Women’s Health : మహిళల ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం అవసరమంటే ?
40 సంవత్సరాల తర్వాత ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు మహిళల్లో మొదలవుతాయి. 40 సంవత్సరాల పైబడిన మహిళలు మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ కంటికి సరిపడ నిద్ర పోవాలి. వయసు పెరిగే కొద్దీ తప్పనిసరిగా వ్యాయామాలు చేయటం అలవాటు చేసుకోవాలి.

women's health
Women’s Health : ఇంటి పనులతో అలసిపోవటం, వయసు పైబడటం మొదలైన కారణాల వల్ల మహిళలు అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపధ్యంలో మహిళలు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా మహిళలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజువారిగా తీసుకునే ఆహారంలో కొన్ని విటమిన్స్ కచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు తమ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
న్యూట్రిషియన్స్ తో కూడిన ఆహారం ;
రోజువారి ఆహారంలో ఎక్కువ న్యూట్రీషియన్స్ ఉన్న ఆహారాలను చేర్చుకోవడం వల్ల మహిళల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మహిళలు నిత్యం తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్‌లో ముఖ్యమైనవి పెరుగు, కొవ్వులుండే చేపలు, బీన్స్, టమాట, విటమిన్ డీ తక్కువ కొవ్వు ఉండే పాలు, నారింజ రసం, రకరకాల బెర్రీలు తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
మంచి ఆరోగ్యం, పెరుగుదల, బలమైన ఎముకలకు విటమిన్ డీ ముఖ్యమైనది. విటమిన్ డీ ఎక్కువగా సూర్య కాంతి నుంచి లభిస్తుంది. అలాగే, హెర్రింగ్, ట్రౌట్, ట్యూనా, సాల్మన్, మాక్రేల్
వంటి చేపల్లో కూడా విటమిన్ డీ లభిస్తుంది.
మహిళల ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలలో చేపలు ఒకటి. చేపలలో ప్రోటీన్, విటమిన్ డీ, కాల్షియం, ఫాస్పరస్ వంటి అవసరమైన పోషకాలతో పూర్తిగా నిండి ఉండడంతో పాటు ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు లభిస్తాయి. ముఖ్యమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను చేపలు తీసుకోవటం ద్వారా పొందవచ్చు.
ప్రతిరోజూ కొన్ని డ్రై ఫ్రూట్స్ మరియు విత్తనాలను తీసుకోవాలి. ఎండిన పండ్లు మరియు గింజలు కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వును అందిస్తాయి. వాటిలో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

women’s health
టమాటాలు చాలా రకాల యాంటీ-ఆక్సిడెంట్లను, మినరల్లను కలిగి ఉంటాయి. టమాటలో ఉండే లైకోపీన్ అనే ఎరుపు రంగు వర్ణద్రవ్యం క్యాన్సర్ అభివృద్ధిని తగ్గిస్తుంది. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్ప్‌బెర్రీస్, బ్లాక్‌బెర్రీస్, గూస్‌బెర్రీస్ లలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్స్, తగినంత ఫైబర్ లభిస్తుంది. ఇవి క్యాన్సర్ కణాలతో పోరాడేందుకు తోడ్పడతాయి.
బీన్స్ ను తీసుకోవటం ద్వారా ప్రోటీన్స్ , ఫైబర్ అంది గుండెపోటు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ప్రముఖపాత్ర పోషిస్తాయి. పీఎంఎస్, పెరీ మెనోపాజ్, మెనోపాజ్ లక్షణాలను తగ్గించడంతోపాటుగా
రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.
40 సంవత్సరాల తర్వాత ముఖ్యంగా బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు మహిళల్లో మొదలవుతాయి. 40 సంవత్సరాల పైబడిన మహిళలు మంచి పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటూ కంటికి సరిపడ నిద్ర పోవాలి.
మహిళలు ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో వెల్లులి, ఉల్లి తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఉండే ఎన్నో రకాల ఔషధ గుణాలు అనేక వ్యాధులను దరిచేరకుండా చూస్తాయి. వయసు పెరిగే కొద్దీ తప్పనిసరిగా వ్యాయామాలు చేయటం అలవాటు చేసుకోవాలి.
ప్రోబయోటిక్స్ ;
పెరుగు, కేఫీర్, టేంపే, కిమ్చి,అరటి,చిక్కుళ్ళు,కాయధాన్యాలు,కిడ్నీ బీన్స్,సోయ్బీన్స్,ఉల్లిపాయ,వెల్లుల్లి,డాండెలైన్ ఆకుకూరలు,షికోరి రూట్,పిల్లితీగలు,వోట్స్,యాపిల్స్,అవిసె గింజలు,పిస్తాలు,ఆర్టిచోకెస్ మరియు సోయా ఉత్పత్తులు వంటి పలు రకాల ఆహారాల నుండి ప్రోబయోటిక్స్ ను శరీరానికి అందుతాయి. ప్రోబయోటిక్స్ తో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చు. రక్తపోటును తగ్గించడంలో సహాయపడటంతోపాటు గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. బరువు తగ్గడానికి కొన్ని అలెర్జీల తీవ్రతను తగ్గించటానికి సహాయపడతాయి. అంతేకాకుండా మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
వివాహం జరిగి పిల్లలు పుట్టిన తర్వాత మహిళల శరీరాకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత మహిళలు బరువు పెరగటం వల్ల అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ఈ క్రమంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చ.