Heart : అలాంటి ఆహారాలతో గుండెకు చేటే?

ఫాస్ట్ ఫుడ్‌,నూడుల్స్, మంచూరియా వంటి వాటిని తినటం మానేయాలి. వీటివల్ల బరువు పెరగటంతోపాటు గుండె ఆరోగ్యంపై తీవ్రప్రభావం పడుతుంది.

Heart : అలాంటి ఆహారాలతో గుండెకు చేటే?

Heart

Heart : మారిన జీవనశైలి, ఒత్తిళ్ళు, ఆహారపు అలవాట్లు మనిషిని అనారోగ్య సమస్యలతో కుంగదీస్తున్నాయి. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో కొవ్వుల మోతాదు అధికంగా ఉండటం వల్ల గుండె సంబంధిత జబ్బుల బారినపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అదే క్రమంలో చాలా మంది అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. గుండె జబ్బులు రావటానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా మనం తీసుకునే ఆహారం గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్త నాళాల్లో అధిక కొలెస్ట్రాల్ పేరుకు పోవటం గుండె కు రక్తం సరఫారాలో అంతరాయాలు గుండె పోటులకు దారితీస్తున్నాయి.

ట్రాన్స్ ఫ్యాట్స్, చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలను అధికంగా తినకూడదు. వాటిని తీసుకోవటం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీని వల్ల రక్తనాళాల్లో బ్లాకేజ్ లు ఏర్పడతాయి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడితే ఇతర అవయవాలు ఆక్సిజన్, పోషకాలు అందక గుండె పోటులు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలు శరీరంలో కొవ్వు పేరుకునేలా చేస్తాయి. అలాంటి వాటి విషయంలో జాగ్రత్తలు పాటించటం మంచిది.

ఈ ఆహారాలను దూరం పెట్టండి ;

డీప్ ఫ్రైలు , వేపుడు కూరలు వంటివాటిని రోజు తింటే చెడు కొలెస్టాల్ రక్తనాళాల్లో చేరుతుంది. పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివాటిని రోజూ తిన్నా కొవ్వులు పేరుకుంటాయి. పాలు, పాత ఉత్పత్తులు కూడా అధిక మోతాదులో తీసుకోకూడదు. వాటివల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వెన్న తీసేసిన పాలను, ఉత్పత్తులను వాడితే సమస్య ఉండదు. ఫాస్ట్ ఫుడ్‌,నూడుల్స్, మంచూరియా వంటి వాటిని తినటం మానేయాలి. వీటివల్ల బరువు పెరగటంతోపాటు గుండె ఆరోగ్యంపై తీవ్రప్రభావం పడుతుంది. మద్యం, ధూమపానం చేసే అలవాటు ఉన్నవారిలో రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. చిప్స్ వంటి చిరుతిళ్ళను రోజు అదేపనిగా తినేవారిలో గుండె జబ్బుల ముప్పు ఎక్కుగా ఉంటుంది. రక్తం గడ్డకట్టే స్వభావం పెరుగుతుంది. జంక్ ఫుడ్ తినటం వల్ల పోషకాలు లోపించే ప్రమాదం ఉంటుంది. ఆహార నియమాలు పాటించకపోవడం ఎక్కువ మోతాదులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వు పదార్థాలను తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గుండె ఆరోగ్యానికి తినాల్సిన ఆహారాలు ;

వేరుశెనగను గుండెకు ఎంతో మంచిది. మంచి కొవ్వును కలిగి ఉన్న వేరుశెనగలో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. వేరుశెనగలో ఉండే ఖనిజాలు గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే వీటిని మితంగా మాత్రమే తీసుకోవాలి. ప్రతిరోజూ అరకప్పు వాల్‌నట్స్‌ను తీసుకోవడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌కు చెక్‌ పెట్టొచ్చు. అలాగే గుండె ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే వాల్‌నట్స్‌ హృదయ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. అలాగే గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అవోకాడోలో విటమిన్ ఈ తో పాటు అనేక ఇతర పోషకాలు ఉన్నాయి. మోనో అన్‌-శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల గుండెకు చాలా మంచిది. రోజూ తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా గుండెపోటుతో సహా గుండె సంబంధిత వ్యాధులు నుంచి బయటపడవచ్చు.

ఓట్స్ ఆహారం ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగిఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఓట్స్‌లో ఒమేగా 3 ఆమ్లాలు కూడా ఉన్నాయి, ఇవి గుండెకు చాలా ప్రయోజనకరం. ప్రతీ రోజూ ఓట్స్ తినడం వల్ల మీ గుండె ఆరోగ్యకరంగా ఉంటుంది. నారింజలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. పొటాషియం అధికంగా ఉండే నారింజలో ఎలక్ట్రోలైట్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అటు విటమిన్ సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లు కూడా గుండె జబ్బులను నివారించడంలో తోడ్పడతాయి.