దోమలను చంపి దాచుకుంటోంది.. కొన్నేళ్లుగా నోట్‌బుక్‌లో అతికిస్తోంది.. ఎందుకనీ ఆమెను అడిగితే.. !

దోమలను చంపి దాచుకుంటోంది.. కొన్నేళ్లుగా నోట్‌బుక్‌లో అతికిస్తోంది.. ఎందుకనీ ఆమెను అడిగితే.. !

Girl Collects Every Mosquito After Kill : ఎన్నో ఏళ్లుగా భారత్ దోమల బెడదను ఎదుర్కోంటోంది. ప్రతి ఇంట్లో ప్రతి చోట దోమల వ్యాప్తి కొనసాగుతూనే ఉంటోంది. మరుగునీటిలో దోమలు లార్వాలతో పెద్దసంఖ్యలో గుడ్లు పెట్టేస్తుంటాయి. దోమల కుట్టడం ద్వారా అనేక వ్యాధులను వ్యాపింపజేస్తున్నాయి. ప్రధానంగా మలేరియా, డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్నాయి. దేశంలో 2019 ఒక ఏడాదిలోనే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు 4లక్షల 87వేల వరకు నమోదయ్యాయి. ఇంట్లో ఈ దోమల బారినుంచి తప్పించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రయత్నిస్తుంటారు.

జెట్ కాయిన్స్, దోమ తెరలు, చర్మంపై లోషన్లు రాయడం, ఎలక్ట్రిక్ బ్యాట్ వంటివి ఎక్కువగా వాడేస్తున్నారు. అయినప్పటికీ ఈ దోమల బెడద తగ్గడం లేదు. అయితే అందరిలా కాకుండా 19ఏళ్ల యువతి Shreya Mohapatra వినూత్నంగా ప్రయత్నించింది. తన 14వ ఏటా డెంగ్యూ జ్వరం వచ్చింది. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉండేవని గుర్తు చేసుకుంది. అప్పటినుంచి దోమల బెడదను తప్పించుకోవడానికి కొన్ని ఏళ్లుగా దోమలను చంపుతూ వస్తోంది.


దోమలను పట్టుకుని చేతులతో కొట్టి చంపేస్తోంది. అంతేకాదు.. చంపిన దోమలను సేకరిస్తోంది. తన చేతుల్లో దోమలను నలిపి చంపేసి చనిపోయిన దోమలను నోట్ బుక్‌లో అతికిస్తోంది. ఢిల్లీకి చెందిన డిజైన్ విద్యార్థి రెండు ఏళ్లు క్రితం నుంచే దోమలను చంపడం మొదలుపెట్టింది. తన 12వ తరగతి పరీక్షల సమయంలో చలికాలం కావడంతో ఇంట్లోకి ఎక్కువగా దోమలు వచ్చేవి. దోమలు కుట్టడం ద్వారా తాను పరీక్షల్లో ఏకాగ్రత చూపించలేకపోయానని చెప్పుకొచ్చింది. అప్పుడే తాను దోమలను కుట్టుకముందే వాటిని చంపేయాలని నిర్ణయించుకున్నట్టు శ్రేయా తెలిపింది. తాను ఎన్ని దోమలను చంపాను గుర్తుచేసుకునేందుకు చంపిన దోమలన్నింటిని సేకరిస్తోంది. ఒక నోట్ బుక్‌పై నంబర్లు వేసి వాటి స్థానంలో చంపిన దోమలను అతికిస్తోంది.


తాను ఇలా దోమలను చంపి సేకరిస్తున్న విషయాన్ని ఎవరికి చెప్పలేదు. కనీసం ఇంట్లో తల్లి సహా కుటుంబ సభ్యుల్లో ఎవరికి కూడా తెలియదట. కానీ, 2020లో అక్టోబర్ నెలలో ఈ విషయం అందరికి తెలిసింది. తాను దోమలను చంపి అతికించిన నోట్ బుక్ ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బాగా వైరల్ అయింది. ట్విట్టర్ లో తాను పోస్టు చేసిన ఈ ఫొటోకు 110k లైక్స్ వచ్చాయి. 25వేల సార్లు షేర్లు చేశారు. 2015లో శ్రేయా ట్విట్టర్ లో చేరింది. అప్పట్లో 5,500 ఫాలోవర్లే ఉన్నారు. ఇప్పుడు వచ్చినంతగా రెస్పాన్స్ అప్పట్లో తన ట్వీట్లకు రాలేదు. ఎప్పుడైతే తన ట్విట్టర్ ఖాతాలో చంపిన దోమల ఫొటోను ‘సైకోపాత్, సీరియల్ కిల్లర్ అనే క్యాప్షన్ తో పోస్టు పెట్టిందో ఒక్కసారిగా వైరల్ అయింది. అప్పటినుంచి శ్రేయా ఫేమస్ అయిపోయింది.

 

View this post on Instagram

 

A post shared by Sukriti Sahni (@doodlydoodledoo)