Liver : ఎలాంటి ఆహార, పానీయాలతో కాలేయానికి నష్టమంటే? |What kind of food and drink can damage the liver?

Liver : ఎలాంటి ఆహార, పానీయాలతో కాలేయానికి నష్టమంటే?

తీపి పదార్థాలు ఎక్కువ తినడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. స్వీట్స్ వల్ల ఊబకాయం పెరిగి పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువ చెక్కర తీసుకోవడం వల్ల కాలేయం కూడా దెబ్బతింటుంది.

Liver : ఎలాంటి ఆహార, పానీయాలతో కాలేయానికి నష్టమంటే?

Liver : కాలేయం అనేది మన శరీరంలో ముఖ్యమైన అవయవం. దీన్ని ఆరోగ్యంగా చూసుకోవడం చాలా అవసరం. కొన్ని అలవాట్ల కారణంగా త్వరగా కాలేయం దెబ్బతింటుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా ఏదిపడితే అదితిని, తాగితే కాలేయ సమస్యలు చుట్టు ముడతాయి. కాలేయం పనిచేయకపోతే అది మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని రకాల ఆహారాలను , పానీయాలను రోజువారిగా తీసుకోకుండా ఉండటం ఉత్తమం. కాపాడుకోవాలంటే వీటిని తగ్గించాలి. వాటికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మాంసాహారం తినడం వల్ల శరీరానికి తగినంత ప్రోటీన్ అభిస్తుంది. రెడ్ మీట్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే కాలేయం దానిని జీర్ణం చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెరుగుతుంది. మైదా లేదా ఎక్కువ తెల్లటి పండి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇవి ఎక్కువగా ప్రాసెస్ అవుతాయి. వాటిల్లో ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పరిమాణం చాలా తక్కవగా ఉంటుంది. ఈ రకమైన పిండి పదార్థాలు రక్తంలో చెక్కర స్థాయిని పెంచుతుంది. పిండితో చేసిన పదార్థాలను తినకపోవడం మేలు.

తీపి పదార్థాలు ఎక్కువ తినడం వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. స్వీట్స్ వల్ల ఊబకాయం పెరిగి పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎక్కువ చెక్కర తీసుకోవడం వల్ల కాలేయం కూడా దెబ్బతింటుంది. అధిక మొత్తంలో శుద్ధి చేసిన చెక్కర, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. ఆల్కహాల్ తరహాలోనే చెక్కర కాలేయానికి హానికలిగిస్తుంది. విటమిన ఎ మన ఆరోగ్యానికి మంచిది. కళ్లకు సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. నారింజ పండ్లు, కూరగాయల నుంచి విటమిన్ ఎ పొందవచ్చు. కానీ అధిక మోతాదులో విటమిన్ ఎ సప్లిమెంట్లు తీసుకోవడం కాలేయానికి ఇబ్బందికరంగా మారుతుంది.

పెయిన్ కిల్లర్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. అందువల్ల నొప్పి నివారణ మందులను వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. శీతలపానీయాల జోలికి వెళ్లవద్దు. వీటిని తాగటం వల్ల కూడా కాలేయం త్వరగా జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల కాలేయానికి తీవ్ర నష్టంవాటిల్లుతుంది. ఇది సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. లివర్ సిర్రోసిస్ కారణంగా, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.

 

×