Digital Eye Pressure : డిజిటల్ కంటి ఒత్తిడి అంటే ఏమిటి ? దీని నుండి కళ్ళను రక్షించుకోవడానికి చిట్కాలు

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది ఎక్కువ సమయం స్క్రీన్ వాడకం వల్ల వస్తుంది. ఇది అనేక రకాల లక్షణాలను సూచిస్తుంది. ఈ లక్షణాలలో కొన్ని కంటికి అసౌకర్యం, కళ్ళు పొడిబారటం, కంటి అలసట, అస్పష్టమైన దృష్టి , ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు గడపటం వల్ల తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Digital Eye Pressure : డిజిటల్ కంటి ఒత్తిడి అంటే ఏమిటి ? దీని నుండి కళ్ళను రక్షించుకోవడానికి చిట్కాలు

digital eye strain

Digital Eye Pressure : మనం రోజూ కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లపై ఆధారపడే డిజిటల్ యుగంలో ఉన్నాం. ఈ తరుణంలో మన కళ్ళకు అదనపు సంరక్షణ , రక్షణ తప్పనిసరిగా అవసరం. ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడపటం వల్ల తలనొప్పి, కళ్ళు పొడిబారడం, ఇతర లక్షణాలతో పాటు కంటి చూపు లోపం వంటి సమస్యలు సర్వసాధారణంగా తలెత్తుతాయి.

READ ALSO : Increase Eyesight : కంటి చూపును పెంచుకునేందుకు దోహదపడే చిట్కాలు !

స్క్రీన్‌లపై ఎక్కువ సమయం గడపడం వల్ల కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని పిలువబడే డిజిటల్ ఐ స్ట్రెయిన్ అనే సమస్య కలుగుతుంది. ఇది మన కళ్ళకు హానికరం. నేడు సాంకేతికంగా అభివృద్ధి చెందిన సమాజంలో డిజిటల్ స్క్రీన్ లు మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారాయి. వినోదం, కార్యాలయ పని, సాంఘికీకరణ కోసం అందరూ డిజిటల్ పరికరాల ముందు ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారు.

కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అనేది ఎక్కువ సమయం స్క్రీన్ వాడకం వల్ల వస్తుంది. ఇది అనేక రకాల లక్షణాలను సూచిస్తుంది. ఈ లక్షణాలలో కొన్ని కంటికి అసౌకర్యం, కళ్ళు పొడిబారటం, కంటి అలసట, అస్పష్టమైన దృష్టి , ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు గడపటం వల్ల తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. స్క్రీన్‌లు విడుదల చేసే బ్లూ లైట్వ ల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సాధారణ చిట్కాల సహాయంతో స్క్రీన్‌లకు ఎక్కువగా బహిర్గతం కాకుండా చూసుకోవచ్చు.

READ ALSO : Better Eyesight : మెరుగైన కంటిచూపు కోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరంటున్న నిపుణులు!

డిజిటల్ స్ట్రెయిన్ నుండి కళ్ళను రక్షించుకోవడానికి చిట్కాలు ;

డిజిటల్ స్క్రీన్ లకు దూరంగా ;

డిజిటల్ స్క్రీన్ పరికరం నుండి సౌకర్యవంతమైన దూరాన్ని పాటించాలి. స్క్రీన్ యొక్క ప్రకాశాన్ని, కాంట్రాస్ట్‌ను మార్చడం, బయటి కాంతి వనరుల నుండి కాంతిని తగ్గించడం ఇవన్నీ కంటి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

బ్లూ లైట్ ఫిల్టర్ ;

బ్లూ లైట్ ఫిల్టర్ ప్రమాదకరమైన నీలి కాంతికి గురికావడాన్ని తగ్గిస్తుంది. తద్వారా దృష్టిని ఆదా చేస్తుంది.

READ ALSO : Smart Phone Syndrome : కంటిచూపును హరిస్తున్న ‘స్మార్ట్ పోన్ సిండ్రోమ్’, ఇది ఎందుకు వస్తుంది? పరిష్కారం కోసం నిపుణులు సూచనలు..

కళ్ళకు తగిన విశ్రాంతి ;

స్క్రీన్ ల ముందు గడిపే సమయాన్ని తగ్గించుకోవాలి. కళ్ళకు అవసరమైన విశ్రాంతిని అందించడానికి దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవాలి. విశ్రాంతి పద్ధతులు, సాధారణ వ్యాయామాలను దినచర్యలో చేర్చుకోవాలి.

ఈ వ్యూహాలను అమలు చేయడం ద్వారా, మొత్తం కంటి ఆరోగ్యంపై డిజిటల్ కంటి ఒత్తిడి వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చు.