Red Rice-Diabetics : ఎర్ర బియ్యంతో షుగర్‌కు చెక్!

షుగర్‌‌తో బాధపడుతున్నారా? ఆస్తమా, కీళ్ల సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా? ఎర్ర బియ్యం ఓసారి తిని చూడండి. ఎర్ర బియ్యాన్ని అన్నంగా తీసుకుంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుందని అంటున్నారు

Red Rice-Diabetics : ఎర్ర బియ్యంతో షుగర్‌కు చెక్!

What Is Red Rice Is Red Rice Good For Diabetics (2)

Red Rice Good For Diabetics : షుగర్‌‌తో బాధపడుతున్నారా? ఆస్తమా, కీళ్ల సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా? ఎర్ర బియ్యం ఓసారి తిని చూడండి. ఎర్ర బియ్యాన్ని అన్నంగా తీసుకుంటే షుగర్ కంట్రోల్లోకి వస్తుందని అంటున్నారు పోషక నిపుణులు. అలాగే ఆస్తమా, కీళ్ల నొప్పులు కూడా తగ్గిపోతాయని, జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుందని అంటున్నారు. ఎర్ర బియ్యాన్ని సాంబారు, పెరుగుతో కలిపి తింటే.. త్వరగా ఆకలి వేయదని చెబుతున్నారు. ఇంతకీ ఈ ఎర్ర బియ్యం ఎన్నిరకాలు ఉంటుందంటే.. దాదాపు 34 రకాలు ఉంటాయి. అందులో కెంపు, సన్నం, చంద్రకళ, బారాగలి, నవారా ఇలా చాలా రకాల్లో ఎర్ర బియ్యం లభ్యమవుతున్నాయి. కలాంకాలి రకం బియ్యం సన్నగా ఉంటుంది. కానీ, నవారా బియ్యం రకాన్ని ఎక్కువగా వాడుతున్నారు. ప్రస్తుతం కిలో బియ్యం ధర రూ.120 పలుకుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో 600 మంది రైతులు ఎర్ర బియ్యాన్ని పండిస్తున్నారు. తెల్లని బియ్యంలో కంటే.. ఎర్ర బియ్యంలో పీచు అధికంగా ఉంది. జీర్ణ శక్తిని పెంచి, రక్తనాళాల్లో పూడికలను తొలగిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. విటమిన్‌ B1, B2, B6లతో పాటు ఐరన్, జింక్, పోటాషియం, సోడియం, కాల్షియం, మాంగనీస్‌ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మధుమేహ బాధితులకు ఈ బియ్యం మంచి ఔషధంలా పనిచేస్తుంది. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ 45 శాతం కన్నా తక్కువగా ఉంటుంది. తద్వారా రక్తంలో చక్కెర నిల్వను ఎక్కువగా లేకుండా చేస్తాయి.

ఎర్ర అన్నాన్ని రోజూ తినడం వల్ల ఐరన్‌ సమృద్ధిగా లభిస్తుంది. రక్తంలో ఆక్సిజన్‌ శాతం పెరిగిపోతుంది. అలాగే కణజాలానికి సక్రమంగా అందుతుంది. రోజూ తింటుంటే ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందుతాయి. ఆస్తమా, కీళ్ల సమస్యలూ తొలగిపోతాయి. సేంద్రియ పద్ధతిలో పండిస్తే ఎర్ర బియ్యం సాగుకు ఎకరానికి పెట్టుబడి రూ.20వేలకు మించదు. ఎర్ర బియ్యం రకాలు పంట కాలం 110 నుంచి 130 రోజులు ఉంటుంది. ఎకరానికి గరిష్టంగా 13 బస్తాల(బస్తాకు 75 కిలోలు) ధాన్యం దిగుబడి వస్తుంది.