Whisky-Tequila-Red Wine : విస్కీ టు రెడ్ వైన్.. ఇందులో ఏ ఆల్కాహాల్ మీ చర్మానికి బెస్ట్ అంటే?!

ఆల్కహాల్ అలవాటు ఉందా? రెడ్ వైన్.. విస్కీ, టేకిలా.. మీకు ఏదంటే ఇష్టం.. మీ ఫేవరెట్ డ్రింక్ ఏదైనా రాత్రి అయిందంటే చాలు.. గ్లాసు నింపాల్సిందే.. కిక్కు ఎక్కాల్సిందే.. లేదంటే ఆ రాత్రి గడవదంతే..

10TV Telugu News

Whisky-Tequila-Red Wine : ఆల్కహాల్ అలవాటు ఉందా? రెడ్ వైన్.. విస్కీ, టేకిలా.. మీకు ఏదంటే ఇష్టం.. మీ ఫేవరెట్ డ్రింక్ ఏదైనా రాత్రి అయిందంటే చాలు.. గ్లాసు నింపాల్సిందే.. కిక్కు ఎక్కాల్సిందే.. లేదంటే ఆ రాత్రి గడవదంతే.. అనేస్తుంటారు ఆల్కాహాల్ ప్రియులు. కానీ, ఆల్కహాల్ ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది అనేది కూడా అవగాహన ఉండాల్సిందే.. వాస్తవానికి ఆల్కహాల్ మన కాలేయ ఆరోగ్యానికి ముప్పు అనేది మనందరికి తెలిసిన సత్యమే.. వయస్సు పెరిగే కొద్ది ఇలాంటి హ్యాంగోవర్ లు అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తాయనేది కూడా గుర్తించాలి. అదేపనిగా ఆల్కాహాల్ సేవించడం వల్ల శరీరంలో లోపల అవయవాలే కాదు.. చర్మం ఆరోగాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందట.. రాత్రంతా మైకంలో తూగిన వారిలో ఉదయం లేవగానే ముఖమంతా ఉబ్బినట్టు కనిపిస్తుంది.

డీహైడ్రేషన్ అవుతుంది. చర్మంపై వాపుకు మితిమీరిన ఆల్కాహాల్ సేవించడమే అనేది గుర్తించుకోవాలి. ఆల్కహాల్ మన చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. తేమను లాగేసుకుంటుంది. ఫలితంగా పొడిబారి చర్మం కాంతిహీనంగా మారుతుంది. కాలక్రమేణా.. చర్మం మరింత దెబ్బతిని వృద్ధాప్య ఛాయలకు దారితీస్తుంది. వాపు అనేది చర్మంలోని రక్తనాళాల విస్తరణకు కారణమని చెప్పవచ్చు. మన చర్మ కణాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. చర్మాన్ని ఎర్రబడేలా చేస్తుంది. ముఖ్యంగా ఆల్కహాల్ – మిక్సర్లు కాక్టెయిల్స్‌లో చక్కెర స్థాయిల వల్ల కూడా చర్మంపై మంట ఏర్పడుతుంది. చక్కెర చర్మ కణాలను దెబ్బతీస్తుంది. కొన్ని మద్యాలు చర్మం ఆరోగ్యానికి మంచివి కాదని గుర్తించాలి. సాధారణంగా 8 గంటల నిద్రతో వచ్చే ఆరోగ్యం ఆల్కాహాల్ తో రాదు. మద్యం మత్తు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయినా ఆల్కాహాల్ సేవించకుండా ఉండలేరా.. అయితే ఏయే ఆల్కహాల్ ఆరోగ్యంపై తక్కువ ప్రభావాన్ని కలిగిస్తుందో ముందుగా తెలుసుకోండి. మీ చర్మం ఆరోగ్యానికి ఏయే ఆల్కాహాల్ మంచిదో కాదో ఓసారి లుక్కేయండి..

టేకిలా (Tequila) : మరీ బ్యాడ్ కాదు.. తాగొచ్చులే :
మీ చర్మం దెబ్బతినేలా తీసుకోకండి.. టేకిలా.. అనేది రెడ్ వైన్ లాంటిదే.. ఇది జీర్ణక్రియకు సాయపడుతుంది. రక్తంలో చక్కెరను తగ్గించడం లాంటి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీ చర్మం ఇతర ఆల్కహాల్‌తో పోలిస్తే.. ఇది తక్కువ చక్కెరను కలిగి ఉంటుంది. కడుపులో మంటను ప్రేరేపించే అవకాశం తక్కువగా ఉంటుంది. మీ టేకిలాకు ఉప్పు, చక్కెర యాడ్ చేయొద్దు. లేదంటే.. లేని సమస్యను కొనితెచ్చుకున్నట్టే.. హ్యాంగోవర్లతో చర్మం నీరసించేలా చేస్తాయి.

