Fats : వృక్ష, జంతు సంబంధ కొవ్వులలో ఏది మంచిదంటే?

వృక్ష సంబంధమైన కొవ్వుల్లో అసంతృప్త కొవ్వు అమ్లాలు అధికంగా ఉంటాయి. జంతు సంబంధ కొవ్వుల్లో సంతృప్త కొవ్వు అమ్లాలు ఉంటాయి.

Fats : వృక్ష, జంతు సంబంధ కొవ్వులలో ఏది మంచిదంటే?

Fats

Fats : శరీరంలో కొవ్వులు కీలకమైన పాత్రనే పోషిస్తాయి. శక్తి విడుదలకు , శరీర పెరుగుదలకు , నిర్మాణానికి కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు వంటివి ఎక్కువ మొత్తంలో అవసరం అవుతాయి. కొవ్వు కణాలు శరీరంలో లేకపోవటం, లేదా అధికంగా ఉండటం వల్ల ప్రమాదకరమైన వ్యాధులకు దారితీసే అవకాశం ఉంటుంది. కొవ్వులు ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాల్ తో ఏర్పడతాయి.

వృక్ష, జంతు సంబంధ ఆహార పదార్ధాల నుండి మనకు కొవ్వులు లభిస్తాయి. వృక్ష సంబంధ కొవ్వులు నూనెల రూపంలో ఉంటాయి. వేరుశనగ, పొద్దు తిరుగుడు, కొబ్బరి, పామ్ మొదలైన వృక్ష జాతుల నుండి వచ్చే నూనెల ద్వారా కొవ్వులు అందుతాయి. జంతు సబంధిత కొవ్వుల విషయానికి వస్తే నెయ్యి, వెన్న జున్ను, గుడ్లు వంటి వాటి నుండి కొవ్వులు లభిస్తాయి.

వృక్ష సంబంధమైన కొవ్వుల్లో అసంతృప్త కొవ్వు అమ్లాలు అధికంగా ఉంటాయి. జంతు సంబంధ కొవ్వుల్లో సంతృప్త కొవ్వు అమ్లాలు ఉంటాయి. సంతృప్త కొవ్వులు కలిగిన ఆహారాలను అధికంగా తీసుకోవటం ఏమాత్రం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. ఈ కొవ్వులు గుండె ధమనుల్లో చేరి రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తాయి. వీటి వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ ల ముప్పు పెరుగుతుంది.