Watermelon Juice : అసిడిటీ నుండి ఉపశమనం పొందాలనుకునే వారికి పుచ్చకాయ జ్యూస్ బెటర్ !

పొటాషియం అధికంగా ఉండే పుచ్చకాయ రసం కడుపులో ఆమ్లాన్ని తటస్తం చేస్తుంది. ఇది మెటబాలిక్ రేటును వేగవంతం చేస్తుంది. ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి అసిడిటీ ఉంటే ఈ జ్యూస్‌లో కాస్త బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగండం మంచిది.

Watermelon Juice : అసిడిటీ నుండి ఉపశమనం పొందాలనుకునే వారికి పుచ్చకాయ జ్యూస్ బెటర్ !

watermelon juice

Watermelon Juice : పుచ్చకాయ వేసవి కాలంలో ఒక ప్రసిద్ధమైన పండుగా చెప్పవచ్చు. ఇది రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో హైడ్రేషన్‌కు ఉపకరిస్తుంది. పుచ్చకాయ పొట్ట ఆరోగ్యానికి మంచిది. ఇది మూత్ర విసర్జనను మెరుగుపరుస్తుంది. చర్మానికి మేలు చేస్తుంది. పుచ్చకాయ రసం ఎసిడిటీ సమస్యల నుండి మనకు రక్షణ నిస్తుంది.

READ ALSO : watermelon : పుచ్చకాయ తిన్న తర్వాత ఈ మూడు అస్సలు తినకండి

అసిడిటీలో పుచ్చకాయ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ;

1. యాసిడ్ రిఫ్లక్స్ తగ్గిస్తుంది ;

యాసిడ్ రిఫ్లక్స్ (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి) వల్ల పుల్లని త్రేనుపు, కడుపు మంట , అనేక ఇతర సమస్యలు ఎదురవుతాయి. పుచ్చకాయ రసం తాగడం వల్ల ఈ లక్షణాలు తగ్గుతాయి. దానితో పాటు ఆహారం జీర్ణమవుతుంది.

READ ALSO : Watermelon : వేసవిలో శరీరాన్ని చల్లగా,ఆరోగ్యంగా ఉంచే పుచ్చకాయ !

2. పొటాషియం సమృద్ధిగా ఉంటుంది ;

పొటాషియం అధికంగా ఉండే పుచ్చకాయ రసం కడుపులో ఆమ్లాన్ని తటస్తం చేస్తుంది. ఇది మెటబాలిక్ రేటును వేగవంతం చేస్తుంది. ఎసిడిటీ సమస్యను తగ్గిస్తుంది. కాబట్టి అసిడిటీ ఉంటే ఈ జ్యూస్‌లో కాస్త బ్లాక్ సాల్ట్ కలుపుకుని తాగండం మంచిది.

READ ALSO : Watermelon : వేసవిలో మీ శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడే పుచ్చకాయ !

3. పుచ్చకాయ జ్యూస్ మూత్రవిసర్జన ;

పుచ్చకాయ జ్యూస్ మూత్రపిండాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. టాక్సిన్‌ను బయటకు పంపడంలో పుచ్చకాయ రసం చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది, ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది. తద్వారా ఎసిడిటీని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న నేపధ్యంలో పుచ్చకాయ జ్యూస్ ను తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.