Vattiver Roots : వేసవిలో శరీరానికి రక్షణనిచ్చే వట్టివేర్లు

వట్టివేర్లను పానకంలా తయారుచేసి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వట్టివేరు చర్మ సంబంధ వ్యాధులైన స్కాబిస్‌, దురదలు, బాయిల్స్‌, వాపులు, నొప్పులు, పగుళ్లు, రాష్‌లను పోగొట్టి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Vattiver Roots : వేసవిలో శరీరానికి రక్షణనిచ్చే వట్టివేర్లు

Vattiver

Vattiver Roots : వేసవి కాలంలో వట్టి వేర్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పురాతన కాలం నుండి వట్టి వేర్లు ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఈ వేర్లలో ఇనుము, మాంగనీస్‌, విటమిన్‌-బి6 పుష్కలంగా ఉంటాయి. వట్టి వేర్లు మంచి సువాసన, ఔషధగుణాలతోపాటు, చల్లదనాన్నీఇస్తాయి. ఈ వేర్లతో తయారుచేసిన చాపలను కిటికీలకు కట్టుకుంటారు. దీని వల్ల ఇంట్లోకి వేడిగాలికి బదులు చల్లని గాలి వస్తుంది. అంతేకాకుండా కూలర్లలో సైతం వీటిని వాడతారు. దాహం తీర్చుకునేందుకు, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు వట్టి వేర్ల నీటిని తాగటం మంచిది. ఒత్తిడి,ఆందోళన వంటి వాటిని తగ్గించటంతోపాటు, మానసిక ప్రశాంతత కలిగించటంలో వట్టివేళ్లను మించిందిలేదని చెప్పవచ్చు. శరీరంలో పెరుకుపోయిన మలినాలను బయటకు పంపుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి రక్తప్రసరణ బాగా సాగేలా చేస్తుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

గడ్డి జాతికి చెందిన ఈ మొక్క వేళ్లతో వేసవి పానీయాన్నీ తయారుచేస్తారు. రాత్రి సమయంలో ఒక మట్టి కుండలో వట్టి వేర్లను వేసి కుండ నిండుగా నీటిని పోసి మరుసటి రోజు ఆ నీటిని వడకట్టి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వేసవిలో శరీరంలో ఉన్న వేడిని తగ్గించటానికి సహాయ పడుతుంది. వట్టివేర్లను ముందుగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అనంతరం శుభ్రంగా కడిగి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం మిక్సీలో వేసి గ్రైండ్‌ చేసి వచ్చిన రసాన్ని వడకట్టి వేడిచేయాలి. బెల్లంపాకం పట్టి దాంట్లో ఈ రసం వేసి కలిపి చివరగా నిమ్మరసం పిండాలి. ఈ నీటిని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో సహజ శీతలికరణ సామర్ధ్యాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వడదెబ్బల నుండి రక్షిస్తుంది. మంటతోపాటు, అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవి వల్ల కలిగే వేడిని నివారిస్తుంది.

వట్టి వేర్లను కొబ్బరి నూనెలో వేసి పది రోజులు అలాగా ఉంచాలి. ఆ తర్వాత ప్రతి రోజు ఆ నూనెను జుట్టుకి రాస్తే జుట్టుకి సంబందించిన చుండ్రు సమస్యలు తొలగిపోతాయి. మార్కెట్లో లభించే వట్టివేళ్ల పొడిని నీటిలో కలిపి తీసుకోవచ్చు. అయితే ఎంత మోతాదులో వాడాలి అనే విషయాన్ని ఆయుర్వేద వైధ్య నిపుణుని సలహా తీసుకోని వాడుకోవటం మేలు. వట్టివేర్లు జ్వర తీవ్రతను తగ్గిస్తుంది. హృద్రోగులకు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవాళ్లకు మేలు చేస్తాయి. కళ్ల మంటలను తగ్గించటంతోపాటు చెమటకాయలు రాకుండా చేస్తాయి.

వట్టివేర్లను పానకంలా తయారుచేసి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వట్టివేరు చర్మ సంబంధ వ్యాధులైన స్కాబిస్‌, దురదలు, బాయిల్స్‌, వాపులు, నొప్పులు, పగుళ్లు, రాష్‌లను పోగొట్టి ఉపశమనాన్ని కలిగిస్తుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. యాంటీసెప్టిక్‌గా, నెర్వైన్‌ టానిక్‌గా, లైంగిక పటుత్వాన్ని పెంపొందిస్తుంది. వట్టివేరు నూనెను నిద్రలేమికి చికిత్స చేయడానికి వాడతారు. పెర్ఫ్యూమ్‌లు, రూమ్ ఫ్రెష్‌నర్‌ల తయారీలో సైతం ఉపయోగిస్తారు. వట్టి వేర్లతో షర్బత్ లా తయారు చేసుకుని తాగితే శరీరంలో వేడి మొత్తం పోతుంది.

గమనిక ; అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం అందించటం జరిగింది. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వైద్యుల సూచనలు , సలహాలు తీసుకుని తగిన చికిత్స పొందటం మంచిది.