Life Choices: జీవితంలో కెరీర్.. రిలేషన్‌షిప్ రెండింటిలో ఏది ముఖ్యం..

మీరు జీవితంలో ఫస్ట్ ఛాయీస్ దేనికి ఇస్తారు రిలేషన్‌షిప్ లేదా కెరీర్. అదే మీ జీవితాన్ని సంపూర్ణం చేస్తుంది. ఏదేమైనా రెండూ సమానమే. కాకపోతే రిలేషన్‌షిప్, కెరీర్ రెండింటిలో ఒకటి ఎంచుకోవడం మన వ్యక్తిగత నిర్ణయం.

Life Choices: జీవితంలో కెరీర్.. రిలేషన్‌షిప్ రెండింటిలో ఏది ముఖ్యం..

Career And Relationship

Life Choices: మీరు జీవితంలో ఫస్ట్ ఛాయీస్ దేనికి ఇస్తారు రిలేషన్‌షిప్ లేదా కెరీర్. అదే మీ జీవితాన్ని సంపూర్ణం చేస్తుంది. ఏదేమైనా రెండూ సమానమే. కాకపోతే రిలేషన్‌షిప్, కెరీర్ రెండింటిలో ఒకటి ఎంచుకోవడం మన వ్యక్తిగత నిర్ణయం. ప్రతి ఒక్కరి జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు, కోరికలు ఉంటాయి.

అదే సమయంలో గడిపే ప్రతి క్షణం, ప్రతి రోజూ మనకు ఇష్టం అయినదై ఉండటం చాలా ముఖ్యం. ఒక్కసారి మీరు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకుంటే.. దేనికి ఎంత విలువ కేటాయించాలో అర్థమైపోతుంది. దానిని బట్టే సమయం వెచ్చించడంలోనూ క్లారిటీ వస్తుంది.

తరణ్నమ్ దోబ్రియల్ అనే ఆధ్యాత్మిక కౌన్సిలర్ అలా ఎంచుకోవడానికి కొన్ని ప్రశ్నలను మీ ముందుంచారు. ముందు వాటికి మీ సమాధానాలేంటో తెలుసుకోండి.

1. మీ పార్టనర్‌తో రిలేషన్‌షిప్‌లో మీకు బాగా ఏది ముఖ్యం.
2. మీ కెరీర్‌లో ఏది ముఖ్యం.
3. మీ ఫ్యామిలీ.. పిల్లలతో రిలేషన్‌షిప్‌లో ఏది ఇంపార్టెంట్ అని ఫీల్ అవుతున్నారు.

కొంత సమయం కేటాయించి ఏది ముఖ్యంగా భావిస్తున్నారో.. మీ లైఫా.. రిలేషన్‌షిప్సా మీరే ఎంచుకోండి.

కెరీర్ అనేది హద్దుల్లేని శక్తిని ఇవ్వగలదు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వగలదు. కాన్ఫిడెంట్ పెంచుతుంది. నాలెడ్జ్, పర్సనాలిటీ లాంటి వాటిని ఇంప్రూవ్ చేస్తుంది. మరోవైపు రిలేషన్‌షిప్ జీవితంలో భాగం. కొన్ని సార్లు అదొక్కటే కావాలన్నా కుదరని పని. ఒకటి పట్టించుకుని మరో దానిని నిర్లక్ష్యం చేయడం కుదరదు. అందుకే జీవితంలో హ్యాపీగా ఉండటం కోసం రెండూ చేయాల్సి ఉంటుంది. కాకపోతే కాస్త ఎక్కువ.. తక్కువ అనేది మనమే నిర్ణయం తీసుకోవాలి.

Step 1- ఈ రెండూ కాకుండా మీ గురించి కేర్ తీసుకోవడం మొదలుపెట్టండి.

Step 2- హద్దుల్లేనంతగా మిమ్మల్ని మీరు ప్రేమించగలగాలి. అలా చేయకపోతే మన జీవితంపై మనకంటే ఎక్కువ ప్రేమ ఎవ్వరూ చూపించలేదు. మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే.. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఈజీ.

Step 3- మీకు ఉన్న వాటిని ప్రశంసించడం, లేని వాటి గురించి బాధపడకపోవడం చాలా ముఖ్యం. ఇవి మీ రిలేషన్ షిప్ పై చాలా లేదా తక్కువ ప్రభావం చూపిస్తాయి.

Step 4- వాటన్నిటి కంటే ముందు ఎమోషనల్ క్లియరింగ్, ఒత్తిడిని తీసి పారయేయడం వల్ల ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.

Step 5- మిమ్మల్ని మీరు నమ్మండి. అంతర్లీనంగా ఆలోచిస్తే ఉత్తమంగా చేయగలమనేది మర్చిపోకండి.