Weight Loss: ఎక్సర్‌సైజ్.. వర్కౌట్లు చేయకుండానే బరువు తగ్గించుకోవచ్చు..

క్సర్‌సైజ్ చేయడం ఫిజికల్‌గానే కాకుండా మెంటల్‌గానూ ప్రభావం చూపిస్తుంది. రొటీన్ డైట్ లో మార్పులు చేసుకుని నీరు సరిగ్గా తీసుకుంటే ఇది సాధ్యపడుతుందని అంటున్నారు.

Weight Loss: ఎక్సర్‌సైజ్.. వర్కౌట్లు చేయకుండానే బరువు తగ్గించుకోవచ్చు..

Excercise

Weight Loss: ఎక్సర్‌సైజ్ చేయడం ఫిజికల్‌గానే కాకుండా మెంటల్‌గానూ ప్రభావం చూపిస్తుంది. రొటీన్ డైట్ లో మార్పులు చేసుకుని నీరు సరిగ్గా తీసుకుంటే ఇది సాధ్యపడుతుందని అంటున్నారు. సరిపడినన్ని అడుగుల దూరం నడిస్తే చాలు ఎటువంటి ఎక్సర్‌సైజ్, వర్కౌట్‌లు చేయకుండానే బరువు తగ్గిపోవచ్చట. కొందరు బద్ధకంతో ఎక్సర్‌సైజ్, వర్కౌట్‌లకు దూరంగా ఉంటే మరికొందరు హార్మోన్లు సమతుల్యం లేక చేయడానికి ఇష్టపడరు.

మీ ఆహారాన్ని మీరే:
మీ ఆహారాన్ని మీరే వండుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీరు పరోక్షంగా వర్కౌట్ చేసినట్లే. ఇలా ఆహారాన్ని మీరే రెడీ చేసుకునే ప్రక్రియలో అందులో ఏం కావాలో.. ఎలా తింటే డైట్ కు కరెక్ట్ గా సరిపోతాయో.. తెలుస్తుంది. ప్రత్యేకించి కొంచెం తిన్నప్పటికీ హెల్తీగా తయారయ్యే ఆహారాన్నే తినగలం.

మనస్సు ఆహారంపై:
మనస్సు ఆహారంపై ఉంచండి.. నిదానంగా తినండి. మీరు నమ్మినా నమ్మకపోయినా వేగంగా తినడం వల్ల కేలరీలు ఎక్కువగా సమకూరుతాయి. ఏదో రేసులో పాల్గొన్నట్లుగా కాకుండా నిదానంగా తినడం వల్ల శరీరంలోకి తక్కువ కేలరీలు అందేందుకు తోడ్పడుతుంది.

హెల్తీ ఫుడ్స్ తీసుకోవడానికి అలవాటుపడాలి. అవే అందుబాటులో ఉండేలా చేసుకోవాలి. నూనెలు ఎక్కువగా ఉండేవి, నిల్వ ఉండే వాటికి దూరంగా ఉండటమే మంచిది.

ఒత్తిడికి దూరంగా ఉండటం:

బరువు తగ్గడానికి ఒత్తిడికి దూరంగా ఉండటం కూడా కీలకం. అలా చేయడం వల్ల ప్రశాంతంగా నిద్రపోగలం. చాలా హార్మోన్ల సమతుల్యం కూడా సాధ్యపడుతుంది. అలా చేయగలిగితే బరువు త్వరగా తగ్గిపోవచ్చు. సరిపడ ఆహారం తీసుకోలేదని అందుకే నిద్రపట్టడం లేదని భావించి ఎక్కువ ఆహారం తీసుకోకూడదు. ఆ స్థానాన్ని నీరు భర్తీ చేస్తుందని మర్చిపోకండి. నీరు, విటమిన్ డీ బరువు తగ్గడానికి చాలా హెల్ప్ అవుతాయి.

స్నాక్స్ అలవాటు:

స్నాక్స్ తినే అలవాటు మార్చుకోండి. చాలా మంది సినిమాలు చూస్తుంటేనో.. ఓటీటీ ప్లాట్ ఫాంలపై కూర్చున్నప్పుడో.. స్నాక్స్ తింటూ కూర్చుంటారు. అవి అలా ఎంత తింటున్నామో కూడా తెలియకుండా లోపలికి వెళ్లిపోతుంటాయి. అలాంటి సమయంలో ఫ్రూట్, డ్రై ప్రూట్, స్ప్రౌట్స్ తినడం లేదంటే తక్కువ కేలరీలు ఉండే అటుకులు, గింజలు, పాప్ కార్న్ వంటివి తీసుకోవాలి.