Brinjal : వంకాయను ఎవరు తినకూడదంటే?

వంకాయ శరీరంలోని అదనపు ఐరన్‌ను తొలగిస్తుంది. వంకాయలో కరిగే పైబర్ ఎక్కువగా ఉండడం వల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది.

Brinjal : వంకాయను ఎవరు తినకూడదంటే?

Brinjal

Brinjal : వంకాయ అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. వంకాయలతో తయారు చేసే గుత్తివంకాయ కూరంటే లొట్టలేసుకుని మరీ లాగించేస్తారు. ముఖ్యంగా విందు భోజనాల్లో వంకాయ కూర తప్పకుండా ఉండాల్సిందే. వంకాయ టమాట, వంకాయ ఆలూ, వంకాయ ఫ్రై, చట్నీ ఇలా ఎన్నో రకాల వంటలు వంకాయతో సిద్ధం చేస్తారు. కొంతమంది వంకాయలను మంటలపై కాల్చి మసాలా వేసి తింటారు. వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి.

వంకాయ శరీరంలోని అదనపు ఐరన్‌ను తొలగిస్తుంది. వంకాయలో కరిగే పైబర్ ఎక్కువగా ఉండడం వల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది. వంకాయ శరీరంలోని విషతుల్యాలను, వ్యర్థాలను తొలగిస్తుంది. శరీరానికి అందే కెలోరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. వంకాయలను తినడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ఎక్కువ తీసుకుంటే దాని వల్ల ప్రమాదం ఉంటుంది. ఎసిడిటీ, అల్సర్స్ ఉన్నవారు వంకాయను తీసుకోక పోవటమే మంచిది.

జ్వరంగా ఉన్నప్పుడు వంకాయను అసలు తీసుకోకూడదు. వంకాయ తింటే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అందుకే ఫీవర్‌గా ఉన్నప్పుడు మీ డైట్‌లో వంకాయను తీసుకోకుండా ఉండటమే మంచిది. దీనివల్ల ఎలర్జీ వస్తుంది. వంకాయలు తినడం వల్ల రుతుస్రావంలో తేడాలతోపాటు కొన్ని సందర్భాల్లో గర్భస్రావం సైతం జరగే అవకాశాలు ఉంటాయి. స్కిన్ అలర్జీలతో బాధపడేవారు మాత్రం వంకాయలకు దూరంగా ఉండటమే మంచిది. చలికాలంలో వంకాయలను తక్కవ మోతాదులో తీసుకోవటం మంచిది.