Cycling : రోజు సైక్లింగ్ వల్ల లాభాలు ఎన్నంటే?..

సైకిల్ తొక్కినంత సేపు అలసట వస్తుంది. అయితే ఈ అలసట వెనుక కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. సైక్లింగ్ వల్ల శరీరంలోని ప్రతి అవయవం కదులుతుంది.

Cycling : రోజు సైక్లింగ్ వల్ల లాభాలు ఎన్నంటే?..

Cyckling

Cycling : ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి కాసేపు వ్యాయామం చేసేందుకు సమయం దొరకటంలేదు. పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజులో కొంత సమయాన్ని మాత్రం తప్పనిసరిగా వ్యాయామానికి కేటాయించటం చాలా ముఖ్యం. ఎందుకంటే వ్యాయామం చేయటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అనారోగ్యాల బారిన పడకుండా ఉండేందుకు వీలుంటుంది. వ్యాయామానికి తగినంత సమయం కేటాయించలేని వారు కొంత సమయం స్లైకింగ్ చేస్తూ షికారు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

సైకిల్ ను వ్యాయామం కోసమని ప్రత్యేకంగా తొక్కాల్సిన పనిలేదు. మీ ఆఫీస్ కు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళినా పర్వాలేదు. ఎందుకంటే రద్దీగా ఉండే ట్రాఫిక్ లో వాహనాలపై వెళ్ళే బదులు సరదాగా సైకిల్ పై వెళ్ళటం వల్ల శరీరానికి మంచి వ్యాయామం అందించనట్లు ఉంటుంది. రోజుకు 5 నుండి 6కిలోమీట్లరు సైకిల్ తొక్కటం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.

సైకిల్ తొక్కినంత సేపు అలసట వస్తుంది. అయితే ఈ అలసట వెనుక కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. సైక్లింగ్ వల్ల శరీరంలోని ప్రతి అవయవం కదులుతుంది. తద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. బాడీలోని కొవ్వు కరగటంతోపాటు , మానసిక ఒత్తిళ్లు కూడా తగ్గిపోతాయి. గుండె ఆరోగ్యానికి సైక్లింగ్ మేలు చేస్తుంది. వారానికి 30 కిలో మీటర్లు సైక్లింగ్ చేయటం వల్ల కరోనరీ జబ్బులు 50 శాతం తగ్గుతాయి.

కండరాల ధృడంగా తయారవుతాయి. శరీరం మొత్తం బలోపేతం అవుతుంది. సైక్లింగ్ చేసే వారిలో జీవక్రియల రేటు అధికంగా ఉంటుంది. ఇది సుదీర్ఘకాలం జీవించేందుకు అవకాశాన్ని ఇస్తుంది. కీళ్లు , మోకాళ్లు, హీప్స్ జాయింట్స్ బాగా పనిచేస్తాయి. రోజుకు 20 నుండి 30 నిమిషాలు సైకిల్ తొక్కటం వల్ల నిద్రలేమి సమస్య దూరమౌతుంది. అంతేకాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది.