హెల్తీ లైఫ్ కావాలంటే…వారానికి ఒకసారైనా రొమాన్స్ చేయాలంట. సైన్స్ చెప్పింది

  • Published By: sreehari ,Published On : July 30, 2020 / 06:34 PM IST
హెల్తీ లైఫ్ కావాలంటే…వారానికి ఒకసారైనా రొమాన్స్ చేయాలంట. సైన్స్ చెప్పింది

ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎవరూ కోరుకోరు.. హెల్తీ లైఫ్ కోసం అందరూ ఆరాటపడుతుంటారు. లేచిన దగ్గర్నుంచి వ్యాయామాలతో మొదలుపెట్టి.. డైట్ ఫుడ్ అంటూ కఠినమైన ఆహారపు అలవాట్లతో ఒకటే కుస్తీలు పడుతుంటారు. వాస్తవానికి ఇవన్నీ అర్లేదు అంటోంది సైన్స్.. మంచి ఆరోగ్యానికి శృంగారం కంటే మరో అద్భుతమైన ఔషధం మరొకటి లేదంటోంది..

వయస్సు పెరిగినా కనిపించదు. అంతేకాదు.. అకాల మృత్యువు ముప్పును తప్పించగల శక్తి శృంగారానికి ఉందంటున్నారు పరిశోధకులు.. అందుకే వారానికి ఒకసారైనా శృంగారంలో పాల్గొనాలని సూచిస్తున్నారు. శృంగారం.. అకాల మరణాన్ని సగానికి తగ్గిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర అనారోగ్యాలతో మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్శిటీ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ‘ శృంగారం పరిమిత తీవ్ర వ్యాయామానికి సమానమని చెబుతున్నారు.

Want to Live a Healthy Life? Have Sex Once a Week

శృంగారంలో పాల్గొనేవారికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని సూచిస్తున్నారు. దీనిపై పరిశోధనల కోసం పరిశోధనా బృందం 15,000 మందికిపైగా ఎంపిక చేసింది. వారిలో సగటున 39 ఏళ్లు వయస్సు కలిగి ఉన్నారు. వారి లైంగిక జీవితాలపై కూడా సుమారు 11 ఏళ్ల నాటి విషయాలపై పరిశోధకులు ప్రశ్నించారని ఓ రిపోర్టు నివేదించింది.

దాదాపు మూడొంతుల మంది కనీసం నెలకు ఒకసారి 36 శాతం మంది కనీసం వారానికి ఒకసారి శృంగారంలో చురుకుగా పాల్గొంటున్నారని పరిశోధకులు కనుగొన్నారు. సుదీర్ఘ అధ్యయనంలో 228 మంది మరణించారు.

వీరిలో 62 మంది క్యాన్సర్, 29 మంది గుండె జబ్బులతో ఉన్నారు. ఏడాదికి ఒకసారి లేదా అంతకంటే తక్కువ మాత్రమే సెక్స్ చేసిన వారి కంటే వారానికి సెక్స్ చేసిన వారు చనిపోయే అవకాశం 49 శాతం తక్కువగా ఉందని అధ్యయనం సూచిస్తోంది.

హృదయ సంబంధ వ్యాధులతో చనిపోయే వారి అసమానత 21 శాతం తక్కువగా ఉందని కనుగొన్నారు. క్యాన్సర్ నుంచి 69 శాతం తక్కువగా చెప్పవచ్చు. కొన్ని నివేదికల ప్రకారం.. లైంగిక ఆరోగ్యం-మంచి కెమికల్ రసాయనాలను విడుదల చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుందని, సహజ కిల్లర్ కణాల కార్యకలాపాలను ప్రోత్సహిస్తుందని అంటున్నారు. అలాగే ఈ కణాలు క్యాన్సర్, అనారోగ్యం ప్రమాదాన్ని సైతం తగ్గిస్తాయంట.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తాయి. ఉబ్బసం వంటి ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.