Different Vaccines Doses: రెండు రకాల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేస్తే ఏమౌతుందో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. అదే అమెరికాలో అయితే 29శాతం జనాభాలో ఒక డోస్ కరోనా వ్యాక్సిన్ అందించారు. కేవలం 16 శాతం మాత్రమే పూర్తి డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు.

Different Vaccines Doses: రెండు రకాల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వేస్తే ఏమౌతుందో తెలుసా?

What Happens If You End Up Getting Two Different Vaccines (1)

Two Different Vaccines Doses : ప్రపంచవ్యాప్తంగా దాదాపు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. అదే అమెరికాలో అయితే 29శాతం జనాభాలో ఒక డోస్ కరోనా వ్యాక్సిన్ అందించారు. కేవలం 16 శాతం మాత్రమే పూర్తి డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇటీవలే దేశాధ్యక్షుడు జో బైడెన్ మే 1 నుంచి అందరికి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. అప్పటివరకూ అర్హత కలిగిన వయస్సు వారికి మాత్రమే వ్యాక్సిన్ డోసులను అందిస్తున్నారు. 55ఏళ్ల హెల్త్ కేర్, నిత్యావసర సిబ్బంది, 16ఏళ్ల వయస్సు, ఆపైబడినవారు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ముందుగా వ్యాక్సిన్లు అందిస్తున్నారు.

అయితే.. ఒక్కో వ్యక్తికి రెండు డోసుల వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. చాలామందిలో తలెత్తే ప్రశ్న ఒక్కటే.. ఒకే రకమైన వ్యాక్సిన్ డోసులు తీసుకోవాలా? లేదా రెండు వ్యాక్సిన్ల డోసులు ఒక్కో రకం డోస్ తీసుకోవచ్చా? ఒకవేళ రెండు రకాల వ్యాక్సిన్ డోసులు తీసుకుంటే ఏమౌతుంది? అనేదానికి సెంటర్స్ ఫర్ డీసిజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) వివరణ ఇచ్చింది. దీనిపై మరింత లోతుగా పరిశోధించాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఒకవేళ రెండు రకాల వ్యాక్సిన్ల డోసులను కలిపి మిక్సింగ్ వ్యాక్సిన్ ఇచ్చినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని సీడీసీ అంటోంది. ఫిబ్రవరి నెలలో సీడీసీ వివిధ రకాల కోవిడ్ వ్యాక్సిన్ షాట్లను ఇచ్చి రీసెర్చ్ చేసింది.

ప్రస్తుతం ఫైజర్-బయోంటెక్ లేదా మోడెర్నా వ్యాక్సిన్ షాట్లను అందిస్తోంది. ఇందులో ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చాక.. అనివార్య పరిస్థితుల్లో రెండో షాట్ డోస్ లభించకపోతే.. ఏదైనా mRNA COVID-19 వ్యాక్సిన్‌ను మొదటి డోస్ వేసిన 28రోజుల మధ్యలో mRNA వ్యాక్సిన్ సిరీస్‌లను పూర్తిగా వేయించుకోవచ్చు. రెండు రకాల వ్యాక్సిన్ డోసులు వేయించుకుంటే సురక్షితమేనా? కాదా అనేదానిపై దాదాపు రెండు నెలలుగా యూకే సైంటిస్టులు పరిశోధనలు చేస్తున్నారు.

ఈ ట్రయల్స్ లండన్ లోని ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో జరుగుతున్నాయి. ఇందులో వాలంటీర్లలో ఒకరికి ఫైజర్ వ్యాక్సిన్ ఒక డోసు ఇచ్చిన తర్వాత రెండో డోసుగా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ డోసును అందించారు. ఈ టెస్టులో 50ఏళ్ల వయస్సు కలిగిన 33మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ గ్రూపుల మధ్య వ్యాక్సిన్ వేశాక ప్రతిఒక్కరిలో ఎలాంటి ప్రభావం చూపిందో స్పష్టత రావాలంటే నాలుగు నుంచి 12 వారాల సమయం పడుతుందని సైంటిస్టులు పేర్కొన్నారు.