Ginger and Garlic : ఆరోగ్యానికి అల్లం, వెల్లుల్లి చేసే మేలు ఎంతంటే?

ప్రతిరోజు ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి వెల్లుల్లి తీసుకోవటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అనేక రుగ్మతలను పోగొడతాయి.

Ginger and Garlic : ఆరోగ్యానికి అల్లం, వెల్లుల్లి చేసే మేలు ఎంతంటే?

Ginger And Garlic

Ginger and Garlic : భారతీయ వంటకాలలో అల్లం, వెల్లుల్లి ప్రధానమైనవి చెప్పవచ్చు. వంటకాలకు మంచి రుచితోపాటు, సువాసనను అందించటంలో అల్లం, వెల్లుల్లి తోడ్పడతాయి. ఆరోగ్యపరంగా కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. అల్లంలో పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, జింక్, విటమిన్ ఎ, సి, ఇ, బి, వంటి ఎన్నో ఖనిజాలు, పోషకాలు ఉన్నాయి. ఇవి అనేక రోగాలను దరిచేరకుంటే చేయటంలో సహాయపడతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. వికారం, వాంతులు, విరోచనాలు వంటి సమస్యలను తగ్గించటంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక కప్పు అల్లం టీ తీసుకోవటం వల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు తగ్గిపోతాయి. కడుపునొప్పి, శరీరపరమైన ఇతర నొప్పులు, జలుబు, దగ్గు వంటి సమస్యలకు అల్లం బాగా పనిచేస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేయటంలో అల్లం సహాయకారిగా ఉపకరిస్తుంది. అల్లాన్ని ప్రతిరోజు నిర్ణీత మోతాదులో ఉపయోగిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఇక వెల్లుల్లి గురించి చెప్పాలంటే ఇందులో విటమిన్లు, అయోడిన్, సల్ఫర్, ఆంటీయాక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రతిరోజు ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి వెల్లుల్లి తీసుకోవటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అనేక రుగ్మతలను పోగొడతాయి. కొలెస్ట్రాల్ ను కరిగించి ఒబిసిటీ సమస్యను దూరం చేస్తుంది. అజీర్ణం, గ్యాస్ట్రిక్, మొటిమలు, తదితర సమస్యలను నివారించటంలో ఉపయోగపడుతుంది.

నోటిపూత, చిగుళ్ల బాధలు, వంటి వాటికి కారణమయ్యే చెడు బ్యాక్టీరియాను చంపటం ద్వారా నోటి ఆరోగ్యానికి వెల్లుల్లి మెరుగుపరుస్తుంది. కాలేయంలో ఏర్పడే కొవ్వును తగ్గించటం ద్వారా కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. వెల్లుల్లిని ఆహారంలో తీసుకోవటం తోపాటు, పై పూతగా వాడటం వల్ల చర్మ, జుట్టు ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది.