Mosquitos Winter Dipause: చలికాలంలో దోమలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా?

ప్రతి జీవికి ఒక ఫేవరెట్ సీజన్ ఉంటుంది. పక్షులూ అంతే.. ఒక్కో సీజన్‌లో తమ ఆహారాన్ని అన్వేషిస్తూ.. ఒక చోట నుంచి మరో చోటకు వెళ్తుంటాయి. అలాగే దోమలకు కూడా ఒక ఫేవరెట్ సీజన్ ఉంటుంది.. అదే (Winter Season) చలికాలం..

Mosquitos Winter Dipause: చలికాలంలో దోమలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా?

Where Do Mosquitos Go In The Winter

Mosquitos Go in the Winter : ప్రతి జీవికి ఒక ఫేవరెట్ సీజన్ ఉంటుంది. పక్షులూ అంతే.. ఒక్కో సీజన్‌లో తమ ఆహారాన్ని అన్వేషిస్తూ.. ఒక చోట నుంచి మరో చోటకు వెళ్తుంటాయి. అలాగే దోమలకు కూడా ఒక ఫేవరెట్ సీజన్ ఉంటుంది.. అదే (Winter Season) చలికాలం.. అ సీజన్‌లో ఎక్కడికో వెళ్లిపోతాయి.. సమ్మర్ రాగానే మళ్లీ తిరిగి కనిపిస్తాయి.. తెగ కుట్టేస్తుంటాయి.. దోమలకు ఆహారం రక్తమే.. అందుకే ఈ దోమలను కోల్డ్ బ్లెడ్ (Cold-Blooded Insects) కీటకాలు అని పిలుస్తారు. దోమలు ఎక్కువగా వేసవి కాలంలోనే ఎక్కువగా ఉంటాయి.

చలికాలంలో అదృశ్యమైపోవడానికి కారణం ఏంటంటే.. దోమలకు చలికాలం అంటే పడదట.. ఎండాకాలమంతా వేటాడి.. చలికాలంలో రెస్ట్ తీసుకుంటాయట.. అందుకే చాలా తక్కువగా దోమలు కనిపిస్తాయి. వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలే వాటి ఆవాసాలు.. ఉష్ణోగ్రతలు పడిపోయిన సమయంలో దోమలు పైకి ఎగరలేవు.. చలికాలంలో బాగా మంచు కురుస్తుంటుంది. మంచు దెబ్బకు దోమలు ఎగరడానికి ఇబ్బంది పడతాయట.. ఎక్కువ దూరం ప్రయాణించలేవు.. అందుకే కాబోలు చలికాలంలో బయటకు వచ్చేందుకు దోమలు భయపడిపోతాయట.. ఇంతకీ దోమలు.. చలికాలంలో ఎక్కడికి పోతాయ్ అనేది అంతుచిక్కని ప్రశ్న.. దోమలు ఆడ, మగ ఉంటాయి. ఆడ దోమలే రక్తాన్ని ఆహారం పీలుస్తాయి.

ఆరు నెలలు నిద్రలోనే :
మరి చలికాలంలో ఈ దోమలన్నీ ఏమౌతాయి.. అంటే.. ఇక్కడ మగ దోమలైతే చలికాలంలో చనిపోతాయట.. అంటే చల్లటి వాతావరణం వల్ల మాత్రం కాదట.. ఆడ దోమల కంటే.. మగ దోమల జీవిత కాలం (Lifespan) చాలా తక్కువగా ఉంటుంది.. ఆడ దోమలతో సంభోగం తర్వాత మగ దోమలు చనిపోతాయి. కానీ, ఆడ దోమలు మాత్రం చలికాలంలో జీవించగలవు. అయితే ఎక్కడికి వెళ్తాయంటే.. ఎక్కడికి వెళ్లవు.. నిద్రాణస్థితిలో ఉంటాయి.. ఆడ దోమల నిద్రాణస్థితిని డైపాజ్ (Dipause) అంటారు. శరదృతువులో భూమిలోపలికి వెళ్లి నిద్రిస్తాయి. గడ్డకట్టే లేదా నీరులేని పరిస్థితులలో ఆరు నెలల వరకు నిద్రాణస్థితిలో ఉంటాయి. చలికాలం వెళ్లేవరకు అలాగే ఉండి.. వెచ్చదనం ఉన్నప్పుడే మళ్లీ బయటకు వస్తాయి.

వాతావరణం మళ్లీ వేడెక్కినప్పుడు.. ఆడ దోమలు నిద్రాణస్థితి నుంచి మేల్కుంటాయి. వసంతకాలం అంటే దోమలకు ఎంతో ఇష్టం.. ఆ సమయంలోనే రక్తాన్ని ఆహారంగా భుజిస్తుంటాయి. అంతేకాదు.. గుడ్లు పెట్టడానికి కూడా ఇదే సరైన కాలం.. గుడ్లు పొదగాలంటే.. దోమలకు ఎక్కువ రక్తం అవసరం పడుతుంది.. తన గుడ్లు పొదిగేందుకు అవసరమైన ప్రోటీన్ కావాలి.. అందుకే రక్తాన్ని భుజించేందుకు వెతకుంటాయి. వేడెక్కిన వాతావరణంలో ఆరుబయటకు కనిపించిన మనుషులు సహా ఇతర జీవులను తమ కోరలతో కొరికి రక్తాన్ని పీల్చేస్తుంటాయి.

దోమలకు చలేస్తుంది : 
దోమల గురించి తెలియాల్సిన వాస్తవాలు ఇంకా ఉన్నాయి.. దోమలకు చలేస్తుంది.. అందుకే శీతాకాలంలో దాక్కుంటాయి.. నిద్రిస్తుంటాయి. 80 డిగ్రీల ఉష్ణోగ్రతను చాలా దోమలు తట్టుకోగలవు. కానీ, 50కి ఉష్ణోగ్రత పడిపోతే మాత్రం తట్టుకోలేవు. అందుకే ఆ సమయంలో నిద్రాణస్థితికి వెళ్లిపోతాయి. ప్రారంభించవచ్చు. 50 డిగ్రీల కంటే తక్కువ ఉంటే.. చాలా దోమలు చల్లగా ఉందని భావిస్తాయి. వెంటనే డిపాజ్ కోసం మంచి స్థలాన్ని వెతికేస్తుంటాయి. కొన్ని దోమ జాతులు ఉన్నాయి.. ఆడ, మగ జాతులు.. శరదృతువులో మరణిస్తాయి. ఆ జాతులు చల్లని కాలంలో నిద్రాణస్థితిలోకి వెళ్లవు. జికా వైరస్ క్యారియర్ ఈడెస్ ఈజిప్టి వంటి దోమల జాతులు.. ఎక్కువ ఉష్ణమండల వాతావరణంలో నివసిస్తాయి.. 50 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వాటికి చాలా చల్లగా ఉంటుంది. ఆడ దోమలు గుడ్లు పెట్టిన వెంటనే చనిపోతాయి. శీతాకాలంలో గుడ్లు వేసవికాలానికి పూర్తిస్థాయిలో పొదుగుతాయి. సమ్మర్ సీజన్ అంతా ఆహార అన్వేషణలో మునిగితేలుతాయి..