నిద్ర పట్టడం లేదా…. ఇవి తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చంట

  • Published By: venkaiahnaidu ,Published On : December 2, 2019 / 09:41 AM IST
నిద్ర పట్టడం లేదా…. ఇవి తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చంట

నిరంతరం ఏదో ఒత్తిడి, నిద్ర కూడా సరిగ్గా రానంత ఆందోళన.. శారీరక శ్రామ పెరిగిపోయి, మానసిక ఒత్తిడి కారణంగా ప్రశాంతమైన నిద్ర అనేక మందికి కరువైపోతుంది. అయితే సుఖమైన నిద్ర కోసం జీవన విధానంలో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది అంటున్నారు నిపుణులు. మనం నిద్రపోయే ముందు తీసుకునే ఆహారంలో కొన్ని ముఖ్యమైన పదార్ధాలను ఉంచుకోవడం ద్వారా ఈ రకమైన సుఖ నిద్రలను సొంతం చేసుకోవచ్చు.

1. పెరుగు లేదా వోట్స్‌తో చెర్రీస్:

నిద్రపోయే ముందు చెర్రీస్ కలిపి పెరుగు తీసుకోవడం లేదా ఓట్స్‌తో కలిపి చెర్రీస్ తీసుకోవడం మంచిది. చెర్రీస్‌కి యూరిక్ యాసిడ్ స్థాయిను తగ్గించే శక్తి ఉంది. చెర్రీస్ ను తీసుకోవడం ద్వారా ఒంట్లోని యూరిక్ యాసిడ్‌లు తగ్గుతాయి. తద్వార ఒత్తిడి తగ్గుతుంది. ఇది మీ శరీరాన్ని చల్లబరచడానికి మరియు విశ్రాంతి తీసుకోవడానికి రసాయనంగా సహకరిస్తుంది. తియ్యని, కాల్షియం అధికంగా ఉండే దీనిని పెరుగులో కలిపి స్నాక్ లాగా తసుకుంటే మంచిది. ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. మంచి నిద్రకు సహకరిస్తుంది. అలాగే చెర్రీస్ తో ఓట్ మీల్ తయారు చేసుకోవడం కూడా మంచిదే. ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరానికి చాలా మంచిది. ప్రోటీన్ ను పెంచుకుంటూ కొవ్వు కరిగించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

2. వాల్ నట్స్ :

వాల్ నట్స్ అంటే కేవలం డ్రై ఫ్రూట్స్ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. అలాగే ఇవి కేవలం మెదడుకి, మెమొరీ పవర్ ని మెరుగుపరచుతాయి అని తెలుసు. అయితే వాల్ నట్స్ కేవలం మెదడు ఆరోగ్యానికే కాదు.. వీటిని సరైన విధంగా తీసుకోవడం వల్ల అనేకమైన లాభాలు, ప్రయోజనాలు ఉన్నాయిని నిపుణులు సూచిస్తున్నారు. వీటిల్లో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్స్, మెగ్నిషియం, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, సోడియం పుష్కలంగా లభిస్తాయి. మెగ్నీషియంలో మెలటోనిన్ను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు నాడీ వ్యవస్థను చల్లబరుస్తుంది. తద్వారా నిద్ర పట్టాడానికి ఎంతో ఉపయోగపడుతాయి.

3. బంగాళాదుంపలు :

వాల్ నట్స్ లో వుండే పోషకాలు మాదిరిగానే బంగాళాదుంపలోను అలాంటి పోషకాలు ఉంటాయి. పిండి పదార్థాలను కలిగి ఉన్న ఈ దుంపలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. బంగాళాదుంపలో ఉండే విటమిన్ బి6 శరీరంలోని ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తాయి. ఆలులో పీచు పదార్థం ఉండటం వలన గుండెజబ్బుల నుండి రక్షణనిస్తుంది. పచ్చి బంగాళాదుంప రసం తీసుకుంటే జీర్ణాశయం, పేగుకు సంబంధించిన వ్యాధులు తగ్గుతాయి. బంగాళాదుంపలను సన్నగా కోసి ఆ ముక్కలను అలసిన కళ్లపై పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. అలాగే పచ్చి దుంప రసాన్ని ముఖానికి రాసుకుంటే కాంతివంతంగా ఉంటుంది. ట్రిప్టోఫాన్‌ను మెదడు గ్రహించడం సులభతరం కావటం వలన మీ శరీరం లో ఇది నియాసిన్ గా మార్చబడుతుంది. ఇది సెరోటోనిన్ తయారీకి సహాయపడుతుంది.

4. డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్స్ లో యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా లభిస్తాయి. డార్క్ చాక్లెట్ ఆరోగ్యం మెరుగుపరచడానికి మరియు గుండె సంబంధిత వ్యాధులను ప్రమాదం నుండి తగ్గించడానికి సహాయపడుతుంది. నిద్ర కోసం డార్క్ చాక్లెట్ తీసుకోవటం వలన మెదడులోని సెరోటోనిన్ మరియు ఇతర ఎండార్ఫిన్ల స్థాయిని పెంచుతుంది. కానీ అతిగా తినవద్దు.

5.అవోకాడో

అవకాడో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పండుగా చెప్పవచ్చు. అవకాడోలో పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ఎ,బి మరియు ఇ వంటి విటమిన్లు అధికంగా ఉంటాయి. అంతేకాక ఫైబర్స్ మరియు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అవకాడో రసంలో తేనె కలిపిన మిశ్రమం, పొడి చర్మానికి మంచి ఔషదంగా పని చేస్తుంది. ఈ మిశ్రమాన్ని మీ చర్మానికి పొరలా పూసి కొంచెం సమయం అలాగే ఉంచితే పొడి చర్మం వల్ల వచ్చే సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. అవోకాడోలో 10 శాతం పోటాషియం విలువలు కలిగి ఉంటుంది. దిని తీసుకోవటం వలన మీకు ఎక్కువ మోతాదులో కార్బోహైడ్రేట్స్ ,ఫైబర్ లభిస్తాయి.

6. వెచ్చని పాలు

రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు తీసుకోవటం వలన హాయిగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. దానితో పాటు మలబద్దం సమస్య ఉండదు. పాలలో వున్న ఔష‌ధ గుణాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. దాంతో ప్రశాంతమైన నిద్ర పడుతుంది.