Tamarind : గర్భిణీ స్త్రీలు చింతపండు మోతాదుకు మించి తీసుకుంటే ఏమౌతుందంటే?

చింతపండును మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చింతపండులో ఉండే విటమిన్ సి హెల్తీ న్యూట్రీషియన్. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిదే. ఐతే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. విటమిన్ సి మోతాదుకు మించి తీసుకుంటే గర్భిణీకి ప్రమాదం.

Tamarind : గర్భిణీ స్త్రీలు చింతపండు మోతాదుకు మించి తీసుకుంటే ఏమౌతుందంటే?

Tamarind

Tamarind : చింతపండును భారతదేశపు ఖర్జూరంగా పిలుస్తారు. భారతీయ వంటకాలలో దీనిని విరివిగా వినియోగిస్తారు. రుచిలో పుల్లగా ఉండే చింతపండును తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. పుల్లదనానికి చాలా ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరలలోను, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడాతారు. పుల్లపుల్లగా ఉండే చింతపండులో మెడిసినల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఔషధ గుణాలు మాత్రమే కాదు, ఈతియ్యనిపుల్లని చింత పండు, గర్భిణీ స్త్రీలలో వికారం, వాంతులు మార్నింగ్ సిక్ నెస్ ను నివారించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో గర్భిణులకు పుల్లటి పదార్దాలు తినాలని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది.

చింతపండు గుజ్జు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. బైల్ డిజార్డర్స్ కు ఇది నేచురల్ ట్రీట్మెంట్. ఇది ఆకలిని పెంచుతుంది. చింతపండులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇది శరీరంలో ఫ్రీరాడికల్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. దాంతో కాన్సర్ ప్రమాదం ఉండదు. చింతగింజలు కూడా ఆరోగ్య విషయంలో ఆయుర్వేదపరంగా ఎంతో విలువైనవి. చింతగింజలు పొడిచేసి ప్రతిరోజు చెంచాడుపోడి నీటిలో కలిపి సేవిస్తూవుంటే ఆమశంక, జిగట విరేచనాలు తగ్గుతాయి.

చింతపండును మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చింతపండులో ఉండే విటమిన్ సి హెల్తీ న్యూట్రీషియన్. దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిదే. ఐతే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా మంచిది కాదు. విటమిన్ సి మోతాదుకు మించి తీసుకుంటే గర్భిణీకి ప్రమాదం. మిస్కరేజ్ అయ్యే చాన్సెస్ ఎక్కువ . విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల ముందు ముందు ప్రొజెస్టరాన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. తద్వారా గర్భస్రావానికి కారణమవుతుంది.

చింతపండు మోడ్రన్ లాక్సేటివ్ గా పనిచేస్తుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. గర్భధారణ సమయంలో ఇది సాధారణసమస్య. గర్భిణీల ఎక్కువ చింతపండు తింటే ల్యాక్సేటివ్ డయోరియాకు కారణమవుతుంది.ఇది గర్భధారణ సమయంలో అత్యంత ప్రమాధకరం. శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. యూట్రస్ మీద ప్రభావం చూపుతుంది. యాస్పిరిన్ చింతపండుతో ఇంటరాక్ట్ అవుతుంది. గర్భిణీలు యాస్పిరిన్ తీసుకోనేటప్పుడు చింతపండు తినకూడదు. అలా తీసుకున్నట్లైతే ఈ క్రింది సమస్యలకు దారితీస్తుంది. చింత పండు తింటే యాస్పిరిన్ మరింత ఎక్కువ అబ్సార్బ్ అవుతుంది.

యాస్పిరిన్ వలే ఐబ్రూఫిన్ శరీరంలో త్వరగా ఆబ్సార్బ్ అవుతుంది. చింతపండు ఐబ్రూఫిన్ ఇంటరాక్షన్ ఆరోగ్యానికి చాలా హానికరం. మూడవ థ్రైమాసికంలో తీసుకునే మెడికేషన్స్ లో ఐబ్రూఫిన్ క్యాటగిరిని డి డ్రంగ్ గా విభజించారు. అంటే మూడవ థ్రైమాసికంలో ఐబ్రూఫిన్ మితంగా తీసుకోవడం గర్భిణీ ఆరోగ్యానికి మంచిది. చింతపండును అతిగా వినియోగించకపోవటమే ఆరోగ్యానికి మంచిది.