శీతాకాలంలో ఎందుకు రోజు చిన్నదై, తొందరగా చీకటి పడుతుందో తెలుసా?

  • Published By: sreehari ,Published On : October 8, 2020 / 05:43 PM IST
శీతాకాలంలో ఎందుకు రోజు చిన్నదై, తొందరగా చీకటి పడుతుందో తెలుసా?

శీతాకాలం వచ్చిందంటే.. చెట్లపై ఆకులన్నీ అందమైన వర్ణాల్లోకి మారిపోతాయి. అప్పడే ఆకులన్నీ రాలిపోతుంటాయి. ప్రకృతిలో సహజంగా జరిగిపోతుంది.. దీన్నే (autumn) శిశిర ఋతువు (ఆకురాలు కాలం) లేదా హేమంతం ఋతువు అని పిలుస్తారు.. వేసవికాలానికి ముందు ఇలా జరుగుతుంది. శీతాకాలంలో రోజులు వేసవి కంటే వేగంగా గడిచినట్టుగా అనిపిస్తుంది..



ప్రతిరోజు చాలా చిన్నదిగా అనిపిస్తుంది.. వెంటనే చీకటి పడేస్తుంది.. ఎందుకిలా జరుగుతుందంటే? శీతాకాలంలో (autumn) సీజన్ సమయం ప్రతిరోజు వేసవి కంటే ఎందుకు తక్కువగా ఉంటుందంటే.. అదంతా భూమి అక్షం ఆధారంగానే జరుగుతుంది. సూర్యుని చుట్టూ భూమి పరిభ్రవిస్తుందని తెలిసిందే..



ఉత్తర, పశ్చిమ అక్షంలోని వాతావరణ పరిస్థితులు విరుద్ధంగా మారిపోతాయి. దీని కారణంగానే వేసవి కాలంలో పగలంతా ఎక్కువ సమయం ఉండి.. రాత్రిళ్లూ తక్కువగా ఉంటాయి..

Why do days get shorter and darker with autumn?

అదే శీతాకాలానికి వచ్చేసరికి పగలంతా తక్కువగా ఉండి..రాత్రిళ్లూ ఎక్కువగా ఉంటాయి.. వెంటనే చీకటి పడిపోతుంది.. సమయం ఎప్పుడు గడిచిపోయిందో తెలియదు.. రోజులు తొందరగా గడిచిపోయిన ఫీలింగ్ అనిపిస్తుంటుంది. దీనికి వెనుక ఒక ప్రత్యేక కారణం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు..



భూమి అక్షం దానికి లంబంగా (90 డిగ్రీల కోణంలో) నేరుగా కింది క్షక్షలోకి వెళ్తుంది. ప్రతి 365.25 రోజులకు భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంటుంది. కొన్నిసార్లు ఉత్తర అర్ధగోళం సూర్యుడికి దగ్గరగా ఉంటుంది. దాన్ని వేసవి (Summer) కాలం అంటారు.. కొన్నిసార్లు అది దూరంగా ఉంటుంది.. అప్పుడు శీతాకాలం(Winter)గా చెప్పవచ్చు. వేసవిలో రోజులు ఎందుకు ఎక్కువ ఉంటాయి? శీతాకాలంలో ఎందుకు తక్కువగా ఉంటాయో తెలుసుకుందాం..



సాధారణంగా భూమి ప్రతి 24 గంటలకు తన చుట్టూ తాను పరిభ్రమిస్తూ ఉంటుంది. భూమి ఎప్పుడు ఉత్తర ధ్రువం నుంచి పశ్చిమ ధ్రువానికి తిరుగుతుంటుంది.

Why do days get shorter and darker with autumn?

అప్పుడు ఒక భూమి ఒక భాగంవైపునే సూర్యుడు కనిపిస్తాడు.. అది పగలంటారు.. దానికి వ్యతిరేక దిశలో అంతా చీకటిగా ఉంటుంది.. అప్పుడు చీకటి రాత్రిగా చెబుతారు. ప్రతి 365.25 రోజులకు భూమి సూర్యుని చుట్టూ తిరగడం పూర్తి అవుతుంది.