Tomato : టొమాటోల్లోని సి విటమిన్ శరీరానికి అందాలంటే!

అయితే టమాటాల్లో సి విటమిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది శరీరానికి పుష్కలంగా అందాలంటే అధిక ఉష్ణోగ్రత దగ్గర వండకూడదు. 50నుండి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ట మధ్య వండటం వల్ల వాటిలో ఉండే విటమిన్ సి శరీరానికి అందుతుంది.

Tomato : టొమాటోల్లోని సి విటమిన్ శరీరానికి అందాలంటే!

Tomato

Tomato : టొమాటో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజు వారిగా దీనిని ప్రతి ఇంటి వంటల్లో ఉపయోగిస్తారు. టొమాటోపై ఉండే ఎరుపు రంగు పొర‌ల్లో లైకోపిన్ ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే రోజుకు 25 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ లైకోపిన్ ఉండే ఆహారం అంటే ట‌మోటాను తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ ను ప‌ది శాతం వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. టొమాటో ఒక యాంటీ యాక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని నివారించటంతోపాటు గ్యాస్ స‌మ‌స్య‌ల‌కు ఉత్త‌మ ఔష‌ధం, చ‌క్కెర శాతాన్ని క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తుంది. కంటి చూపును మెరుగు ప‌రుస్తుంది. చ‌ర్మాన్ని కాంతివంతం చేస్తుంది. జుట్టుకు బ‌లాన్ని చేకూరుస్తుంది.

అయితే టొమాటోల్లో సి విటమిన్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది శరీరానికి పుష్కలంగా అందాలంటే అధిక ఉష్ణోగ్రత దగ్గర వండకూడదు. 50నుండి 70 డిగ్రీల సెంటీగ్రేడ్ట మధ్య వండటం వల్ల వాటిలో ఉండే విటమిన్ సి శరీరానికి అందుతుంది. ఎండలో ఎక్కువసేపు ఎండ పెట్టినా సి విటమిన్ పోతుంది. డీప్ ఫ్రిజ్ఞులో పెట్టినా కూడా విటమిన్ దక్కదని పరిశోధకులు చెప్తున్నారు. చారు, పప్పు, కూరలాంటివి వండుకునేప్పుడు టమాటా ముక్కల్ని కుక్కరులో ఉంచి ఉడికించటం వలన అందులోని విటమిన్ సి శరీరానికి అందకుండా పోతుంది.

అంతేకాకుండా టొమాటోలో రుచి కూడా పోతుంది. కూరలను వండటం పూర్తయి దింపేప్పుడు టమాటా కలిపి కొద్దిసేపు ఉంచి దింపేస్తే టమాటా తిన్నందువలన ప్రయోజనం దక్కుతుంది. కూర రుచిగా ఉంటుంది. టొమాటోని ఎక్కువ నీళ్లలో ఉడికించకూడదు. సన్న సెగనపై ఉడికించాలి. ఓవెన్లో అధిక ఉష్ణోగ్రత దగ్గర టమోటాను వండటం మంచిదికాదు. వండిన పదార్థాన్ని తిరిగి వేడి చేయటం వల్ల శరీరానికి అందాల్సిన విటమిన్స్ అందకుండా పోతాయి. టొమాటోల్లోని అన్ని ప్రయోజనాలు శరీరానికి అందాలంటే తాజాగా ఉన్న వాటిని సేకరించి ఆహార పదార్ధాలను తయారు చేసుకోవటం మంచిది.