CHILDREN FOOD : పిల్లలు అరోగ్యంగా ఎదిగేందుకు ఎలాంటి ఆహారం అవసరం?
పిల్లల్లో ఎదుగుదల, జీవ క్రియలు సక్రమంగా జరగడంలో ప్రొటీన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. కణ విభజన, కొత్త కణాలు తయారీ, కండరాల్లో బలం, వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఇవి ఆహారంలో ఉండాలి.

CHILDREN FOOD : ఎదుగుతున్న పిల్లల అహారం విషయంలో తల్లిదండ్రులు తగిన శ్రద్ధ వహించటం మంచిది. ఎందుకంటే తీసుకునే ఆహారం వారి ఎదుగుదలలో ఎంతగానో సహాయపడుతుంది. పిల్లల ఆరోగ్యం విషయంలోనే కాకుండా వారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరేందుకు అవకాశం ఉండదు. తద్వారా పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. ఎదుగుతున్న పిల్లలకు అందించాల్సిన ఆహారం విషయంలో నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
విటమిన్ సీ ; విటమిన్ సీ ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి, వాటితో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సీ వల్ల పిల్లలు ఆడుకునేటపుడు గాయపడితే, వాటిని త్వరగా నయం అవుతాయి. నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి విటమిన్ సీ పండ్ల రసాలు పిల్లల ఆరోగ్యంపై అద్భుతంగా పనిచేస్తాయి. జామ, బొప్పాయి, టమాట వంటి కూరగాయలు పిల్లలకు ఆహారంగా ఇవ్వాలి.
విటమిన్ డీ ; పిల్లలకు విటమిన్ డీ పొందడానికి సూర్యకాంతి మంచిది. వారిని సూర్యకాంతిలో ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఇంటి బాల్కనీ, టెర్రస్‌పై ఆడుకోనివ్వాలి. ఎముకలు దృఢంగా, ఆరోగ్యకరంగా ఉండటానికి ఈ విటమిన్ అవసరం.
ప్రొటీన్లు; పిల్లల్లో ఎదుగుదల, జీవ క్రియలు సక్రమంగా జరగడంలో ప్రొటీన్లు ముఖ్యపాత్ర వహిస్తాయి. కణ విభజన, కొత్త కణాలు తయారీ, కండరాల్లో బలం, వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే ఇవి ఆహారంలో ఉండాలి. చర్మం, ఎముకలు, గోళ్ల ఆరోగ్యంలో ప్రొటీన్లు కీలకంగా చెప్పవచ్చు. చిక్కుడు, శనగలు, ఆకుకూరలు, గింజధాన్యాలు, విత్తనాలు, గోధుమ, బ్రౌన్‌రైస్, మొలకెత్తిన గింజలు, కూరగాయలు, మొక్కజొన్న, బంగాళాదుంప, బ్రకోలీ, గుడ్డు మంచిది. పాల ఉత్పత్తులూ తప్పనిసరిగా అందించాలి.
విటమిన్లు, ఖనిజలవణాలు; ఎముకల ఎదుగుదలకు కాల్షియం తప్పనిసరి. ఆకుకూరలు, బాదం, చియా విత్తనాలు, నువ్వులు వంటివి ఇవ్వాలి. అలాగే ఐరన్ రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచి, ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను అవయవాలన్నింటికీ సక్రమంగా చేరేలా చేస్తుంది. గుమ్మడి, బాదం, జీడిపప్పు, ఆకుకూరలు, ఓట్స్, ఎండుద్రాక్ష వంటివి మంచివి. ఏ,సీ,డీ, ఈ,కే విటమిన్లుండే ఆహారం వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. సీజన్లవారీ వచ్చే పండ్లను తినిపించాలి.
కార్బొహైడ్రేట్లు; ఎక్కువశాతం పీచు ఉండే కూరగాయలు, పండ్ల ద్వారా అందుతాయి. ఓట్స్, బ్రౌన్ రైస్, బంగాళాదుంపలు, తాజా పండ్లు, చిలగడదుంప, గుమ్మడికాయ వంటివి ఆహారంలో ఉండాలి. ఎదిగే చిన్నారులకు కొవ్వు అత్యవసరం. ఆలివ్, అవకాడో, కొబ్బరి నూనెలతోపాటు పచ్చి కొబ్బరి, కొబ్బరిపాలు వంటివి పిల్లలకు ఇస్తే మంచిది.
పీచు; జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. క్యారెట్, బీట్‌రూట్, బ్రకోలీ, చిలకడదుంప, ఆకుకూరలతోపాటు రాజ్మా, చిక్కుడు, శనగ గింజలు, ఓట్స్, విత్తనాలు, మొలకల్లో పీచు ఉంటుంది. అరటి, స్ట్రాబెర్రీ, అవకాడో, యాపిల్ వంటి పండ్లు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడమే కాదు, తిరిగి ఆకలి వేసేలా చేస్తాయి.
1Apple Lockdown Mode : ఐఫోన్లో కొత్తగా ‘లాక్డౌన్’ మోడ్.. మీ డేటా మరింత భద్రం!
2Sai Pallavi: సాయి పల్లవి కోసం లైన్ కడుతున్న రానా, నాని!
3Love Cheating : ప్రేమ పేరుతో మోసం-యువతి ఆత్మహత్యాయత్నం
4EV Charging Station: కొత్త బిల్డింగులకు ఈవీ చార్జింగ్ స్టేషన్ తప్పనిసరి.. నోయిడా పాలకవర్గం నిర్ణయం
5Maharashtra: శివసేనకు ఉద్ధవ్ ఠాక్రేనే చీఫ్.. రెబల్ ఎమ్మెల్యేల గ్రూపునకు గుర్తింపులేదు: ఎంపీ సావంత్
6JOBS : బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాల భర్తీ
7Old City Bonalu : ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు
8Boris Johnson: రాజీనామా చేయాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం
9Punjab: నిరాడంబరంగా జరిగిన సీఎం భగవంత్ మాన్ పెళ్లి.. కుటుంబంతో కేజ్రీవాల్ హాజరు
10RC15: బ్యాక్ టు హైదరాబాద్!
-
Sammathame: ఆహా.. సమ్మతమే ఓటీటీ డేట్ వచ్చేసింది!
-
The Ghost: కిల్లింగ్ మెషిన్‌గా రాబోతున్న నాగ్.. ఎప్పుడంటే..?
-
Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ డేట్ ఫిక్స్..?
-
Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు
-
Nagarjuna: ఎలక్ట్రిఫైయింగ్ అప్డేట్తో వస్తున్న ‘ది ఘోస్ట్’!
-
ICC Test Rankings : టాప్ 10లో చోటు కోల్పోయిన కోహ్లీ.. ఆరేళ్లలో ఇదే ఫస్ట్ టైం..!
-
MacBook Air M2 : అదిరే ఫీచర్లతో ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2.. ప్రీ-ఆర్డర్లు ఎప్పుటినుంచంటే?
-
Agent: ఏజెంట్‌ను మళ్లీ వెనక్కి నెడుతున్నారా..?