Video games ఆడేవారిలో brain చురుగ్గా పని చేస్తుందంట..కానీ…

  • Published By: madhu ,Published On : September 30, 2020 / 09:27 AM IST
Video games ఆడేవారిలో brain చురుగ్గా పని చేస్తుందంట..కానీ…

Vidio Games Brain : కంప్యూటర్ ముందు కూర్చొని వీడియో గేమ్ (Vidio Game) ఆడడం మంచిందేనని అంటున్నారు స్పెయిన్ కు చెందిన ఒబెర్టా డి.కెటలూనియా పరిశోధకులు. ఆడే వారిలో మెదడు చురుగ్గా పని చేస్తుందని వెల్లడించారు. దీని ప్రభావం భవిష్యత్ లోనూ..కొనసాగుతుందని స్పష్టమైంది. ఎక్కువగా డిస్ ప్లే చూడడం వల్ల కంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.



ఇటీవలే ఒబెర్టా డి.కెటలూనియా ఓ సర్వే నిర్వహించింది. దీని కోసం 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న 27 మందిని నెల రోజుల పాటు పరీక్షించారు. కొంతమందికి వారి వారి పనులతో పాటు వీడియో గేమ్స్ ఆడిపించారు. మరికొందరిని వారి పనికి మాత్రమే పరిమితం చేశారు. మెదడు (Brain) ఎలా పని చేస్తుందని పరిశీలించారు.



వీడియో గేమ్స్ (Vidio Games) ఆడే వారి మెదడు చురుగ్గా పని చేస్తుందని గుర్తించారు. ఈ పరిశోధన ఫలితాలను ఉటంకిస్తూ…ప్రాంటియర్స్ ఓ కథనాన్న ప్రచురించింది. వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడడం వల్ల మెదడు దెబ్బతింటుందనే వాదనను వారు కొట్టిపారేశారు. మనలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఈ గేమ్స్ చక్కని మార్గమని, చిన్నారుల్లో చురుకుదనం భవిష్యత్ లో ప్రభావం చూపిస్తుందని పరిశోధనకు నాయకత్వం వహించిన శాస్త్రవేత్త మార్క్ పాలస్ వెల్లడించారు.



ఈయన 2017లో ఓ పరిశోధన చేశారు. వీడియో గేమ్స్ ఆడే వారిలో మెదడులోని హిప్పొకాంపస్ భాగం ఎక్కువగా పెరగడాన్ని గమనించారు. హిప్పొకాంపస్ అనేది నేర్చుకోవడం, వాటిని గుర్తు పెట్టుకోవడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దీనిని బట్టి భవిష్యత్ లో మతిమరుపు లాంటి సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉందంటున్నారు.



అయితే..ఇక్కడ ఏ వీడియో గేమ్ (Vidio Game) ఆడామన్నదే ప్రధాన అంశంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెదడకు అంతగా పని చెప్పని వీడియో గేమ్స్ ఆడిన వారి మెదడులో గ్రే మేటర్ తక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్ పరిశోధనల్లో వెల్లడైంది. మెదడు ఉపయోగించి ఆడాల్సిన పజిల్ గేమ్స్, ఆన్ లైన్ చెస్ గేమ్స్ తదితర ఆటలు ఉపయోగకరంగా ఉంటాయని గ్రేజరీ వెస్ట్ అనే పరిశోధకుడు చెబుతున్నాడు.