Watermelon Seeds : రక్తపోటును అదుపులో ఉంచే పుచ్చగింజలు!

పుచ్చగింజలు తినటం వల్ల నాడీ వ్యవస్థ పని తీరుని మెరుగుపడుతుంది. శరీరానికి ప్రశాంతతను చేకూర్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Watermelon Seeds : రక్తపోటును అదుపులో ఉంచే పుచ్చగింజలు!

Watermelon Seeds

Watermelon Seeds : పుచ్చకాయ ముక్కలను తిని గింజలను పడేస్తూఉంటారు. అయితే ఈ గింజలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. పుచ్చగింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పుచ్చ గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి తరువాత రోజు ఉదయం పైన ఉన్న పొట్టును తీసువేసి లోపలి పప్పుని తినాలి.

పుచ్చగింజలు తినటం వల్ల నాడీ వ్యవస్థ పని తీరుని మెరుగుపడుతుంది. శరీరానికి ప్రశాంతతను చేకూర్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. హైబీపీ ఉన్న‌వారు పుచ్చకాయ విత్త‌నాల‌ను తింటే బీపీ త‌గ్గుతుంది. బీపీ త్వ‌ర‌గా అదుపులోకి వస్తుంది. డీహైడ్రేషన్ సమస్యను నివారించటంతోపాటుగా, షుగర్ ను నియంత్రణలో ఉంచుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడే సిట్రులిన్‌ గింజల ద్వారా లభిస్తుంది.

ఈ గింజల్లో ఎల్ సిట్రులిన్ సమృద్ధిగా ఉండుట వలన కండరాలు బలంగా ఉండేందుకు మరియు కండరాల కణజాలాన్నిసరిచేయటంలో సహాయపడుతుంది. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నవారు, సంతానోత్పత్తి కలగక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారు పుచ్చగింజలను తినటం వల్ల స్పెర్మ్ సంఖ్యను పెంచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పుచ్చకాయ గింజల్లో గ్లుటామిక్ యాసిడ్, మాంగనీస్, లైకోపీన్, లైసిన్, అర్జినిన్ ఉంటాయి. ఇవి పురుషుల లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.

పుచ్చకాయ గింజలు తినడం వల్ల జీర్ణక్రియ మరియు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పుచ్చకాయ గింజల్ని తీసుకుని ఎండబెట్టుకున్న తరువాత ఎండిపోయిన ఆ గింజలు తీసుకొని పొడి చేసుకోవాలి. రెండు లీటర్ల నీటిలో రెండు టేబుల్ స్పూన్ పుచ్చకాయ గింజలు పొడి వేసి పావుగంట సేపు మరిగించాలి. ఈనీటిని నిల్వ ఉంచుకుని రెండు రోజుల పాటు తాగటం వల్ల మూత్ర సంబంధమైన ఇన్ ఫెక్షన్లు తొలగిపోతాయి. గుండె జబ్బుల ముప్పు నుండి బయటపడవచ్చు.