Uric Acid : శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే ఏంజరుగుతుంది?

ప్రాసెస్ చేసిన మాంసాహారాలను తీసుకోవటం వల్ల యూరిక్ ఆమ్ల స్ధాయిలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని తీసుకోకుండా ఉండటమే మంచిది. షుగర్ తో తయారు చేసిన జంక్ ఫుడ్స్ ను నివారించాలి.

Uric Acid : శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగితే ఏంజరుగుతుంది?

Uric Acid Builds Up

Uric Acid : శరీరంలో యూరిక్ అమ్ల స్ధాయిలు పెరిగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మనం తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు విచ్ఛిన్నమైనప్పుడు వాటిలోని రసానక సమ్మేళనాన్ని ప్యూరిన్లు అంటారు. ఈ విషతుల్యాలను శరీరం ఎప్పటికప్పుడు విసర్జన చేయాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో శరీరంలో యూరిక్ అమ్లం మోతాదు పెరిగిపోతుంది. రక్తంలో యూరిక్ ఆమ్లం అధికంగా ఉంటే అది గౌట్ సమస్యకు దారి తీస్తుంది. దీనిని ఆర్థరైటిస్ గా పిలుస్తాము. అంతేకాకుండా కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా ఈ యూరిక్ ఆమ్లం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. మనం రోజువారిగా తీసుకునే వివిధ రకాల ఆహారాలు సైతం రక్తంలో యూరిక్ అమ్లాన్ని పెంచుతాయి. కొన్ని రకాల ఆహారాలు యూరిక్ ఆమ్లాన్ని తగ్గించేందుకు సహాయపడతాయి. యూరిక్ ఆమ్లం అధిక సమస్యతో బాధపడుతున్న వారు విటమిన్ సి, ఫైబర్, ఉన్న ఆహారాలను తీసుకోవాలి. తాజా పండ్లు, నీరు ఎక్కువగా తాగటం చేయాలి. దీని వల్ల యూరిక్ ఆమ్ల స్ధాయిలను తగ్గించుకోవచ్చు.

ప్రాసెస్ చేసిన మాంసాహారాలను తీసుకోవటం వల్ల యూరిక్ ఆమ్ల స్ధాయిలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని తీసుకోకుండా ఉండటమే మంచిది. షుగర్ తో తయారు చేసిన జంక్ ఫుడ్స్ ను నివారించాలి. సాధారణ నూనెలకంటే ఆలివ్ అయిల్ ను వంటల్లో వాడుకోవటం మంచిది. రోజుకు 3 లీటర్ల నీరు తాగటం వల్ల అధిక మోతాదులో ఉండే యూరిక్ ఆమ్లాలు బయటకు నెట్టివేయబడతాయి. స్త్రీతలతో పోలిస్తే పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మాంసాహారం, చేపలు తదితర ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకునే వారిలో యూరిక్ ఆమ్లాలు పెరిగి గౌట్ వ్యాధి బారిన పడుతున్నారు. యాసిడ్ స్పటికాలు కీళ్ళలో చేరి కీళ్ళు ఎర్రగా మారటం, వాపు, నొప్పులకు దారి తీస్తున్నాయి. సమస్యను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స పొందటం ఉత్తమం.