేరియంట్ల నుంచి కూడా రక్షించగల సామర్థ్యం ఉందని అధ్యయనాల్లో తేలింది. 51 మందికి టీకా ఒక మోతాదు అందించి వారిలో రోగనిరోధక శక్తిని యూకే పరిశోధకులు విశ్లేషించారు. ఇందులో 25 మంది గతంలో కరోనావైరస్ ప్రారంభ వెర్షన్‌ సోకినవారు ఉన్నారు.

వారంతా మొదటి వేవ్ వైరస్ నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వీరందరిలో UK, దక్షిణాఫ్రికాలో మొదట కనిపించిన కొత్త వైరస్ వేరియంట్లపై మెరుగైన యాంటీబాడీలను కలిగి
ఉన్నారు. అంతకుముందు వ్యాధి సోకిన వ్యక్తుల్లో వేరియంట్లను అంతం చేయగల యాంటీబాడీలను ఉత్పత్తి చేయలేదని నివేదిక తెలిపింది. టీకా రెండు మోతాదుల తరువాత
US పరిశోధకులు 30 మందిని ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. గతంలో వైరస్ సోకని 20 మందిలో రోగనిరోధక వ్యవస్థ కంటే COVID-19 నుంచి కోలుకున్న పది మందిలో
వైరస్‌ను నిలువరించడంలో 3.4 రెట్లు మెరుగ్గా ఉన్నాయని తేలింది.

యూకే, దక్షిణాఫ్రికా బ్రెజిల్ నుంచి కొత్త వేరియంట్లను నిలువరించినప్పుడు ఈ వ్యత్యాసం మరింత ఎక్కువగా ఉందని పరిశోధక బృందం తేల్చింది. యాంటీబాడీలతో దక్షిణాఫ్రికా వేరియంట్ 6.5 రెట్లు మెరుగ్గా నిరోధించడం సాధ్యమైందని తేలింది. వ్యాక్సిన్.. COVID-19 స్పైక్ ప్రోటీన్ రక్త నాళాలను దెబ్బతీస్తుంది. కరోనావైరస్ కణాలలోకి ప్రవేశించడంలో సాయపడే స్పైక్ ప్రోటీన్లపై దాడిచేసి చంపేస్తుందని అధ్యయనంలో తేలింది.

COVID-19 శరీరంలోకి ప్రవేశిస్తే.. ఊపిరితిత్తులు మాత్రమే కాకుండా ఇతర అవయవాలపై కూడా దాడి చేస్తుంది. స్పైక్ ప్రోటీన్లు రక్త నాళాల కణాలకు నేరుగా నష్టాన్ని
కలిగిస్తాయి. టెస్ట్ ట్యూబ్ ప్రయోగాలలో స్పైక్ ఇంజనీరింగ్ వెర్షన్ ఎలుకల నుంచి పొందిన ధమని-లైనింగ్ కణాలను ఉపయోగించి కనుగొన్నారు. ఆరోగ్యకరమైన కణాలపై ACE2
ప్రోటీన్‌తో జతచేశారు. ఆ తరువాత, స్పైక్ ACE2 నుంచి మైటోకాండ్రియాకు సంకేతాలను దెబ్బతీస్తుంది. COVID-19 సోకినవారిలో రక్తం గడ్డకట్టడంతో పాటు కొంతమందికి
స్ట్రోకులు వచ్చాయి. మరికొంతమందికి శరీరంలోని ఇతర భాగాలలో ఎందుకు సమస్యలు ఉన్నాయని పరిశోధించారు.