Rich ICU Setup Home : ఆస్పత్రికి వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే ఐసీయూ సెట్ చేసుకుంటున్న బడాబాబులు

దేశంలో ఒకవైపు కరోనా వ్యాక్సిన్ కొరత.. మరోవైపు ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. అయినా టెన్షన్ పడాల్సిన పనిలేదు. బెడ్ దొరకడం లేదని హైరానా పడొద్దు.. మీ ఇంట్లోనే ఐసీయూ రూం సెట్ చేసుకోవచ్చు. కాకపోతే అందుకు తగ్గ డబ్బులు ఉంటే చాలు..

Rich ICU Setup Home : ఆస్పత్రికి వెళ్లక్కర్లేదు.. ఇంట్లోనే ఐసీయూ సెట్ చేసుకుంటున్న బడాబాబులు

Wealthy People Arranging Icu Setup At Home

Rich People ICU Setup at Home : దేశంలో ఒకవైపు కరోనా వ్యాక్సిన్ కొరత.. మరోవైపు ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. అయినా టెన్షన్ పడాల్సిన పనిలేదు. బెడ్ దొరకడం లేదని హైరానా పడొద్దు.. మీ ఇంట్లోనే ఐసీయూ రూం సెట్ చేసుకోవచ్చు. కాకపోతే అందుకు తగ్గ డబ్బులు ఉంటే చాలు.. ఇంట్లనే ఐసీయూ మీకు అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు డబ్బు ఉన్నవాళ్లంతా ఈ విధానాన్నే అనుసరిస్తున్నారు. ప్రైవేటు హెల్త్ కేర్ ను నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తున్నారు.

అడ్వాన్సడ్ మెడికల్ ఎక్విప్ మెంట్ ను కొనుక్కోని ఐసీయూలు రెడీ చేసుకుంటున్నారు. ఇంటి వద్దకే హెల్త్ కేర్ సంస్థలు సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కానీ, పెరిగిపోతున్న డిమాండ్ కారణంగా మెడికల్ ఎక్విప్ మెంట్ దొరికే పరిస్థితి కనిపించడం లేదు. ఆకస్మాక డిమాండ్ తో హోం ఐసీయూలను సమకూర్చడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హోం ఐసీయూ ఏర్పాటుకు రూ.15వేల నుంచి రూ.25వేల వరకు ఖర్చు అవుతుంది.

గడిచిన వారం రోజుల్లో ఈ ఎక్విప్ మెంట్, హోం ఐసోలేషన్ సర్వీసులకు డిమాండ్ వంద శాతం పెరిగిందని సంబంధిత సంస్థలు చెబుతున్నాయి. నాన్ ఇన్ వేసివ్ వెంటిలేటర్ ధర బ్రాండ్ ను బట్టి రూ.50వేల నుంచి రూ.2.50 లక్షల వరకు ఉంటుంది. మెడికల్ ఎక్విప్ మెంట్ సరఫరాలో కొరత ఏర్పడుతుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

నిన్న మొన్నటివరకు స్వల్ప కరోనా లక్షణాలతో ఇంట్లోనే చికిత్స పొందే బాధితులు హోం హెల్త్ కేర్ సర్వీసు సంస్థలు సేవలు అందిస్తున్నాయి. కానీ, ఇప్పుడు ఆస్పత్రుల్లో బెడ్ల కొరత తీవ్రం కావడంతో ఓ మాదిరి వైరస్ లక్షణాలు ఉన్నవారు ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. దాంతో హెల్త్ కేర్ సంస్థలకు డిమాండ్ పెరిగింది.