Fruits : మధుమేహులు వేసవిలో ఎలాంటి పండ్లు తినొచ్చంటే!

అవొకాడోలో ఉండే ఆరోగ్యకరకొవ్వులు, పొటాషియం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా అవొకడో శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ ,చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది.

Fruits : మధుమేహులు వేసవిలో ఎలాంటి పండ్లు తినొచ్చంటే!

Fruits

Fruits : డ‌యాబెటిస్ ఉన్న‌వారు తినే ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చక్కెర స్ధాయిలు పెంచే అహారాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు సహజ సిద్ధమైన పండ్లు తినే విషయంలో అనేక సందేహాలు నెలకొని ఉన్నాయి. పండ్లలో వేటిని తినవచ్చో..వేటిని తినకూడదో నన్న సందేహాలు రేకెత్తుతుంటాయి. చాలా సందర్భాల్లో తినాలని ఉన్నా తినకుండా మౌనంగా ఉండిపోవాల్సి వస్తుంది. ఏమి తినాలన్నా ఆచితూచి తినాల్సి వస్తుంది. అయితే కొన్ని రకాల పండ్లు వేసవి కాలంలో విరివిగా లభిస్తుంటాయి. అలాంటి పండ్లను రుచిచూడాలని అనుకుంటారు. అయితే షుగర్ వ్యాధి అడ్డురావటంతో వాటిని తినేందుకు సాహసించరు. అయితే మధుమేహం ఉన్నవారు సైతం కొన్ని రకాల పండ్లు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి పండ్లను మధుమేహులు తినవచ్చో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

మధుమేహంతో బాధపడుతున్నవారికి పండ్లు సురక్షితమైనవి కావు అనే భావన సరైనదికాదు. వివిధ రకాల పండ్లులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ నిక్షేపాలు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతాయి. పీచు పదార్థం పండ్లలో ఉన్నకారణంగా, కడుపు నిండిన అనుభూతికి లోనై అనారోగ్యకర ఆహారం తినాలన్న కోరికలను అరికట్టబడతాయి. అతిగా తినడం వంటి వాటిని నివారించుకోవచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు సరైన ఆహార పదార్ధాలను ఎంపిక చేసుకోవడానికి గ్లైసెమిక్ గైడ్ ను అనుసరించటం ఉత్తమమైనది. గ్లైసెమిక్ ఇండెక్స్ 70 లోపు ఉన్న పండ్లను తీసుకోవటం మంచిది. 70 కన్నా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వాటిని తినటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.

స్ట్రాబెర్రీ : స్ట్రాబెర్రీస్ మీ మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ కలిగి ఉంటాయి.. స్ట్రాబెర్రీలకు గ్లైసీమిక్ ఇండెక్స్ 41 గా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు కూడా తక్కువ మొత్తాలలో ఉంటాయి. స్ట్రాబెర్రీస్ పొట్టను నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది. మరియు శక్తిస్థాయిలు కోల్పోకుండా సహాయపడుతుంది. రక్తంలోని చక్కర నిల్వలను క్రమబద్దీకరించడానికి సహాయపడుతుంది. కప్పు స్ట్రాబెర్రీలను తీసుకోవడం మూలంగా డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు కలుగుతుంది. స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీ వంటి బెర్రీస్ రుచిక‌రంగా ఉంటాయి.

నారింజ : ఆరెంజ్‌లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ 44 గా ఉంటుంది. ఇందులో విట‌మిన్ ఏ, సీ, ఈ, ల్యూటిన్‌, బీటాకెరోటిన్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మ‌ధుమేహ రోగుల్లో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను కంట్రోల్ చేయ‌డంలో దోహ‌దం చేస్తాయి. 87 శాతం నీటి నిల్వలను కలిగి ఉండి, తక్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. నారింజ మీ బరువును నియంత్రణలో ఉంచడానికి కూడా సహాయపడుతుంది. మధుమేహాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు, రోజూ నారింజను తీసుకోవచ్చుని సూచిస్తున్నారు. నారింజ రక్తంలో చక్కెర స్ధాయిలను అదుపులో ఉంచటంలో తోడ్పడుతుంది.

