కొవిడ్ నుంచి సేఫ్ అవ్వాలంటే.. క్లాత్ మాస్క్‌లను ఇలా..

కొవిడ్ నుంచి సేఫ్ అవ్వాలంటే.. క్లాత్ మాస్క్‌లను ఇలా..

masks

సర్జికల్ mask‌లు లాంటి వాటిని సింగిల్ టైం యూజ్ చేసి పారేయొచ్చు. కానీ, cloth mask లు అలా కాదు. డైలీ వాడాలనుకుంటాం. కానీ, అవి ఎలా వాడితే సేఫ్. మనం జాగ్రత్తగా వాడుతున్నామా లేదా అని చెక్ చేసుకున్నారా.. క్లాత్ maskలు రోజూ ఉతుక్కుంటేనే సేఫ్ అని నిపుణులు చెబుతున్నారు.




అలా చేస్తేనే కరోనా లాంటి వైరస్ ల నుంచి రక్షణ కోసం అలా చేయడం తప్పనిసరి. ఒకసారి వాడేసిన maskలు ఎంతమాత్రం సురక్షితం కావనీ, వాటి ద్వారా వైరస్‌లు వ్యాపించే ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

ఇటీవల చేపట్టిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. న్యూ సౌత్‌వేల్స్‌ యూనివర్సిటీ టీం విశ్లేషణ ఆధారంగా.. ‘సర్జికల్‌ maskలను ఒకసారి వాడిన తర్వాత పారేస్తారు. వస్త్రంతో తయారైన maskలను మాత్రం మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది’




‘రోజూ ఉతుక్కొని, ధరించడం వల్ల ముప్పు కొంతమేర తగ్గుతుంది. maskలను చేతులతో కాకుండా, మెషీన్ సాయంతో ఉతుక్కోవడం బెటర్. 60 డిగ్రీల వేడి నీళ్లలో వాటిని నానబెట్టాలి. సబ్బును వినియోగించాలి’ అని ప్రొఫెసర్‌ రైనా మాక్లింటైర్‌ వివరించారు.

IPL 2020- RCB vs KKR: కోల్‌కత్తాపై 82పరుగుల తేడాతో గెలిచిన బెంగళూరు

5.25 శాతం నుంచి 8.25 శాతం గాఢత ఉన్న సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని బ్లీచింగ్ గా వాడుకోవచ్చు. ఐదు టీ స్పూన్ల బ్లీచింగ్ పౌడర్ వేసి రూం టెంపరేచర్ వేడి నీళ్లలో 5నిమిషాల సేపు నానబెట్టాలి. ఆ తర్వాత దానిని తీసేసి ఎండలో ఆరబెడితే సరిపోతుంది.