బీర్.. (Beer) : బ్రహ్మండంగా తాగొచ్చు :
మీకు బీర్ తాగే అలవాటు ఉందా? బ్రహ్మండంగా తాగొచ్చు.. మితిమీరి మాత్రం కాదు.. ఎక్కువగా సేవించినా ముఖం ఉబ్బరం సమస్య రావొచ్చు. బీర్‌లో సర్వసాధారణమైన దుష్ప్రభావం ఇది.. ఇందులో చక్కెర ఉప్పు రెండూ ఉంటాయి. బీర్ లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు ఉన్నాయి. చర్మానికి మంచి ప్రయోజనాలను కూడా అందించగలదు. తాగడం ద్వారా కాదని గుర్తించాలి. బీర్‌లో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉంటుంది. అందుకే నెమ్మదిగా సిప్ చేస్తారు. తద్వారా డీహైడ్రేషన్ తగ్గిస్తుంది. అందుకే తాగొచ్చు.. అంటున్నారు విశ్లేషకులు.

జిన్-వోడ్కా (Gin-Vodka) : పర్వాలేదు తాగొచ్చు :
జిన్ వోడ్కా రెండూ అధిక ఆల్కహాల్ కంటెంట్ కలిగినవే.. కానీ ఉప్పు, చక్కెర తక్కువగా ఉంటాయి. అందుకే శరీరం నుంచి వేగంగా బయటకు వస్తుంది. హ్యాంగోవర్లకు కారణమయ్యే అవకాశం చాలా తక్కువ కూడా. మీరు అమితంగా తాగినా పెద్దగా చర్మానికి ప్రభావం ఉండకపోవచ్చు. ఇందులో సోడా లేదా డైట్ టానిక్‌తో కలిగి ఉంటుంది. చక్కెర మిక్సర్లు జ్యూసులను దూరంగా ఉండండి. వోడ్కా టానిక్‌ను స్కిన్నీ బిచ్ (Vodka tonic) అని కూడా పిలుస్తారు.

వైట్ వైన్ ( White Wine) : అప్పుడప్పుడు తాగొచ్చులే :
కనిపించేంత ప్రమాదకరం కాదులే.. ఒక గ్లాసు వైట్ వైన్‌లో చాక్ ఫుల్ చక్కెర ఉంటుంది. మంట, చర్మ కణాల నష్టానికి దారితీస్తుంది. వృద్ధాప్య చాయలను పెంచుతుంది. ఇందులోని సల్ఫైట్లు ఇరిటేషన్ కలిగిస్తాయి. సున్నితమైన చర్మం ఉన్నవారికి సల్ఫైట్స్ కారణంగా చికాకు, చర్మం ఎర్రబారడం వంటి సమస్యలకు దారితీస్తుంది. Pinot Grigio బాటిల్ కు దూరంగా ఉంటే ఇలాంటి చర్మపు అనారోగ్య సమస్యలను దూరం పెట్టొచ్చు.

రమ్- విస్కీ (Rum – Whiskey) : మంచిది కాదు తాగొద్దు:
మీరు రమ్, కోక్, విస్కీ తాగాలనుకుంటే కాస్తా ఆలోచించండి. వీటితో తరచుగా హ్యాంగోవర్లను పోగట్టుకునేందుకు వాడుతుంటారు. డార్క్ రమ్, బోర్బన్ విస్కీ వంటి డార్క్ స్పిరిట్స్‌లో కంజెనర్‌లు ఉంటాయి. హ్యాంగోవర్లకు కారణమవుతాయి. చర్మంలో వృద్ధాప్య ఛాయలకు దారితీస్తుంది. వోడ్కా కంటే హ్యాంగోవర్‌కు దారితీసే అవకాశం ఉంది. స్పష్టమైన వోడ్కాతో సరిపెట్టుకోవడం మరి మంచిది. చక్కెర, కృత్రిమ స్వీటెనర్లతో కూడిన సోడాలతో చర్మంపై మొటిమల సమస్యకు కారణమవుతుంది.

రెడ్ వైన్ (Red Wine) : వామ్మో.. అసలే తాగొద్దు :
విస్కీ నుంచి టేకిలా నుంచి రెడ్ వైన్ కంటే రెడ్ వైన్ ఆరోగ్యకరమైనది.. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆరోగ్యమైనది.. ఇది సరియైనదా? అంటే కచ్చితంగా కాదనే చెప్పాలి. రెడ్ వైన్‌లోని యాంటీఆక్సిడెంట్లు మీ చర్మానికి యాంటీ ఏజింగ్‌కు మంచివి. రోసాసియా (rosacea) ముఖంపై ఎర్రటి దద్దర్లు వచ్చే అవకాశం ఉంది. వైట్ వైన్ మాదిరిగా ఇందులో చక్కెర లేదు.. కానీ చర్మాన్ని చికాకు కలిగించే సల్ఫైట్స్ ఉన్నాయి. రెడ్ వైన్ histamine విడుదల చేస్తుంది. తద్వారా చర్మం ఎర్రగా మారుతుంది. మీలో అలర్జీ వంటి సమస్యలు లేకపోతే రెడ్ వైన్ ఇబ్బందికరం కాదు..అది కూడా మితంగా తాగినప్పుడు మాత్రమేనట..

10TV Telugu News