పుచ్చ‌కాయ ; పుచ్చ‌కాయ తియ్య‌గా ఉండ‌టం వ‌ల్ల మదుమేహులు చాలా మంది తినేందుక సంశయిస్తుంటారు. అయితే పచ్చుకాయలో జీఐ 72 శాతం ఉన్నప్పటికీ దీనిలో నీటిశాతం అధికంగా ఉంటుంది. పిండిపదార్ధాలు చాలా తక్కువ మోతాదులో ఉంటాయి. పుచ్చకాయను తిన్న సందర్భంలో గ్లూకోజ్ పెరిగినప్పటికీ కొద్ది సేపటికే తగ్గిపోతుంది. పుచ్చకాయను తగిన మోతాదులో మధుమేహులు ఆహారంగా తీసుకోవచ్చు.

యాపిల్ ; ప్ర‌తిరోజు యాపిల్ తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండొచ్చ‌ని చెబుతుంటారు. విటమిన్ సి, డైల్యూటెడ్ ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆపిల్స్ అధికంగా తీసుకోవడం మూలంగా, మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. యాపిల్‌లో పెక్టిన్ అనే ఒక ర‌సాయనం ఉంటుంది. ఇది ర‌క్తంలోని చ‌క్కెర‌ను సగానికి తగ్గిస్తుంది. దీని జీఐ 38 మాత్ర‌మే. కాబ‌ట్టి షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు యాపిల్ తిన‌డం మంచిదే. మరీ పెద్ద సైజు యాపిల్ కాకుండా ఒక మోస్తరు సైజు తింటే సరిపోతుంది.

పియర్ పండు ; మధుమేహ రోగులకు సూచించదగిన మరో ఉత్తమమైన పండుగా పియర్ ను చెప్పవచ్చు. ఫైబర్, విటమిన్లను అధిక మొత్తాలలో కలిగి ఉండడంతోపాటుగా, 84 శాతం నీటి నిల్వలను కలిగి ఉండి, రక్తంలోని చక్కర స్థాయిలను అదుపులో ఉంచడానికి తోడ్పడుతుంది. పియర్స్ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంపొందించడానికి తోడ్పడడంతో పాటుగా, గ్లైసీమిక్ లెవల్ 38 గా ఉంటుంది. క్రమంగా రోజులో ఒకటి తీసుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

అవకాడో ; అవొకాడోలో ఉండే ఆరోగ్యకరకొవ్వులు, పొటాషియం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా అవొకడో శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ ,చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ 15 ఉంటుంది.

దానిమ్మ ; దానిమ్మ‌లో జీఐ 18గా ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐర‌న్ పుష్క‌లంగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర‌స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. మధుమేహ రోగులకు ఈ పండు అత్యంత లాభదాయకంగా ఉంటుంది. రక్తంలోని చక్కర నిల్వలను మెరుగుపరచడంలో అత్యుత్తమంగా సహాయపడుతుంది.

బొప్పాయి ; డ‌యాబెటిస్ ఉన్న‌వారు బొప్పాయిని క‌చ్చితంగా తినాలి. ఇందులో హానిక‌ర‌మైన ఫ్రీరాడిక‌ల్స్ నుంచి షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తుల‌ను ర‌క్షించే ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి ర‌క్తంలోని షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తాయి. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ 60గా ఉంటుంది. ప్లెతోరా న్యూట్రియంట్స్లో అధికంగా ఉండే బొప్పాయి మధుమేహాన్ని నివారించడంలో, సహాయపడే గుణాలను కలిగి ఉంటుంది.

నిమ్మ‌కాయ ; సిట్ర‌స్ జాతికి చెందిన నిమ్మ‌కాయ‌లో విట‌మిన్ సీ అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబ‌ట్టి ఇవి శ‌రీరంలోని చ‌క్కెర‌స్థాయిల‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి.

జామ కాయ‌ ; షుగ‌ర్ వ్యాధికి జామకాయ ఎంతో మంచి ఔష‌ధంగా చెప్పవచ్చు. జామ‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించి శ‌రీరానికి కావాల్సిన శ‌క్తిని అందిస్తుంది. జామ‌కాయ‌లో విట‌మిన్ ఏ, సీతో పాటు వివిధ ర‌కాల యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

కివీస్‌ ; విట‌మిన్ సీ, ఫైబ‌ర్‌, పొటాషియం, ఇత‌ర యాంటీ ఆక్సిడెంట్లు కివీస్‌లో అధికంగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. కివీస్‌ తిన‌డం వ‌ల్ల డయాబెటిస్ తీవ్ర‌త త‌గ్గుతుంది.