Warmer weather COVID-19 resurgence : సలసల మండే ఎండలు కూడా కరోనాను కంట్రోల్ చేయలేవు

ఉత్తర అర్ధగోళం మండిపోతోంది. ఎండలు పెరిగిపోతున్నాయి. బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయినా కరోనావైరస్ మాత్రం వేగంగా వ్యాప్తిచెందుతోంది.

Warmer weather COVID-19 resurgence : సలసల మండే ఎండలు కూడా కరోనాను కంట్రోల్ చేయలేవు

Warmer Weather May Not Control Covid 19 Resurgence

Warmer weather not control COVID-19 resurgence : ఉత్తర అర్ధగోళం మండిపోతోంది. ఎండలు పెరిగిపోతున్నాయి. బయటకు వచ్చే పరిస్థితి లేదు. అయినా కరోనావైరస్ మాత్రం వేగంగా వ్యాప్తిచెందుతోంది. కోవిడ్ మ్యుటేషన్లను ఎండలు కంట్రోల్ చేయలేమని హెచ్చరిస్తోంది వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ (WMO). ఈ మేరకు మార్చి 18, 2021 నివేదికను రిలీజ్ చేసింది. కరోనా వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వాలు కూడా సామాజిక దూరం, మాస్క్ తప్సనిసరి చేశాయి. ప్రయాణాలపై ఆంక్షలు విధించాయి.

2020లో కరోనా వ్యాప్తి ప్రభావంతో 2021లోనూ కరోనా తీవ్రత కొనసాగుతోందని పేర్కొంది. WMO టాస్క్ టీమ్ కో-చైర్ బెన్ జైట్ చిక్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎర్త్ అండ్ ప్లాంటరీ సైన్సెన్స్, జాన్స్ హోప్ కిన్స్ యూనివర్శిటీ, బల్టిమోర్ పేర్కొంది. మార్చి 23, 2020 నాటికి ఇండియాలో కరోనా వైరస్ బారినపడి 500 మందికి సోకగా.. 12 మంది మరణించారు. దాంతో భారత్ 30 రాష్ట్రాలు, 548 జిల్లాల్లో పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ఆంక్షలు విధించింది. అయితే ఈ లాక్ డౌన్ కూడా సమ్మర్‌లోనే విధించడం జరిగింది. అప్పట్లో కరోనావైరస్ ఎండల ఉష్ణోగ్రతల ప్రభావంతో నాశనమైపోతుందని అనుకున్నారంతా.. కానీ, వేసవిలోనే కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నాయి.

ఈ ఏడాది 2021లోనూ ఒకవైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 2021 నుంచి దేశంలో కొత్త కరోనా ఇన్ఫెక్షన్లు పెరిగిపోయాయి. మార్చి 17,2021 నాటికి ఇండియాలో 102 రోజుల్లో రికార్డు స్థాయిలో కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది.

అయితే వాతావరణం మార్పులతో వేసవిలో ఎండల అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల కరోనావైరస్ పూర్తిగా నిర్మూలన అవుతుందనడంలో వాస్తవం లేదని 16 సభ్యుల ప్యానెల్ నిపుణులు తమ నివేదికలో వెల్లడించారు. శ్వాసపరమైన వైరల్ ఇన్ఫెక్షన్లలో ఇన్ ఫ్లూయింజా, జలుబుకు కారణమయ్యే కరోనావైరస్ లు ఎక్కువగా సీజనల్ శీతాకాలంలో ఎక్కువగా వ్యాప్తిచెందుతాయని నిపుణులు తెలిపారు.