పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే : గంటకు మించి ఫోన్లు ఇస్తే రిస్క్

మీ పిల్లలు గంటల తరబడి టీవీ చూస్తున్నారా? స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ స్ర్కీన్లకు అతుక్కుపోయి ఎక్కువ సమయం గేమ్స్ ఆడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.  ఏడాది పిల్లల నుంచి ఐదేళ్ల చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు.

  • Published By: sreehari ,Published On : April 25, 2019 / 07:51 AM IST
పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లోనే : గంటకు మించి ఫోన్లు ఇస్తే రిస్క్

మీ పిల్లలు గంటల తరబడి టీవీ చూస్తున్నారా? స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ స్ర్కీన్లకు అతుక్కుపోయి ఎక్కువ సమయం గేమ్స్ ఆడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.  ఏడాది పిల్లల నుంచి ఐదేళ్ల చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు.

మీ పిల్లలు గంటల తరబడి టీవీ చూస్తున్నారా? స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ స్ర్కీన్లకు అతుక్కుపోయి ఎక్కువ సమయం గేమ్స్ ఆడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త.  ఏడాది పిల్లల నుంచి ఐదేళ్ల చిన్నారుల విషయంలో నిర్లక్ష్యం పనికిరాదు. అన్నం తినకుండా మారం చేస్తున్నారని వారిని బుజ్జగించేందుకు టీవీ, స్మార్ట్ ఫోన స్ర్కీన్లపై వీడియోలు చూపించడం కామన్ అయిపోయింది. ఇంట్లో పిల్లలకు.. ఫోన్ స్ర్కీన్ చూపిస్తే తప్ప తినే పరిస్థితి లేదు. లేదంటే ఏడుస్తారని, తప్పని పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలను ఏదోలా బుజ్జగించేందుకు ఈ విధంగా చేస్తున్నారు.

అసలు సమస్య ఇక్కడే :
నిజానికి ఇలా చేస్తూ పోతే పిల్లలకు ఆరోగ్యానికి ఎంత ముప్పు వాటిల్లుతుందో గ్రహించలేకపోతున్నారు. భవిష్యత్తులో మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)హెచ్చరిస్తోంది. టీవీ, మొబైల్, కంప్యూటర్ స్ర్కీన్లను గంటల తరబడి చూస్తే.. అది పిల్లల ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపిస్తుంది అనేదానిపై యూనైటెడ్ నేషన్స్ ఏజెన్సీ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఐదేళ్ల లోపు పిల్లలను రోజులో గంట కంటే ఎక్కువగా టీవీని చూడనీవద్దు. వీడియోలు, కంప్యూటర్ గేమ్స్ కు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ ఓ సూచించింది. ఏడాది కంటే తక్కువ వయస్సు.. శిశువులను ఎలక్ట్రానిక్ స్ర్కీన్లను ఎట్టి పరిస్థితుల్లో దగ్గరగా ఉంచకూడదు. వీటివల్ల రేడియేషన్ ప్రభావం శిశువులపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తోంది. ఐదేళ్ల లోపు పిల్లలను ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండేలా వారితో ఆటలు ఆడించాలి.

రోజులో కనీసం 3 గంటలు వ్యాయామం :
సమయానికి కంటి నిండా నిద్రపోయేలా వాతావారణాన్ని కల్పించాలి. జీవితాంతం అదే అలవాట్లను అలవరుచుకునేలా చూడాలి. తద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే స్థూలకాయం, ఇతర వ్యాధుల నుంచి బయటపడవచ్చు. గంటల కొద్ది ఎలక్ట్రానిక్ డివైజ్ స్ర్కీన్లను చూడటం వల్ల చిన్నారులపై ఎంత ప్రభావం చూపిస్తుందో WHO నిపుణులు ఫియోనా బుల్ కొన్ని సూచనలు చేశారు. ఏడాది నుంచి నాలుగేళ్ల వయస్సు ఉన్న పిల్లలు రోజులో కనీసం మూడు గంటల పాటు వివిధ ఫిజికల్ యాక్టివిటీస్ చేయించాలని సూచించారు. ఏడాదిలోపు శిశువులతో నేలపై ఆడే ఆటలు ఆడించాలి. ఎలక్ట్రానిక్ స్ర్కీన్లను దూరంగా పెట్టాలని బుల్ చెప్పారు. 
Also Read : ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం : ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్

అధిక బరువుతో అనారోగ్య సమస్యలు : 
పిల్లలకు ఎలక్ట్రానిక్ స్ర్కీన్లు అలవాటు చేస్తూ పోతే.. అతిగా బరువు పెరిగిపోవడం, స్థూలకాయత్వం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నయన్నారు. ప్రపంచవ్యాప్తంగా స్థూలకాయంతో బాధపడేవారి సంఖ్య భారీగా పెరిగిపోయినట్టు WHO వెల్లడించింది. అధిక బరువు ఉన్నవారిలో ఎక్కువగా అకాల మరణాల నుంచి గుండెజబ్బులు, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొన్నిరకాల క్యాన్సర్లు పుట్టుకుచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అకాల మరణాలను అడ్డుకోవాలంటే.. చిన్నప్పటి నుంచే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలని బుల్ తెలిపారు.

5 ఏళ్ల లోపు పిల్లల్లో 4 కోట్ల మంది స్థూలకాయులే :
ఇప్పటి రోజుల్లో ముగ్గురిలో ఒకరు అధిక బరువు లేదా స్థూలకాయంతో బాధపడుతున్నారని, నలుగురిలో ఒకరు వ్యాయామం (శారీరక శ్రమ) తగినంత చేయడం లేదని ఆమె చెప్పారు. ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నారుల్లో ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ల (4 కోట్లు) మంది చిన్నారులు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. వీరిలో 50 శాతం మంది చిన్నారులు ఆఫ్రికాకు చెందినవారు ఉండగా.. మిగతావారంతా ఆగ్నేయ ఆసియా ప్రాంతలోవారే ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అధికబరువు కలిగిన పిల్లలు 5.9శాతంగా ఉన్నట్టు బుల్ వెల్లడించారు. 

ఈ జాగ్రత్తలు తప్పనిసరి : 
* పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి.
చాలామంది కాస్త దూరానికి కూడా బైక్ లు, కార్లలో వెళ్లడం చేస్తుంటారు.
వాహనాలను పక్కనపెట్టి కాసేపు కొంతదూరం నడవండి.. సైక్లింగ్ చేయండి.
పిల్లలు అయితే స్కూళ్లో కూర్చొవడం, టీవీ చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడడం తగ్గించేలా చూడాలి.
ఎక్కువ సేపు టీవీ, మొబైల్ స్ర్కీన్లు చూడటం వల్ల సరైన నిద్ర ఉండదు.. అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి
వయస్సు పెరిగే కొద్ది ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని WHO నిపుణుల సూచన.