Vitamin D Toxicity : విటమిన్ డి మోతాదు మించితే…

డి విటమిన్ అంటే ఎముకలు, దంతాలకు సంబంధించిన విటమిన్ గా భావించేవాళ్లు. మనం ఆహారం ద్వారా తీసుకున్న కాల్షియం ను శరీరం గ్రహించేలా చేయడానికి విటమిన్ డి కావాలి.

Vitamin D Toxicity : విటమిన్ డి మోతాదు మించితే…

Vitamin D Toxicity

Vitamin D Toxicity : ఇప్పుడు ఎవరిని చూసినా డి విటమిన్ తక్కువై కనిపిస్తున్నారు. డి విటమిన్ సప్లిమెంట్లు చాలామందికి అనివార్యం అవుతున్నాయి. విటమిన్స్ లాంటి సప్లిమెంట్లు అవసరం కదా అనిఎడాపెడావేసేసుకుంటే అసలుకే ఎసరొస్తుంది. మంచి చేయాల్సిన విటమిన్లే విషపదార్థాలవుతాయి. అలాంటి విటమిన్లలో డి విటమిన్ ఒకటి. ఇది తక్కువైనా సమస్యే. ఎక్కువైనా మరింత సమస్యే.

READ ALSO : Egg Benefits : రోజు వారి ఆహారంలో గుడ్డును చేర్చుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మన శరీరానికి ప్రధానంగా కావాల్సినవి కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లు. కానీ కొన్ని అత్యంత అవసరం కానీ.. చాలా తక్కువ మోతాదులో. వీటినే సూక్ష్మ పోషకాలు అంటారు. అవే.. విటమిన్లు, మినరల్స్. ఇవి చాలా తక్కువ శాతంలో అవసరం కదా అని లేకుంటే ఏమవుతుందనుకోవడానికి లేదు. అలాగని మోతాదు మించినా ప్రమాదమే.

ఇటీవలి కాలంలో ఎక్కువ మందిలో విటమిన్ డి లోపం కనిపిస్తున్నది. మన వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి, ఎముకల పటుత్వానికీ, చివరికి మానసిక ఆరోగ్యానికీ కూడా డి విటమిన్ అవసరం. డి విటమిన్ లోపిస్తే ఇమ్యూనిటీ తక్కువై తరచుగా ఇన్ ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ఇలాంటివాళ్లలోన్యుమోనియా, బ్రాంకైటిస్ లాంటి ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ.

READ ALSO : Rare And Strange fruits : పోషకాల మెండు .. ప్రపపంచలోనే విచిత్రమైన,ఆశ్చర్యపరిచే పండ్లు,వాటి విశేషాలు

మనది చలి ప్రదేశం కాదు. ఎండ ఎక్కువే. కాబట్టి ఎండ ద్వారా అందే విటమిన్ డి కూడా మనకు పుష్కలమే అనుకునేవాళ్లం. కానీ ఏసీ రూముల్లో ఎండ తగలకుండా పనిచేసుకోవడం, అపార్టుమెంట్లలో బందీలుగా ఉండటం వల్ల మన భారతీయుల్లో కూడా విటమిన్ డి లోపం ఎక్కువ అయింది.

ఒకప్పుడు గ్రామాల్లో వ్యవసాయం చేసుకునేవాళ్లు చొక్కా లేకుండా పొలాల్లో పనిచేసుకునేవాళ్లు. ఎండలో పొలం దాకా నడుస్తూ వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కూడా విటమిన్ డి లోపం కనిపిస్తున్నది.

READ ALSO : Women’s Health : మహిళల ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం అవసరమంటే ?

ఒకప్పుడు డి విటమిన్ అంటే ఎముకలు, దంతాలకు సంబంధించిన విటమిన్ గా భావించేవాళ్లు. మనం ఆహారం ద్వారా తీసుకున్న కాల్షియం ను శరీరం గ్రహించేలా చేయడానికి విటమిన్ డి కావాలి. అందుకే ఎముకలు, కీళ్లు, దంతాలు బలంగా పెరగడానికి ఇది సహాయపడుతుంది. అయితే కేవలం ఎముకలే కాదు.. దాదాపు అన్ని అవయవాలకూ విటమిన్ డి ఉపయోగపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

ఇన్నేట్ ఇమ్యూనిటీని పెంచడంలో ముఖ్యపాత్ర డి విటమిన్ ది. అందుకే ఇన్ ఫెక్షన్ల బారి నుంచి ఇది రక్షిస్తుంది. అయితే డి విటమిన్ ను సొంతంగా ఎవరికి వారే వేసుకోవద్దు. డాక్టర్ సూచనల ప్రకారమే, అదే మోతాదులో వాడాలి. లేకుంటే ప్రమాదం. విటమిన్ డి ని మోతాదుకు మించి వాడితే అనేక రకాల సైడ్ ఎఫెక్టులుంటాయి. వీటన్నింటినీ కలిపి విటమిన్ డి టాక్సిసిటీఅంటారు.

READ ALSO : Moong Dal : రక్తపోటు నియంత్రణలో ఉంచటంతోపాటు, బరువు తగ్గటంలో తోడ్పడే పెసరపప్పు!

ఎక్కువైతే… హైపర్ కాల్సీమియా

విటమిన్ డి టాక్సిసిటీలో ముఖ్యమైంది హైపర్ కాల్సీమియా. రక్తంలో కాల్షియం మోతాదు ఎక్కువ కావడం. విటమిన్ డి మోతాదు మించితే కాల్షియం లెవల్స్ లో తేడాలు వస్తాయి. దానివల్ల ఆకలి తగ్గిపోవడం, మలబద్ధకం, వికారం, రక్తపోటు పెరగడం లాంటి సమస్యలు వస్తాయి.

విటమిన్ డి ఎక్కువైతే కిడ్నీలపై కూడా దుష్ప్రభావం ఉంటుంది. ఎముకలపై వ్యతిరేక ప్రభావం పడి, వాటి డెన్సిటీ తగ్గుతుంది. ఇతరత్రా జీర్ణ సమస్యలు రావచ్చు