COVID Vaccines Protection : కొవిడ్ ఇన్ఫెక్షన్ కంటే వ్యాక్సిన్లు మెరుగైన రక్షణను ఇస్తాయి ఎందుకంటే?

ప్రపంచమంతా కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా కేసులు, మరణాలతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. కరోనాను అంతం చేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి.

COVID Vaccines Protection : కొవిడ్ ఇన్ఫెక్షన్ కంటే వ్యాక్సిన్లు మెరుగైన రక్షణను ఇస్తాయి ఎందుకంటే?

Covid Vaccines Protection

COVID Vaccines Protection : ప్రపంచమంతా కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కరోనా కేసులు, మరణాలతో ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. కరోనాను అంతం చేసే వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేశాయి. కానీ, పూర్తిస్థాయిలో కరోనావైరస్ అంతం కాలేదు. ఇంకా పలు దేశాల్లో వ్యాప్తి తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. అసలు కరోనా ఇన్ఫెక్షన్ల కంటే కరోనా వ్యాక్సిన్లు మెరుగైన రక్షణ అందించగలవని అంటవ్యాధుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా వ్యాక్సిన్లు వైరస్ బారినుంచి రక్షించడమే కాకుండా బలమైన రోగనిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తాయి. కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఎలా ఎదుర్కోవాలో వ్యాక్సిన్ రోగనిరోధకత రెడీ అవుతుంది. వ్యాక్సిన్ వేయించుకున్నవారిలో కంటే వేయించుకోనివారిలో ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. అందుకే ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం ఉత్తమమని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

ఇర్విన్లోని కాలిఫోర్నియా యూనివర్శిటీలోని అంటు వ్యాధి నిపుణుడు, వ్యాక్సిన్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ డైరెక్టర్ ఫిలిప్ ఫెల్గ్నర్ సాక్ష్యం బలంగా ఉంది. ఉదాహరణకు, ఫెల్గ్నర్ మరియు ఇతర పరిశోధకులు కరోనావైరస్తో సహజంగా సోకిన వ్యక్తుల నుండి వేలాది రక్త నమూనాలను అంచనా వేశారు , ఎఫ్‌డిఎ-అధీకృత mRNA వ్యాక్సిన్ (ఫైజర్, మోడెర్నా) పొందినవారిలో రక్త నమూనాలను పరిక్షించారు. టీకాలతో రోగనిరోధక వ్యవస్థ చాలా బలంగా మారుతుందని ఫెల్గ్నర్ వివరించారు.

రెండవ షాట్ తరువాత, కొవిడ్ నుంచి కోలుకున్న వ్యక్తుల కంటే పది రెట్లు ఎక్కువ యాంటీబాడీలు కలిగి ఉన్నారని పరిశోధక బృందం గుర్తించింది. టీకాలు మెరుగైన రక్షణ అందించగలవని సిడిసి చెబుతోంది. టీకాలు కరోనాతో అనారోగ్యానికి గురికాకుండా మంచి రక్షణ అందిస్తుంది.కొరోనావైరస్ బారిన పడిన తరువాత టీకా అవసరం లేదని కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు చెబుతూనే ఉన్నారు. ఇంకా కొవిడ్ టీకాలు అనేక కారణాల వల్ల సహజంగా పొందిన సంక్రమణ కంటే మెరుగైన రోగనిరోధక శక్తిని ఉత్పత్తి చేస్తాయని గుర్తించారు.