Watery Ears : చెవిలో నీరు కారుతుందా? చెవుడు వచ్చే ప్రమాదం

సమస్య ఉత్పన్న అయిన వారిలో చెవిదిబ్బడ, వినికిడి శక్తి తగ్గడం, చెవిలో మోతరావడం, గుటక వేసినప్పుడు చెవిలో శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చెవిలో నీరు కారటాన్ని గమనించిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించటం మంచిది.

Watery Ears : చెవిలో నీరు కారుతుందా? చెవుడు వచ్చే ప్రమాదం

Watery Ears : జ్ఞానేంద్రియాలలో చెవులు కూడా ఒకటి. శబ్ధాలను , ఇతరులు చెప్పే మాటలను వినటానికి చెవులు ఉపయోగపడతాయి. చెవులు చాలా సున్నితంగా ఉంటాయి. చెవుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించటం అవసరం. చెవులలో ఉండే కర్ణభేరి చాలా కీలకం. దీని అనుకోకుండా సమస్యలు ఉత్పన్నం అయితే వినికిడి లోపాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చెవులకు ఇన్ ఫెక్షన్ల కారణంగా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. వాటిలో చెవి నుండి నీరు కారటం అన్నది ప్రధాన సమస్య. దీనిని సిక్రిటరీ ఆటైటిస్ మీడియా గా చెప్తారు.

ఈ సమస్య ఉత్పన్న అయిన వారిలో చెవిదిబ్బడ, వినికిడి శక్తి తగ్గడం, చెవిలో మోతరావడం, గుటక వేసినప్పుడు చెవిలో శబ్దం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చెవిలో నీరు కారటాన్ని గమనించిన వెంటనే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించటం మంచిది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కర్ణభేరి నుండి మెదడు సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉంటుంది. దెబ్బతిని క్రమేపి చీము కారే అవకాశాలు ఉంటాయి. చెవి నుండి దుర్వాసన రావటం, కళ్లు తిరగటం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

చెవిలో నీరు కారుతున్న తొలదశలోనే గుర్తించి తగిన చికిత్స తీసుకోకుంటే సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుంది. దీని నుండి బయటపడేందుకు శస్త్రచికిత్స అవరపడవచ్చు. కాబట్టి సమస్య ఏదైనా కొద్దిగా ఉన్నప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందటం మంచిది. ముఖ్యంగా చెవి ఆరోగ్యం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదు.