Heart : గుండె సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? |What kind of food should be taken to prevent heart problems?

Heart : గుండె సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

మీట్, చికెన్, ఫిష్ పప్పులు, ఫ్యాట్ తక్కువ ఉన్న పాలూ, పాల పదార్ధాలూ, ఎగ్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. దీని కోసం సరైన మీట్ ఎంచుకోవాలి. హై కాలరీ మీట్ బదులు ఫిష్ తీసుకోవచ్చు.

Heart : గుండె సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Heart : ఆరోగ్యకరమైన ఆహారం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్ని రకాల ఆరోగ్యాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. రక్తపోటు, మదుమేహం వంటి సమస్యలు ఉన్నవారు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించటం మంచిది. దీని వల్ల భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రోజు వారి ఆహారంలో శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చూసుకోవాలి. తీసుకునే ఆహారం సమయానికి తీసుకోవాలి. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో చూసుకోవాలి. తక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలా కాకుండా అధిక మోతాదులో తీసుకోవటం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదమం పెరుగుతుంది.

ప్రస్తుతం మారిన జీవనశైలి , ఆహారపు అలవాట్ల కారణంగా తక్కువ వయసులో ఉన్న వాళ్ళు కూడా హై కొలెస్ట్రాల్, డయాబెటీస్, హైబీపీ వంటి వంటితో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం తీసుకునే ఆహారం, శారీరకమైన చురుకుదనం లేకపోవడం. తినే ఆహారంలో ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. విటమిన్స్, న్యూట్రియెంట్స్‌తో సమృద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే జీవితాంతం గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జంక్ ఫుడ్ తినడాన్ని పూర్తిగా తగ్గించాలి.

ప్రాసెస్ చేసిన బిస్కెట్స్ లాంటివి వాటిలో ట్రాన్స్-ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కేలరీలు పెరిగే అవకాశం ఉంటుంది. రెగ్యులర్‌గా వీటిని తీసుకోవడం హై బ్లడ్ కొలెస్ట్రాల్‌కి దారి తీస్తుంది. అంతేకాక, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది. బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకని, కుకీస్, బిస్కెట్స్, కేక్స్ వంటివి కొనేటప్పుడు వాటిలో ఉన్న ట్రాన్స్-ఫ్యాట్ లెవెల్స్ లేబుల్ మీద చూసి కొనుగోలు చేయటం ఉత్తమం.

మీట్, చికెన్, ఫిష్ పప్పులు, ఫ్యాట్ తక్కువ ఉన్న పాలూ, పాల పదార్ధాలూ, ఎగ్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. దీని కోసం సరైన మీట్ ఎంచుకోవాలి. హై కాలరీ మీట్ బదులు ఫిష్ తీసుకోవచ్చు. కొన్ని రకాల చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి లిపిడ్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. పప్పులు, బీన్స్, బఠానీలు వంటి వాటిని మీట్ బదులు తీసుకోవచ్చు. వీటిలో ఫ్యాట్ తక్కువ, కొలెస్ట్రాల్ అసలు ఉండదు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కూరగాయలూ, పండ్లలో విటమిన్స్, న్యూట్రియెంట్స్ లభిస్తాయి. వీటిలో కాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలూ, పండ్లూ వంటివి శాకాహరం లో ఉండే కొన్ని గుణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చేస్తాయి.

యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని ఎంచుకోవటం మంచిది. అవి శరీరంలో మంటను తగ్గిస్తాయి. గుండె సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లతో కూడిన బెర్రీలు, పచ్చి ఆకు కూరలు, సిట్రస్ పండ్లు,అవోకాడోలు వంటి వాటిని తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన మాంసాలు, గొడ్డు మాంసం, పంది మాంసం, జున్ను,వెన్న,వేయించిన ఆహారాలు, ప్రీప్యాకేజ్డ్ స్నాక్ ఫుడ్స్ వంటి వాటిని తీసుకోకపోవటం ఉత్తమం.

గమినిక ; ఈ సమాచారం అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా సేకరించి అందించటం జరిగింది. కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వైద్యులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు తీసుకోవటం మంచిది.

×