Hibiscus : మందారంతో జుట్టుకు ఎంతో మేలు!..

గుప్పెడు మందార ఆకులు, నాలుగు పెద్ద చెంచాల పెరుగు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుండటం వల్ల జుట్టు క్రమంగా నల్ల

Hibiscus : మందారంతో జుట్టుకు ఎంతో మేలు!..

Mandaram

Hibiscus : మందారంను సహజ సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తారు. మందార ఆకులు, ఎండిన పువ్వులను సౌందర్య పోషణలో విరివిగా వాడతారు. మందారాలతో మెత్తటి కురులను మీ సొంతం చేసుకోవచ్చు. వెంట్రుక‌ల చివర్లు చిట్లడం, రాలడం, తెల్లబడటం వంటి జుట్టు సమస్యలు చాలామందికి వస్తుంటాయి. వీటిని త‌గ్గించుకునేందుకు ఇంట్లో ఉండే మందారం చెట్లు ఎంతో ఉపయోగపడుతుంది. మందార ఆకులు, పువ్వుల‌తో వెంట్రుక‌లకు ఏర్పడే స‌మ‌స్య‌లు తొలగించవచ్చు.

మందారంలో విటమిన్ సి ఎక్కువగా ఉంది, ఇది తలలోని తలలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే సెబమ్ ను నివారిస్తుంది. ఫ్రీరాడియల్స్ నుండి చర్మ రంద్రాలకు రక్షణ కల్పించి జుట్టు రాలిపోకుండా నివారిస్తుంది. మందారంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును నివారిస్తుంది, తలలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది,

ఏడు నుండి ఎనిమిది మందార పువ్వులు, ఆకుల్ని శుభ్రంగా కడిగి ముద్దలా చేయాలి. ఒక కప్పు కొబ్బరి నూనెను వేడిచేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపాలి. నూనె చల్లారాక వడకట్టి రాత్రుళ్లు తలకు రాసుకుని మర్నాడు తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.

గుప్పెడు మందార ఆకులు, నాలుగు పెద్ద చెంచాల పెరుగు తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంట తరువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుండటం వల్ల జుట్టు క్రమంగా నల్లబడుతుంది. మూడు చెంచాల ఉసిరిపొడి, రెండు చెంచాల ఉసిరిరసం, గుప్పెడు మందారం ఆకుల్ని తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఈ ముద్దను తలమొత్తానికి పట్టించి గంటతరువాత తరువాత కడిగేసుకుంటే జుట్టు చివ‌ర్లు చిట్ల‌టం వంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి.

జుట్టు పెరగడానికి, నల్లగా మారేందుకు మందార పువ్వుల రసం కొబ్బరినూనెతో సమపాళ్లలో కలిపి వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఎండిన మందారాలను కొబ్బరి నూనెలో వేసి మరగకాచి తరచూ తలకు పెట్టుకొంటుంటే జుట్టు రాలడం తగ్గి వెంట్రుకలు ఏపుగా పెరగడానికి, తలలో దురదను నివారిస్తుంది. హార్మోనుల ప్రభావం వల్ల చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం జరుగుతుంటుంది. ఇలాంటటి వారు కొన్ని మందారం ఆకులు తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. అలా చేసిన పేస్ట్ కు కొద్దిగా మందారం నూనె పెరుగు మిక్స్ చేసి తలకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు నల్లగా నిగారింపుగా ఉంటుంది.