Swiss Cheese Model : వ్యాక్సిన్లు ఒక్కటే కరోనా వ్యాప్తిని అడ్డుకోలేవు.. ఎందుకో తెలుసా?

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్‌ను వ్యాక్సిన్లు కట్టడి చేయలేవా? కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా? వైరస్ నియంత్రణలోకి రావడం లేదు. వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. ఎందుకిలా జరుగుతోంది. కరోనా వ్యాప్తిని ప్రస్తుత వ్యాక్సిన్లు అడ్డుకోలేవా అంటే.. అవుననే అంటున్నారు సైంటిస్టులు.

Swiss Cheese Model : వ్యాక్సిన్లు ఒక్కటే కరోనా వ్యాప్తిని అడ్డుకోలేవు.. ఎందుకో తెలుసా?

Vaccines Alone Will Not Stop Covid Spreading

Vaccines Swiss Cheese Model : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనావైరస్‌ను వ్యాక్సిన్లు కట్టడి చేయలేవా? కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా? వైరస్ నియంత్రణలోకి రావడం లేదు. వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. ఎందుకిలా జరుగుతోంది. కరోనా వ్యాప్తిని ప్రస్తుత వ్యాక్సిన్లు అడ్డుకోలేవా అంటే.. అవుననే అంటున్నారు సైంటిస్టులు. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం కరోనా వ్యాక్సిన్లు ఒక్కటే కరోనా మ్యుటేషన్లను కట్టడి చేయలేవని చెబుతున్నారు. అందుకు ఇతర కఠినమైన చర్యలు ఎంతో అవసరమని సూచిస్తున్నారు. ఏ ఒక్క చర్య కూడా కరోనా వ్యాప్తిని 100శాతం అడ్డుకోలేదు..

అందులో వ్యాక్సిన్లు కూడా అడ్డుకోలేకపోవడమే ప్రధాన సమస్య.. స్విస్ చీజ్ మోడల్ ద్వారా వైరస్ వ్యాప్తిపై వివరణ ఇచ్చారు.. స్విస్ చీజ్ లో అనేక హోల్స్ ఉన్నాయి.. దీన్ని 9 ముక్కలుగా కట్ చేసి చూడండి.. ఒక్కో పొర వైరస్ నుంచి ఎదుర్కోవాలని సూచిస్తుంది. ఇందులో అన్ని ముక్కలు సరైనవి కావు. ఒక్కో హోల్.. ఎన్నో లోపాలు ఉన్నాయి. వీటి ద్వారా వైరస్ సులభంగా వ్యాపించగలదని సూచిస్తోంది. ఒకవేళ ఎక్కువ మొత్తంలో లేయర్లు ఉన్నట్టు అయితే.. వైరస్ ను అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్కో ముక్కను మడతపెడితే హోల్స్ మూసుకుపోయాయి.. ఇప్పుడు అలానే వ్యాక్సిన్లు కూడా అత్యంత శక్తివంతమైనవిగా చెప్పవచ్చు. కానీ, కొన్ని వ్యాక్సిన్లు మాత్రమే కరోనాపై 90శాతం సమర్థవంతంగా పనిచేయగలవు. ప్రస్తుత కరోనా వ్యాక్సిన్లలో ఏ వ్యాక్సిన్ కూడా 100శాతం ప్రభావవంతం కాదు..

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా మళ్లీ కరోనా సోకే అవకాశం ఉంది. చాలామంది తమకు తెలియకుండానే వైరస్ ను ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చేస్తున్నారు. కాంట్రాక్ట్ ట్రేసింగ్ సిస్టమ్స్ ద్వారా వైరస్ బాధితులను ట్రాక్ చేయొచ్చు. అలాంటివారిని వేరుచేసి ఐసోలేషన్ లో ఉండేలా సూచనలు ఇవ్వాలి. ఇలా చేయడం ద్వారా 80శాతం నుంచి 100 శాతం వ్యాప్తిని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పటికే చాలా దేశాలు కరోనా అనుమానితులను ఇంట్లోనే ఐసోలేషన్ కావాలని సూచిస్తున్నాయి. ప్రయాణికులను సైతం క్వారంటైన్ లోకి తరలిస్తున్నాయి. చాలామంది ఈ సలహాలు, సూచనల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది.

ముఖానికి మాస్క్ ధరించడం ద్వారా దగ్గు లేదా తుమ్ము, మాట్లాడడం ద్వారా వైరస్ తుంపర్లను బ్లాక్ చేస్తుంది. మాస్క్ లు కూడా సరిగా ధరించాలి. వైరస్ సోకకుండా ఉండేందుకు కనీసం 2 మీటర్లు (6 అడుగులు) ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే వైరస్ సోకే ప్రమాదం ఉంది. స్వచ్ఛమైన గాలి వెంటిలేషన్ ద్వారా వైరస్ ముప్పును తగ్గించవచ్చు. సూర్యరశ్మిలోని అల్ట్రావాయిలైట్ రేడియేషన్ ఉపరితలాలపై ఉండే కరోనా వైరస్ ను నిర్మూలిస్తుంది. కానీ, బయటి ప్రాంతాల్లో వైరస్ ముప్పు జీరోకు తగ్గలేదని గుర్తించాలి. వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాల్లో వైరస్ సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

వెంటిలేషన్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో వైరస్ వ్యాప్తి ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. పరిశుభ్రత ద్వారా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చు. గాలిలోని వైరస్ కణాల ద్వారా ముప్పు అధికంగా ఉంటుంది. ఏ ఒక్క స్విస్ సీజ్ ముక్క ద్వారా వైరస్ సోకదనడానికి 100శాతం గ్యారెంటీ ఉండదని పరిశోధకులు చెబుతున్నారు. అందుకే సాధ్యమైనంత వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అవసరమైన ఇతర చర్యలు చేపట్టడం ద్వారా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయొచ్చునని సైంటిస్టులు చెబుతున్నారు.